» 

టిఎస్సార్-టీవీ 9 అవార్డ్స్ : విజేతలు బాలయ్య, నాగ్, బన్నీ, చెర్రీ...

Posted by:

హైదరాబాద్ : 2011, 2012 సంవత్సరానికి గాను టి సుబ్బిరామిరెడ్డి-టీవీ 9 జాతీయ అవార్డుల ప్రకటన గురువారం జరిగింది. టిఎస్ఆర్ లిలిత కళా పరిషత్ వ్యవస్థాపకులు టి సుబ్బిరామిరెడ్డి ఈ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ..ఈ అవార్డు విజేతలను టీవీ9 ద్వారా వచ్చిన ఎస్‌.ఎం.ఎస్‌.ద్వారా ఎంపికచేసి వాటిని మా కమిటీ సభ్యులైన నాగేశ్వరరావు, సుశీల, డా. డి.రామానాయుడు, జయసుధ ఆధ్వర్యంలో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేశామని తెలిపారు. ఈ అవార్డులను వివిధ రంగాల్లో విశిష్టమైన వ్యక్తులచేత బహూకరింపజేస్తామని తెలిపారు. ఈనెల 20న శిల్పకళావేదికలో ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

అక్కినేని మాట్లాడుతూ...స్వార్థ, ప్రత్యేక దృష్టి లేకుండా సమష్టిగా ఈ అవార్డుల ఎంపిక జరిగింది. 1954కు ముందు ఎటువంటి అవార్డులూ దేశంలో లేవు. అవార్డులు ఇవ్వాలంటే డబ్బే కాదు. కళలపట్ల ఆసక్తి ఉండాలి. అటువంటి వ్యక్తి టి.సుబ్బిరామిరెడ్డి. ఈ అవార్డులను ఇవ్వడం మంచి పరిణామమని' అన్నారు.

అవార్డుల వివరాలు:
2011 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా బాలకృష్ణ (శ్రీరామరాజ్యం), ఉత్తమ కథానాయకుడిగా అల్లు అర్జున్‌ (బద్రీనాథ్‌), ఉత్తమనటిగా తాప్సీ (మొగుడు), ఉత్తమ కథానాయికగా తమన్నా (100%లవ్‌), దర్శకుడిగా శ్రీనువైట్ల (దూకుడు), నిర్మాతగా యలమంచిలి సాయిబాబా (శ్రీరామరాజ్యం), సపోర్ట్‌ ఆర్టిస్టు ప్రకాష్‌రాజ్‌ (దూకుడు), కమేడియన్‌ బ్రహ్మానందం (దూకుడు), క్యారెక్టర్‌ నటిగా సన (వీడింతే), సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. థమన్‌ (దూకుడు), ప్లేబ్యాక్‌ సింగర్‌ కార్తీక్‌ (మొగుడు), గాయనిగా రమ్య (దూకుడు), నెగెటివ్‌రోల్‌ మంచు లక్ష్మి (అనగనగా ఒక ధీరుడు), స్పెషల్‌ జ్యూరీఅ వార్డు ఛార్మి (మంగళ), రాంకీ ( గంగపుత్రులు) ఎంపికయ్యారు. ఇదికాకుండా స్పెషల్‌ జ్యూరీఅవార్డు కేటగిరిలో నిర్మాత, నటుడిగా నాగార్జున, నటిగా స్నేహ, బాలనటిగా బేబీ ఆనీ ఎంపికయ్యారు.

