twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ సీన్లలో "హిందూ మంత్రాలు": మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా??

    |

    మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రెట్ లీ బాలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. "అన్ ఇండియన్" అనే మూవీలో నటించగా.. ఇప్పటికే ఈ సినిమా పిక్చరైజేషన్ పూర్తయిపోయి సెన్సార్ దగ్గరకు కూడా వెళ్లింది.అయితే, ఈ చిత్రం విడుదలకు మన భారతదేశ చిత్ర పంపిణిదారులు ఎవరూ ముందుకు రాలేదు. అన్ ఇండియన్ ఇండియాకు వస్తాడా లేదా అన్న అనుమానం తోనే చాలా రోజులు గడిచిపోయాయి. మొత్తానికి 'అన్‌ ఇండియన్‌' సినిమా ఇండియాలో విడుదల అవుతోంది. సుప్రసిద్ధ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ బ్రెట్‌ లీ తొలిసారి తెరమీదకు వచ్చి నటించిన చిత్రం కావటంతో, ఈ సినిమా మీద చాలా ఆసక్తి పెరిగింది.

    భారత్- ఆస్ట్రేలియా మధ్య సంస్కృతీ, సంప్రదాయాల నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో భారత్‌కు చెందిన వితంతువు‌తో ప్రేమలోపడే రోల్‌లో బ్రెట్ లీ నటించాడు.ఆస్ట్రేలియాలో నిర్మాణమైన ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు అనుపమ్ శర్మ దర్శకత్వం వహించడమే కాక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే, నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సమస్యలు అడ్డంకిగా మారాయి. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఒక సీన్‌లో హీరోయిన్ తనీషా ఛటర్జీతో బ్రెట్ లీకి ఘాటైన ముద్దు సీన్ ఉందట. దాదాపు నిమిషం ఎనిమిది సెకన్లపాటు ఉండే ఈ సీన్‌ను 26 సెకన్లకు తగ్గిస్తే కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వబోమని సెన్సార్ బోర్డు తేల్చిచెప్పింది. తీరా ఇక్కడిదాకా వచ్చాక ఎదురైన ఈ అడ్డంకిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తలపట్టుకున్నాడు నిర్మాత.... అన్ ఇండియన్ గురించిన మిగతా వివరాలు స్లైడ్ షో లో చూద్దాం...

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    ప్రముఖ క్రికెటర్ బ్రిట్‍లీ కథనాయకుడిగా, ప్రముఖ నటి తనీషా చట్టర్జీ హీరొయిన్‍గా నటిస్తున్న చిత్రం అన్ఇండియన్. బ్రెట్ లీ ఆటకు గుడ్ బై చెప్పాక.. సినిమాలపై కాస్త దృష్టి పెట్టాడు. అయితే తన సొంత దేశంలోనో లేకపోతే హాలీవుడ్‌లోనే సినిమాలు తీసుకోకుండా బాలీవుడ్‌లో తీస్తున్న ఓ ఇంగ్లిష్ సినిమాకు పచ్చజెండా ఊపాడు.

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    ‘అన్‌ ఇండియన్‌' సినిమా ఇండియాలో విడుదల అవుతోంది. సుప్రసిద్ధ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ బ్రెట్‌ లీ తొలిసారి తెరమీదకు వచ్చి నటించిన చిత్రం కావటంతో, ఈ సినిమా మీద చాలా ఆసక్తి పెరిగింది. అయితే, ఈ చిత్రం విడుదలకు మన భారతదేశ చిత్ర పంపిణిదారులు ఎవరూ ముందుకు రాలేదు. ఇది తనకెంతో నిరాశను కలిగిస్తోందని లీ తన విచారాన్ని వ్యక్తం చేశాడు.

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    ఈ చిత్రానికి దర్శకుడు అనుపమ్‌ శర్మ. చిత్రం విడుదల విషయమై చాలా అవస్థలు పడ్డాడు. ‘చిత్రాన్ని నిర్మించింది భారతీయులు, దర్శకుడు భారతీయుడు, హీరోయిన్‌ తనిషా చటర్జీ కూడా భారతీయురాలే! సినిమా కథ కూడా మనకు సంబంధించినదే. ఓ భారతీయ యువతి ఆస్ట్రేలియాలో ఉంటూ, ఒక ఆస్ట్రేలియన్‌ యువకుడిని ప్రేమించే కథ.

