»   » ఆగస్టు 2న ఊ కొట్టించనున్న బాలయ్య, మనోజ్

ఆగస్టు 2న ఊ కొట్టించనున్న బాలయ్య, మనోజ్

Posted by:
Subscribe to Filmibeat Telugu

నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్యపాత్రలో మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా'. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదల ఖరారైంది. ఈ చిత్రం విడుదలపై నిర్మాత మంచు లక్ష్మి అధికారిక ప్రకటన చేశారు. ఆమె మాట్లాడుతూ 'ఆగస్టు 2న ఈ సినిమాను విడుదల కానుంది. ప్రతి కుటుంబంలోనూ ఆత్మీయతానురాగాలను పంచి పెట్టే పండగ రాఖీ పౌర్ణమి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే అందరికీ ఇష్టమైన రాఖీ రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నాం' అన్నారు.

మోహన్ బాబు మాట్లాడుతూ...'ఊకొడతారా ఉలిక్కి పడతారా సినిమాని తొలి సినిమాకంటే పది రెట్లు ఎక్కువ ఖర్చుతో నిర్మించింది. ఓ విధంగా నా ధైర్యానికి కూడా ఈ సినిమా ఓ పరీక్ష పెట్టిందని చెప్పాలి. రేపు ఈ సినిమా విడుదలయ్యాక ఘన విజయాన్ని నమోదు చేస్తుందని, తప్పకుండా చరిత్ర సృష్టిస్తుందని నా నమ్మకం. ఇందులో బాలకృష్ణ నటన అద్భుతం. అలాగే మనోజ్‌ని చూశాక ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. ఒక లక్ష్మి ప్రసన్న నటన ఎంతో ముగ్ధుడ్ని చేసింది. ఇటీవల విడుదలైన పాటలు మంచి విజయం సాధించాయి. త్వరలోనే ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపనున్నాం' అని తెలిపారు.

దీక్షాసేథ్ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రంలో పాంచి బోరా, సోనూసూద్, ప్రభు, రిషి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్, సంగీతం: బోబో శశి, నిర్మాణం: మంచు ఎంటర్ టైన్మెంట్స్, దర్శకత్వం: శేఖర్ రాజా

English summary
‘U Kodathara Ulikki Padathara’ is all set to release on August 2nd in a big way and the day also happens to be a Holiday as it is Rakhi. The news was confirmed by producer Lakshmi Manchu and this clears the suspense over the film’s release. The interestingly titled film has Nandamuri Balakrishna in a key role and Manchu Manoj Kumar is the hero. Deeksha Seth is playing the female lead.
Please Wait while comments are loading...