twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "ఉయ్యాల వాడ.." ఫైనల్ కాదు.., 100కోట్ల బడ్జెట్, నేషనల్ మార్కెట్ కోసమే ??

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనట, నేషనల్ రేంజ్ లో విడుదల చేయటానికి గానూ వేరే క్యాచీ టైటిల్ కోసం వెతుకుతున్నారట

    |

    మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అని అనుకోవటం, మీదియా కథనాలు వండి వార్చటం తప్ప కొణిదెల ప్రొడక్షన్స్ వరకూ ఉయ్యాల వాడ ప్రాజెక్ట్ ఇప్పటికీ ఒక అనధికార ప్రాజెంట్ కిందే ఉంది. ఇంకా ఖచ్చితమైన ప్రకటన ఏదీ మెగా ఫ్యామిలీ నుంచి గానీ, సినిమా టీమ్ అనుకుంటున్న వారిదగ్గరినుంచి గానీ రాలేదు. ఇప్పుడు వినిపిస్తున్న కొత్త సమాచారం ప్రకారం అయితే అసలు టైటిల్ కూదా ఇంకా "పక్కా" అవలేదట. ఇప్పటికైతే ఉయ్యాలవాడ నరసిమ్హారెడ్డి అన్నది వర్కిమంగ్ టైటిల్ మాత్రమే అన్నది సమాచారం...

    70 నుండి 80 కోట్ల లోపు బడ్జెట్లో

    70 నుండి 80 కోట్ల లోపు బడ్జెట్లో

    మెగా 150 చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మించిన రామ్ చరణే ఈ సినిమాను నిర్మించబోతున్నారు. తొలుత ఈ చిత్రాన్ని రూ. 70 నుండి 80 కోట్ల లోపు బడ్జెట్లో తీద్దామని అనుకున్నప్పటికీ..... ఇపుడు రూ. 100 కోట్లకు మించిన బడ్జెట్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ దాదాపు గా మాగ్జిమం బడ్జెట్ గా కనీసం 100 కోట్ల స్థాయిలోనే ఉండటం మామూలైపోయింది.

    ఈ ప్రాజెక్టు

    ఈ ప్రాజెక్టు

    గురించి ఇప్పటి వరకు అఫీషియల్ గా అయితే ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ మధ్య 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో చిరంజీవి మాట్లాడుతూ కెరీర్లో తాను భగత్ సింగ్ పాత్ర చేయలేక పోయాను. అందుకు బదులుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర చేస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఆ ప్రకటన చేసినప్పటి నుండి అభిమానులు బాస్ 151 సినిమా అదే అని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఫ్యామేడ్ పోస్టర్లు కొన్ని ఇంటర్నెట్ లో హచల్ చల్ చేస్తున్నాయి.

    హాలీవుడ్ సినిమాల స్టూడియల్లో

    హాలీవుడ్ సినిమాల స్టూడియల్లో

    తెలుగులో బాహుబలి, బాహుబలి-2 లాంటి భారీ చిత్రాలు వచ్చిన నేపథ్యంలో..... ‘ఉయ్యాలవాడ....' విషయంలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. హాలీవుడ్ సినిమాలకు పని చేసిన స్టూడియల్లో ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ జరుగబోతోంది. అంటూ అభిమానులు మాత్రం ఫిక్సైపోయారు.

     తెలుగు వీరుడు

    తెలుగు వీరుడు

    1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. జీవిత కథని ఇప్పుడు మళ్ళీ వెలికి తీసి అప్పటి చరిత్రని తప్పుల్లేకుండా తెరకెక్కించటం అనేది మామూలు విషయం కాదు.

    రిస్కీ వ్యవహారమే

    రిస్కీ వ్యవహారమే

    చరిత్ర లో పెద్దగా గుర్తింపు రాకుండా మరుగునపడ్డ వీరుడి కథని ఇప్పుడు మార్కెట్ చేయటమూ కొంత రిస్కీ వ్యవహారమే. అయినా సాహసం చేయాలనుకున్నారు అయితే అసలు ఇంకా టీమ్ ఫిక్స్ అవకముందే ఫ్యాన్స్, మీడియా మాత్రం ముందే మెగా 151 ఇదే అని డిసైడైపోయారు.

    కత్తిలాంటోడు

    కత్తిలాంటోడు

    ఖైదీ నెంబర్ 150 టైం లోకూడా మొదట అనుకున్న టైటిల్ వేరు., కత్తిలాంటోడు అంటూ వినాయక్ అనగానే అదే టైటిల్ అని అంతా అనుకున్నారు. కానీ ఆతర్వాత వచ్చిన మార్పు అందరికీ తెలిసిందే. ఆ టైటిల్ తో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా హల్చల్ చేసాయి. తర్వాత చరణ్ తెరమీదకి వచ్చి అది వర్కింగ్ టైటిలనీ... అసలు టైటిల్ చెప్పేసాడు... ఇప్పుడు కూడా అలాగే జరగవచ్చనే టాక్ వినిపిస్తోంది.

    వేరే క్యాచీ టైటిల్ కోసం

    వేరే క్యాచీ టైటిల్ కోసం

    ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ వెనుక కూడా ఇలాంటి చర్చలే జరుగుతున్నట్టున్నయ్. వేరే క్యాచీ టైటిల్ కోసం కూడా వెతుకుతున్నారట. అసలింతకీ ఇదంతా ఎందుకూ అంటే... బాహుబలి ఎఫ్ఫెక్ట్ అని చెప్పుకోకతప్పదు. బాహుబలి ఎప్పుడైతే నేషనల్ సినిమా అనిపించుకుందో. టాలీవుడ్ చూపు మరింత విస్తృతమయ్యింది.

     కార్పోరేట్ స్టైల్లో మూవీ వ్యాపారం

    కార్పోరేట్ స్టైల్లో మూవీ వ్యాపారం

    ఇప్పుడు టాలీవుడ్ సినిమా కూడా జాతీయ మార్కెట్ లో స్థానం కోసం చూస్తోంది. అందుకే బడ్జెట్ విషయం లోకూడా వెనుకాడకుండా రెండు మూడు సంస్థలు కలిసి కార్పోరేట్ స్టైల్లో మూవీ వ్యాపారం చేస్తున్నాయి. మరి నేషనల్ సినిమా అంటే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అనే పేరు కనెక్ట్ కాకపోవచ్చు.

     ప్రతీ ప్రేక్షకుడు ఓన్ చేసుకోవాలంటే

    ప్రతీ ప్రేక్షకుడు ఓన్ చేసుకోవాలంటే

    సినిమాని ప్రతీ ప్రేక్షకుడు ఓన్ చేసుకోవాలంటే టైటిల్ లో ప్రాంతీయత కనిపించకూడదు. అలా అని భాషకోక టైటిల్ అయినా కొంత ఇబ్బందే... అందుకే అటు నార్త్ కీ, ఇటు సౌత్ కీ కూడా సూటయ్యే టైటిల్ కోసం చూస్తున్నట్టు అనుకుంటున్నారు. అసలు సంగతి తెలియాలీ అంటే మెగా ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే

    English summary
    ఆverybody came to a conclusion that the title of the film will be 'Uyyalawada Narasimha Reddy'. But the latest buzz says that it is just a working title and Surender Reddy team is planning to have a new title.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X