twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్.. గాడిద, గుర్రం కథ తెలిసిందా!.. ట్యూబ్‌లైట్ ఓ గుణపాఠం..

    గాడిద చేయాల్సిన పని గాడిద.. గుర్రం చేయాల్సిన గుర్రం చేయాలని మన పెద్దలు ఊరకనే చెప్పలేదు. ఈ సత్యం కనుక బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌కు బోధపడి ఉంటే ట్యూబ్‌లైట్ లాంటి దారుణమైన పరాజయం.

    By Rajababu
    |

    గాడిద చేయాల్సిన పని గాడిద.. గుర్రం చేయాల్సిన గుర్రం చేయాలని మన పెద్దలు ఊరకనే చెప్పలేదు. ఈ సత్యం కనుక బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌కు బోధపడి ఉంటే ట్యూబ్‌లైట్ లాంటి దారుణమైన పరాజయం మూటగట్టుకునే వాడు కాదేమో.. రంజాన్ లక్ష్యంగా చేసుకొని శుక్రవారం రిలీజ్ చేసిన ట్యూబ్‌లైట్ చిత్రం కలెక్షన్లు దారుణంగా ఉండటం బాలీవుడ్ వర్గాలను కంగు తినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ కెరీర్‌లోనే అత్యంత ఘోరమైన ఫెయిల్యూర్‌గా ఈ సినిమా రికార్డుకెక్కనున్నది.

    ఇమేజ్‌కు భిన్నంగా సల్మాన్

    ఇమేజ్‌కు భిన్నంగా సల్మాన్

    సల్మాన్ ఖాన్ అంటే ఓ మాస్ హీరో. తెరమీద ఫైట్స్, స్టెప్పులేస్తే అభిమానులు పూనకంతో ఊగిపోవాలి. అదీ సల్మాన్ స్టామినా. షర్ట్ ఇప్పితే అమ్మాయిలు ఫిదా అయిపోవాలి అది సల్లూభాయ్ క్రేజ్. అలాంటి అంశాలన్ని పక్కన పెట్టి ఆర్ట్ సినిమాను మించిన కథతో ట్యూబులైట్‌ను తెరకెక్కించారు. హీరోయిజం ఏమాత్రం కనిపించిన పిచ్చి పాత్రలో కనిపించడం ఫ్యాన్స్‌కు మింగుడుపడలేదు. సినిమా మధ్యలో లేచిపోయే సన్నివేశాలు థియేటర్లలో దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి.

    ఆర్ట్ సినిమాల్లో మాదిరిగా రోల్

    ఆర్ట్ సినిమాల్లో మాదిరిగా రోల్

    1962లో భారత, చైనాల మధ్య జరిగిన యుద్దం ఈ సినిమా నేపథ్యం అని అదరగొట్టారు. ఈ చిత్రం సల్మాన్ కెరీర్‌లోనే మైలురాయి అంటూ ప్రచారం చేశారు. చివరకు చూస్తే వీటన్నింటికి భిన్నంగా ఓ అమాయకుడిలా సల్మాన్ ఖాన్ కంటతడి పెట్టడం, ఎవడు పడితే వాడి చేతిలో సల్మాన్ చెంపదెబ్బలు తినడం ఇంతవరకు ఏ సినిమాలో కనిపించలేదు.

    దారుణంగా ట్యూబ్‌లైట్ కలెక్షన్లు

    దారుణంగా ట్యూబ్‌లైట్ కలెక్షన్లు

    మాస్ హీరోకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సల్మాన్‌ను ట్యూబ్‌లైట్ చిత్రంలో రోల్ చూసి అభిమానులు షాకైపోయారు. దాని ఫలితం పేలవమైన కలెక్షన్లు. రంజాన్ సెలవు, సుదీర్ఘమైన వారాంతంలో ట్యూబ్‌లైట్ చిత్రం ఎలాగోలా ఓ మోస్తారు కలెక్షన్లు సాధించింది. రంజాన్ మరుసటి దినం అంటే మంగళవారం ట్యూబ్‌లైట్ కలెక్షన్లు దారుణంగా క్షీణించాయి. మంగళవారం కేవలం రూ.11.75 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

    సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత ఫ్లాప్

    సల్మాన్ కెరీర్‌లోనే అత్యంత ఫ్లాప్

    ట్యూబ్‌లైట్ చిత్రం శుక్రవారం రోజున రూ.20.75 కోట్లు, శనివారం రూ.10.75, ఆదివారం రూ.22.25 కోట్లు, సోమవారం, మంగళవారం రూ.11.75 కోట్లు వసూలు చేసింది. సల్మాన్ కెరీర్‌ను ఓ సారి పరిశీలిస్తే నాలుగు రోజుల కలెక్షన్లు ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి మునుపెన్నడూలేదు. దీనిని బట్టి అభిమానులు తన నుంచి ఏమి కోరుకుంటున్నారో.. తాను ఎలాంటి సినిమాలను ఎంచుకోవాలో అనే విషయం ట్యూబ్‌లైట్ చేసి ఉంటుందనే అనుకొందాం.

    English summary
    The Tuesday collections of Kabir Khan directorial Tubelight are finally out. The Salman Khan film saw a huge dip in it's box office numbers post Eid. The movie managed to rake in Rs 11.75 crore nett, as per a report on Box Office India. Now the gross collections in the first week stand at Rs 93 crore nett.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X