twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గీతా మాధురికి డౌటొచ్చింది... ఇలా సోషల్ మీడియాలో ....., ఆన్సర్ చెప్తారా? (వీడియో)

    తాజాగా గీతా మాధురికి ఓ డౌట్‌ వచ్చింది. వెంటనే ఆ డౌట్‌ను సోషల్‌మీడియా ద్వారా వెల్లడించి సమాధానం చెప్పమని అడిగింది

    |

    ప్రస్తుతం తెలుగు లీడింగ్‌ ఫిమేల్‌ సింగర్స్‌లో గీతా మాధురి ఒకరు. హిట్‌ సాంగ్స్‌, పలు షోల ద్వారా ఇప్పటికే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన గీత సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో రెగ్యులర్‌ టచ్‌లో ఉంటుంది.తనదైన స్టయిల్‌లో పాటలను పాడి కుర్రకారుకి బాగా గుర్తండే విధంగా ఫుల్‌ జోష్‌తో తన స్వరాన్ని వినిపించిన గీతా మాధురి త్వరలో వెండి తెరపైకి రానుంది.

    ఇదివరకే లఘు చిత్రాలలో నటించిన గీత పాటలతోనే చాలా బిజీ అయింది. అందమైన స్వరంతో పాటు అందమైన రూపం కలిగన గీత సినిమాల్లోకి రావాలని ఈమె అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. అభిమానులకు గుడ్‌ న్యూస్‌. ఇంతవరకు తన స్వరంతో, బుల్లి తెరపై పలు షోలతో ఆకట్టుకున్న గీత త్వరలో వెండి తెరపైకి రాబోతుంది. తాజాగా ఈమెకు ఓ డౌట్‌ వచ్చింది.

    వెంటనే ఆ డౌట్‌ను సోషల్‌మీడియా ద్వారా వెల్లడించి సమాధానం చెప్పమని అడిగింది. ఆ డౌట్‌ ఏంటంటే.. పిల్లలకు చాలా మంది పెద్దలు 'దీర్ఘ స్నానం.. శీఘ్ర భోజనం' అనే సామెత చెబుతుంటారు. అంటే స్నానం నెమ్మదిగా చేయాలి. భోజనం మాత్రం చాలా వేగంగా చేయాలి అనేది దాని అర్థం. మరికొంత మంది మాత్రం స్నానమే కాదు.. భోజనం కూడా నెమ్మదిగానే చేయమని చెబుతుంటారు. నెమ్మదిగా నమిలి తింటేనే.. తిన్నది వంటబడుతుందని వారి ఉద్దేశం. మరి, ఈ రెండింటిలో ఏది నిజం అనేది గీత డౌట్‌. సమాధానం తెలిసిన వారు సోషల్‌ మీడియా కాస్త అక్కడ ఒక కామెంట్ పెట్టంది మరి..

    English summary
    I always believe that there is a strong,scientific and valid reason for our customs and traditions. I want to know few of them...here comes my first doubt..singar Geetha Madhuri asks on her facebook wall
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X