2012కు గాను ఉత్తమ నటుడిగా నాగార్జున (శిరీడీసాయి), హీరోగా రామ్‌చరణ్‌ (రచ్చ), నటిగా సమంత (ఈగ), హీరోయిన్‌గా అనుష్క (డమరుకం), దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌ (బిజినెస్‌మేన్‌), నిర్మాతగా మహేష్‌ రెడ్డి (శిరిడీసాయి), క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కోట శ్రీనివాసరావు (కృష్ణం వందే జగద్గురు), కమేడియన్‌గా బ్రహ్మానందం (దేనికైనా రెడీ), నటిగా సురేఖావాణి (దేనికైనా రెడీ), సంగీతదర్శకుడిగా దేవీశ్రీప్రసాద్‌ (ఢమరుకం), ప్లేబ్యాక్‌ సింగర్‌గా వడ్డేపల్లి శ్రీనివాస్‌ (గబ్బర్‌సింగ్‌ ..ఏ పిల్ల), (గాయనిగా కౌసల్య (శిరిడీ సాయి.. సాయి..సాయి..) ఎంపికచేశారు. ఇవికాక.. స్పెషల్‌ జ్యూరీ అవార్డుల క్రింద 11మందినిఎంపికచేశారు.

బాలీవుడ్ పరిశ్రమకు గాను 12 అవార్డులను ఎంపికచేశారు. అందులో శ్రీదేవి, బోనీకపూర్‌, అనిల్‌కపూర్‌, శత్రుఘ్నసిన్హా, జీనత్‌అమన్‌, రాణీముఖర్జీ, అమీషాపటేల్‌, రవీనా టాండన్‌, దియామీర్జా, గుల్షన్‌ గ్రోవర్‌, ముఖేష్‌ రుషి, అల్కా యాజ్ఞిక్‌ ఉన్నారు. ఇవి కాకుండా తమిళరంగానికి సిల్వర్‌స్క్రీన్‌ సెన్సేషనల్‌ అవార్డు క్రింద అర్జున్‌, లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు రాధిక, శరత్‌కుమార్‌లు ఎంపికయ్యారు. కన్నడలో ఉత్తమనటిగా ప్రియమణి, స్పెషల్‌ జ్యూరీకి కృష్ణన్‌ శ్రీకాంత్‌ ఎంపికయ్యారు. మలయాళంలో స్పెషల్‌ జ్యూరీ అవార్డుక్రింద శోభనను ఎంపికచేశారు.

ఈ అవార్డు విజేతలను టీవీ9 ద్వారా వచ్చిన ఎస్‌.ఎం.ఎస్‌.ద్వారా ఎంపికచేసారు.

కమిటీ సభ్యులైన నాగేశ్వరరావు, సుశీల, డా. డి.రామానాయుడు, జయసుధ ఆధ్వర్యంలో ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేశారు.

మూడు భాషల్లోనివారిని పిలిచి అవార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయమని డా.డి. రామానాయుడు తెలిపారు.

జయసుధ మాట్లాడుతూ...ఇంకా సాంకేతిక సిబ్బందిని కూడా అవార్డుల్లో చేరిస్తే బాగుంటుందని సూచించారు.

గాయిని సుశీల మాట్లాడుతూ ఇటీవలే పరమపదించిన గాయకుడు పి.బి.శ్రీనివాస్‌ పేరిట ప్రత్యేక అవార్డును ఏర్పాటుచేయాలని సూచించారు.

ఈ నెల 20వ తేదీన శిల్పకళా వేదికలో అవార్డుల ప్రధానం జరుగనుంది.

టీఎస్ఆర్-టీవీ 9 అవార్డుల ప్రకటన కార్యక్రమంలో జయసుధ

టీఎస్ఆర్-టీవీ 9 అవార్డుల ప్రకటన కార్యక్రమంలో సుబ్బిరామిరెడ్డి, నాగేశ్వరరావు

Read more about: t subbarami reddy, shirdi sai, sri rama rajyam, damarukam, dookudu, eega, gabbar singh, tv9, టి సుబ్బిరామిరెడ్డి, శిరిడి సాయి, శ్రీరామ రాజ్యం, డమరుకం, ఈగ, గబ్బర్ సింగ్, టీవీ 9
English summary
Hyderabad: The T Subbarami Reddy-TV9 film awards for the year 2011-12 were announced here Thursday by MP and TSR Lalithakala Parishad founder T Subbarami Reddy. While artists from Telugu industry were honored in different categories, members from Tamil and Malayalam industries along with Bollywood have been chosen for special jury awards. The awards ceremony will be held on Saturday at Shilpa Kala Vedika here.

Telugu Photos

Go to : More Photos