twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    10 గ్రామాలను దత్తత తీసుకున్న మంచు విష్ణు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: గ్రామాలను దత్తత తీసుకోవడం అనేది ఇటీవల కాలంలో నోబుల్ ట్రెండ్ గా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నాయి. ఇదే సమయంలో సొంతూరిని దత్తత తీసుకోవాలనే కాన్సెప్టుతో వచ్చి విజయం సాధించింది మహేష్ బాబు ‘శ్రీమంతుడు' మూవీ. మహేష్ బాబు ఇప్పటికే తన నేటివ్ విలేజ్ బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు.

    తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు కూడా తన సొంత చిత్తూరులో జిల్లాలో 10 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో మంచు విష్ణు స్పందిస్తూ.... చిత్రూరు జిల్లా చంద్రగిరి మండలంలో 10 గ్రామాలను దత్తత తీసుకున్నాను. అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేదిపై ప్లాన్ చేస్తున్నట్లు, త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.

     Tollywood star Manchu Vishnu adopts 10 villages

    గ్రామాల్లో తాగునీరు, విద్య లాంటి అవసరాలపై మంచు విష్ణు ముందుగా దృష్టి సారించనున్నారు. గవర్నమెంటు స్కూల్స్ లో టాయిలెట్స్ నిర్మాణానికి ఇప్పటికే చర్యలు చేపట్టారు. త్వరలోనే ఆయన ఏపీ సీఎం చంద్రబాబును కలిసి గ్రామాల అభివృద్ది విషయంలో తన విజన్ గురించి మాట్లాడనున్నారు.

    మంచు విష్ణు గ్రామాలను దత్తత తీసుకోవడంపై ఆయన సోదరుడు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ... మై బ్రదర్ విష్ణు 10 గ్రామాలను దత్తత తీసుకున్నారని చెప్పడానికి గర్వ పడుతున్నాను. గుడ్ లక్ అన్నా అంటూ వ్యాఖ్యానించారు.

    English summary
    "Proud to say that my brother Vishnu Manchu adopted 10 villages smile emoticon may the positive force and gods blessings be with himsmile emoticon Good Luck anna" Manchu Manoj said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X