»   » ట్రేడ్ టాక్ : 'రెమో', ' జయమ్ము నిశ్చయమ్ము రా' పరిస్దితి ఏంటి? కష్టమేనా?

ట్రేడ్ టాక్ : 'రెమో', ' జయమ్ము నిశ్చయమ్ము రా' పరిస్దితి ఏంటి? కష్టమేనా?

ఈ శుక్రవారం రిలీజైన రెమో, ' జయమ్ము నిశ్చయమ్ము రా' రిలీజ్ ముందు పాజిటివ్ బజ్ ఉన్నా పెద్ద కలిసి వచ్చేటట్లు కనపడటం లేదు. మౌత్ టాక్, రివ్యూలు దెబ్బ కొట్టాయని తెలుస్తోంది.

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ శుక్రవారం రెండు సినిమాలు తెలుగు భాక్సాఫీస్ ని పలకరించాయి. అందులో ఒకటి దిల్ రాజు డబ్బింగ్ చేసి విడుదల చేసిన రెమో. మరొకటి కమిడియన్ నుంచి హీరోగా మారిన శ్రీనివాస రెడ్డి చిత్రం ' జయమ్ము నిశ్చయమ్ము రా'. ఈ రెండు చిత్రాలకు రిలీజ్ ముందు పాజిటివ్ బజ్ ఉంది.

రెండు సినిమాలు బాగా ప్రమోట్ చేయటంతో , డీసెంట్ ఆక్యుపెన్సీతో రిలీజ్ అయ్యాయి. అయితే ఈ చిత్రాలకి మౌత్ టాక్, రివ్యూలు మిక్సెడ్ గా రావటం మైనస్ అయ్యింది. దాంతో వీకెండ్ కూడా వీటికి పెద్దగా కలిసివచ్చేటట్లు కనపడటం లేదు. ఈ పరిస్దితుల్లో సోమవారం నుంచి ఈ సినిమాల కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయనేది పజిల్ గా మారింది.

మరో ప్రక్క వారం క్రితం విడుదలైన నిఖిల్ తాజా చిత్రం ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా భారీ క‌లెక్ష‌న్స్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోని అడుగుపెట్టింది. నిఖిల్ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సోషియా థ్రిల్ల‌ర్ మూవీ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా. హెబ్బాప‌టేల్‌, నందిత‌శ్వేత‌, అవికాగోర్ హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి.వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మించారు.

Trade Talk: Remo & Reddy No Match to Chinnavadu

న‌వంబ‌ర్ 18న విడుద‌లైన ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా విడుద‌లైన ఆట నుండి సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని నిఖిల్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌ను సాధించింది. సినిమా విడుద‌లైన తొలి వారంలోనే 20 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసి నిఖిల్ సినిమాల్లో టాప్ చిత్రంగా నిలిచింది.

యు.ఎస్‌లో సినిమా హాఫ్ మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్‌ను సాధించిన ఈ చిత్రం స‌క్సెస్‌ఫుల్‌గా రెండో వారంలో అడుగుపెట్ట‌డ‌మే కాకుండా మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్‌ను సాధించ‌డానికి శ‌ర‌వేగంగా ప‌రుగులు తీస్తుంది. రెండోవారంలోకి ఎంట‌ర్ అవుతున్నా థియేట‌ర్స్ అన్నీ హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌, ద‌ర్శ‌కుడు ఆనంద్ టేకింగ్ నిర్మాత‌లు అన్‌కాంప్ర‌మైజ్‌డ్ మేకింగ్‌ల‌తో పాటు నిఖిల్ ఎక్స‌లెంట్ పెర్‌ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ థియేటర్స్‌లో బ్ర‌హ్మార‌థం ప‌డుతున్నారు. సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్‌, తిరుగులేని క‌లెక్ష‌న్స్‌తో నిఖిల్ ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి

English summary
Nikhil's 'Ekkadiki Pothavu Chinnavada', which hit screens last Friday is already running successfully in theatres and the poor word of mouth for the new releases may further propel its returns at box office.
Please Wait while comments are loading...