twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ కామెంట్స్ విని మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఆ మధ్యన విడుదలైన మహేష్ బాబు తాజా చిత్రం "బ్రహ్మోత్సవం" మార్నింగ్ షో నుంచి విపరీతమైన నెగిటివ్ టాక్ దక్కించుకొని చివరకు పెదద్ డిజాస్టర్ చిత్రంగా మిగిలిసన సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. వాళ్లు వీళ్లూ అనే లేకుండా సినిమా చూసిన ప్రతిఒక్కరూ "సినిమా బాలేదు" అనే మౌత్ టాక్ తో ఈ సినిమాని షెడ్డుకు పంపించేసారు. అంతవరకూ బాగానే ఉంది.

    వాస్తవానికి ఏ హీరో కెరీర్ లో అయినా హిట్ లు, ప్లాఫ్ లు కామన్. అయితే ఇప్పుడు పుండుమీద కారం చల్లినట్లుగా టీఆర్ ఎస్ ఎమ్మల్యే బాల కిషన్..ఈ సినిమాపై చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి, మహేష్ అభిమానులను బాధ పెట్టాయి.

    బాలకిషన్ ఏమంటారంటే... ''నేను రాజకీయ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తుంటా. ఈ మధ్య ఓ సినిమా గురించి చాలా మంచిగా విని.. థియేటరుకెళ్లి క్యూలో నిలుచుని టికెట్ కొని సినిమా చూశా. అదే.. బిచ్చగాడు. దీంతో పాటు బ్రహ్మోత్సవం సినిమా కూడా రిలీజైంది. ఐతే బిచ్చగాడు బాక్సాఫీస్ దగ్గర బ్రహ్మోత్సవం చేసుకుంటే.. బ్రహ్మోత్సవం మాత్రం కలెక్షన్లు లేక బిచ్చగాడిగా మారిపోయింది'' అన్నారు . ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

    స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...

    బదులుగా

    బదులుగా

    చాలా చోట్ల "బ్రహ్మోత్సవం"కి బదులుగా తమిళ అనువాద చిత్రం "బిచ్చగాడు" చిత్రాన్ని తమ థియేటర్లలో ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యాలు రెడీ అయ్యాయి. రిలీజైన మూడో నాటి నుంచే చాలా చోట్ల బిచ్చగాడు షోలు వేసారు.

    యాభై లక్షలకే తీసుకున్నా

    యాభై లక్షలకే తీసుకున్నా

    తమిళంలో హిట్టైన పిచ్చైకారన్ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ని తెలుగులో రిలీజ్ చేసిన చదలవాడ కేవలం యాభై లక్షలుకు తీసుకున్నారు. తర్వాత కోటిన్నర వరకూ పబ్లిసిటీపై ఖర్చు పెట్టారు. ఇప్పుడీ చిత్రం 13 కోట్లు వసూలు చేసి రికార్డ్ లు క్రియేట్ చేసింది.

    ఫ్లాఫే కలిసి వచ్చిందా

    ఫ్లాఫే కలిసి వచ్చిందా

    ట్రేడ్ వర్గాలు ఈ విషయాలని విశ్లేషిస్తూ...బ్రహ్మోత్సవం ఫ్లాఫ్ కావటమే ఈ సినిమాకు ఇంత పెద్ద హిట్ అవటానికి కలిసి వచ్చింది అంటున్నారు.

    ధియేటర్స్ దొరికేవి కాదు

    ధియేటర్స్ దొరికేవి కాదు

    ఎందుకంటే బ్రహ్మోత్సవం హిట్ అయ్యి ఉంటే బిచ్చగాడు కు సరైన ధియేటర్స్ దొరికేవి కాదు.

    బిచ్చగాడు నిర్మాత మాట్లాడుతూ..

    బిచ్చగాడు నిర్మాత మాట్లాడుతూ..

    "మేము మొదటి వారంలో బిచ్చగాడు సినిమాని కేవలం యాభై నుంచి అరవై ధియేటర్స్ మాత్రమే దొరకటంతో విడుదల చేసాం. రెండోవారం బ్రహ్మోత్సవం డిజాస్టర్ అవటంతో చాలా ధియేటర్స్ లో మా సినిమాని రీప్లేస్ చేసారు

    కంటెంటే కారణం

    కంటెంటే కారణం

    నేను బ్రహ్మోత్సవం కు వచ్చిన నెగిటివ్ టాక్ తో ఇలా చేసారనటం లేదు. కేవలం బిచ్చగాడు కంటెంట్ బాగుండటమే కారణం అంటున్నా ను," అన్నారు నిర్మాత చదలవాడ. నాలుగోవారంలో కూడా బిచ్చగాడు సినిమా అదరకొట్టే కలెక్షన్స్ తో నడుస్తోంది అన్నారు.

    English summary
    TRS MLA Rasamayi Balakishan at a film event made comparison between two movies- Bichagadu and Brahmotsavam and thereby belittled Mahesh Babu starrer movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X