»   » త్రివిక్రమ్, నితిన్ 'అ..ఆ.' టైటిల్ లోగో ఇదిగో

త్రివిక్రమ్, నితిన్ 'అ..ఆ.' టైటిల్ లోగో ఇదిగో

Written by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : త్రివిక్రమ్ డైరక్షన్ లో నితిన్ హీరోగా రెడీ అవుతున్న సినిమా అ..ఆ..(అనసూయా రామలింగం వెర్సస్ ఆనంద్ విహారి). నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని విడుదలచేసారు. దీనికి సంబందించిన నితిన్ తన ఫేస్ బుక్ లో పెట్టిన ఫోస్ట్ ను ఇక్కడ చూడండి.

Presenting the logo of my upcoming film with Trivikram garu! A.. Aa... #HappyNewYear guys!

Posted by Nithiin onThursday, December 31, 2015


మెదటి అ..లో అమ్మయి బోమ్మను, రెండో ఆ..లో అబ్బాయి బోమ్మతో ఆకట్టుకుంది ఈ ఫోస్టర్. ఏది ఎమైనా త్రివిక్రమ్ తన ప్రతిభను మరోకసారి చూపించారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేయటానికి నిర్ణయించారని సమాచారం. అయితే అందుతున్న సమచారాన్ని బట్టి.... ఏ మాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూగా సినిమాని షూట్ చేసి ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా అనిరుద్ తెలుగులోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇందులో మరో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్‌ని ఎంపిక చేసుకొన్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'ప్రేమమ్‌'తో పేరు సంపాదించింది అనుపమ.

నిర్మాత మాట్లాడుతూ ''త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఇదివరకు 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల్ని నిర్మించాం. మా కలయికలో మూడో చిత్రంగా 'అ ఆ' రూపొందుతోంది. తొలిసారి నితిన్‌ సరసన సమంత నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.


ఈ చిత్రం కు సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: నటరాజ్‌ సుబ్రమణియన్‌, కళ: రాజీవన్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సౌండ్‌ డిజైనింగ్‌: విష్ణుగోవింద్‌, శ్రీశంకర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్...పిడివి ప్రసాద్. ఈ సినిమాని శ్రీమతి మమత సమర్పిస్తున్నారు.

English summary
Trivikram Srinivas and Nithin's A..Aa (Anasuya Ramalingam Vs Anand Vihari) have released their film logo on the occasion of New Year eve.
Please Wait while comments are loading...