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    ఈ సినిమాలో తన కూతురుతో కలిసి జీవనం కొనసాగిస్తున్న ఒక విడో ఇండియన్ లేడి, తన కుటుంబ సభ్యుల కొరిక మేరకు పెళ్ళికి సిద్ధమౌతుంది. అదే సమయంలో అస్ట్రేలియన్‍తో పరిచయం, ప్రేమగా మారుతుంది. స్వతహాగా భారత సాంప్రదాయాలంటూ బలంగా ఉన్న హీరోఇన్ కుటుంబ సభ్యులకు ఈ విషయం నచ్చదు. అయితే తరువాత ఏమి జరుగుతుంది, ఆమె ఇండియన్‍ ని పెళ్ళాడుతుందా? మనసుకు నచ్చిన ఆస్ట్రేలియన్‍ ను చేసుకుంటుందా? అనేది కథాంశం.

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    ఇప్పటికే ఈ సినిమా పిక్చరైజేషన్ పూర్తయిపోయి సెన్సార్ దగ్గరకు కూడా వెళ్లింది. ఆగస్ట్ 19న రిలీజ్ చేయాలని భావిస్తుండగా.. ఇప్పుడీ సినిమా దర్శకుడికి సెన్సార్ నుంచి సమస్యలు వచ్చాయి.

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    హీరోయిన్ తనీషా ఛటర్జీకి బ్రెట్ లీ ముద్దు పెట్టే సీన్ ఒకటి అన్ ఇండియన్ క్లైమాక్స్ లో ఉంటుంది. దీని లెంగ్త్ 1.8 సెకన్లు. ఇంత పేద్ద ముద్దు కుదరదంటున్న సెన్సార్ బోర్డ్.. దీన్ని కట్ చేయాలని చెబుతోంది. ఈ లిప్ లాక్ ని 26 సెకన్లకు తగ్గిస్తేనే సర్టిఫికేట్ ఇస్తామంటోంది సెన్సార్.

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    ఇక్కడ సీబీఎఫ్సీ అభ్యంతరాలకు మరో రీజన్ కూడా ఉంది. ఈ ముద్దు సీన్ వస్తున్నపుడు.. కాసేపటి తర్వాత బ్యాక్ గ్రౌండ్ లో 'ఓం హ్రీం శ్రీమ్' అంటూ ఛాంటింగ్ వినిపిస్తుంది. రొమాంటిక్ సీన్ లో ఇలాంటి మంత్రాలను అనుమతించబోమన్నది సెన్సార్ వాదన. ఆ మంత్రాలను వినిపించటం భారతీయుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నది సెన్సార్ బోర్డ్ వాదన.

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    అయితే దర్శకుడి వెర్షన్ వేరేగా ఉంది. తాను హిందువునని వారి మనోభావాలు దెబ్బ తీసేలా సినిమా తీయనంటున్నాడు అనుపమ్ శర్మ. అవి మతానికి సంబంధించినవి కావని.. ఆధ్యాత్మికను సూచించేవని చెబుతున్నాడు. ఉడ్తా పంజాబ్ టైపులో తాను పొలిటికల్ గా పోరాడి.. తనను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లను ఇబ్బంది పెట్టలేనన్న దర్శకుడు.. వీలైనంత వరకూ పోరాడతానని చెప్పాడు

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    ఉడ్తా పంజాబ్ వివాదంలో సెన్సార్ బోర్డు కేవలం సర్టిఫికెట్ ఇవ్వాలేగాని సెన్సార్ చేయకూడదన్న కోర్టు వ్యాఖ్యలను కూడా బోర్డ్ పాటించడం లేదని దర్శకుడు అనుపమ్ శర్మ ఆరోపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 19వ తేదీని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    మనోభావాలను దెబ్బతీసేలా బ్రెట్ లీ సినిమా?

    ప్రపంచం లోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడుగా పేరు తెచ్చుకున్న బ్రెట్ లీ ఇప్పుడు నటుడుగా కూడా నిరూపించుకోవాలన్న ప్రయత్నానికి మొదట్లోనే అడ్డంకి ఎదురయ్యింది... ఈ ఇబ్బందులని అధిగమించి ఈ "అన్ ఇండియన్" ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి...

    English summary
    CBFC demands love-making scene to be chopped from Brett Lee’s UnIndian
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X