»   » రేర్, మీరు చూడని ఫొటోలు చిరంజీవి పుట్టినరోజు పంక్షన్

రేర్, మీరు చూడని ఫొటోలు చిరంజీవి పుట్టినరోజు పంక్షన్

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి 60వ జన్మదిన వేడుకలు పార్క్‌హయత్ హోటల్‌లో శనివారం రాత్రి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, ఈ మధ్య కాలంలో చిరు, పవన్‌లు ఒకే వేదిక మీద కనిపించింది చాలా అరుదు. కానీ.. అన్నయ్య జన్మదిన వేడుకలకు తమ్ముడు పవన్ హాజరవడంతో మెగా ఫ్యామిలీ అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా కొన్ని అరుదైన ఫొటోలు మీకు క్రింద అందిస్తున్నాం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో తారలంతా తళుక్కున మెరిశారు. వేడుకకి వచ్చే అతిథుల్ని ఆహ్వానించేందుకు చిరంజీవితో పాటు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ముందుగానే హోటల్‌కి చేరుకొన్నారు. రాత్రి 8 గంటలకు వేడుక మొదలైంది. తన మిత్రులతో కలసి పవన్‌ కల్యాణ్‌ స్వయంగా కారు నడుపుకొంటూ హోటల్‌కి చేరుకొన్నారు. నేరుగా చిరంజీవి దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. అంతకుముందే చిరంజీవి ఇంటికి వెళ్లి పవన్‌ శుభాకాంక్షలు చెప్పారు.

చిరు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకొన్న సమయంలో తోటి తారలంతా వచ్చి ఆయన్ని పరిశ్రమకి స్వాగతం పలికినట్టుగా మెగా సంబరం జరిగింది. చిరు పుట్టినరోజుని పురస్కరించుకొని ఓ హోటల్‌లో జరిగిన వేడుకకి వివిధ సినీ పరిశ్రమలకి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు.

పంక్షన్ లో ఎవరెవరు వచ్చారు..ఆ ఫొటోలు

పవన్

అన్న,వదినలతో పవన్ కళ్యాణ్ ఇలా...

Photo Courtesy: Joseph Radhik

 

వంశీ పైడిపల్లి

దర్శకుడు వంశీ పైడిపల్లితో... నీహారిక కొణిదల, తమన్నా, కాజల్, ఇలియానా

 

చిరుతో

కనిక కపూర్, సుస్మిత కొణిదల, ఉపాసన కొణిదల

ఒకే ఫ్రేమ్ లో

చిరంజీవి, పవన్, రామ్ చరణ్, చిరంజీవి భార్య

 

రామ్ చరణ్ విత్ మంచు

మంచు కుటుంబంతో కలిసి రామ్ చరణ్ ఇలా

పవన్

జల్స్ టీమ్ త్రివిక్రమ్, అల్లు అరవింద్, పవన్ తో కలిసి సుబ్బిరామరెడ్డి

బాలయ్య, చిరు

బాలకృష్ణ, చిరంజీవి కలిసి ఈ పంక్షన్ లో ..

 

కమల్ ప్రక్కన

కమల్ ప్రక్కన కూర్చుని ఉన్న చిరంజీవి

Photo Courtesy: Joseph Radhik

 

English summary
celebrities at Chiranjeevi Birthday Party Celebrations at Park Hayat Hotel, Hyderabad. Though it was all a private affair, we managed to get some pictures exclusively for you. Check out the below slides.
Please Wait while comments are loading...