twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' లీక్: వర్మ అరెస్టు, ఎలా చేసాడు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘రాజమౌళి' దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బాహుబలి' చిత్రానికి సంబంధించిన 13 నిమిషాల ఫైటింగ్ సీన్ ఆన్ లైన్లో లీకైన విషయం తెలిసిందే. ఈ కేసును సీసీఎస్ పోలీసులు చేధించారు. ఈచిత్రానికి విజువల్ ఎపెక్ట్స్ అందిస్తున్న ‘మకుట విజువల్ ఎపెక్ట్స్' సంస్థ ఉద్యోగి వర్మను నిందితుడిగా గుర్తించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

    Varma arrested in Baahubali leak case

    ఈ వీడియో క్లిప్ తన ల్యాప్‌లో లోడ్ చేసుకున్న వర్మ దాన్ని తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇండియాతో పాటు అమెరికాలో ఉంటున్న తన స్నేహితులకు షేర్ చేసారు. ఈ కేసులో నిందితుడిగా వర్మ మిత్రుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఈ వీడియో క్లిప్ యూట్యూడులో అప్ లోడ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

    వర్మతో పాటు ‘మకుట' సంస్థపై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ లీకు జరిగిందని పోలీసులు గుర్తించారు. సాధారణంగా సినిమాలకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క జరుగుతున్నపుడు ల్యాప్ టాప్, సెల్ ఫోన్ లాంటి వాటిని అనుమతించరు.

    యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే వర్మ సదరు వీడియో క్లిప్ ను దొంగిలించాడని తెలుస్తోంది. మొత్తానికి ‘బాహుబలి' లీకు వ్యవహారం కొలిక్కి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ఎలాంటి లీకులు జరుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

    సినిమా గురించిన వివరాల్లోకి వెళితే...
    బాహుబలి' సినిమాకు టాకీ పార్టు పూర్తయింది. జనవరి 24న ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు. ఇక దర్శకుడు రాజమౌళి అండ్ టీం పోస్టు ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టారు. షూటింగ్ మొదలైనప్పటి నుండే పారలాల్ గా డబ్బింగ్ మొదలు పెట్టడంతో తెలుగు, తమిళం బాషల్లో ‘బాహుబలి' పార్ట్ -1కు సంబంధించిన అందరు ఆర్టిస్టుల డబ్బింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

    డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగుతో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం మరో విశేషం. ఇందుకు సంబంధించిన పనులు ఫిబ్రవరిలో మొదలు కానున్నాయి. ప్రముఖ సౌండ్ ఇజనీర్ పి.ఎం.సతీష్ సౌండ్ డిజైన్ మీద, డెబాజిత్ చాంగ్‌మై సౌండ్ మిక్సింగ్ మీద పని చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ స్కోరు, సంగీతం అద్భుతంగా రావడానికి ఎంఎం కీరవాణి రాత్రి పగలనక కృష్టిచేస్తున్నారు.

    ఇక పోస్టు ప్రొడక్షన్ పనుల్లో అతి ముఖ్యమైన ‘విఎఫ్ఎక్స్' పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ విభాగంలో నేషనల్ అవార్డు విన్నింగ్ పర్సన్ శ్రీనివాస్ మోహన్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇండియా, హాంకాంగ్, యూనైటెడ్ స్టేట్స్ లోని వివిధ స్టూడియోల్లో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్, ఆడియో వేడుక, ట్రైలర్స్ ఎప్పుడు అనే విషయం త్వరలో టీం బాహుబలి వారు వెల్లడించనున్నారు.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తమిళ రైట్స్ ‘యూవి క్రియేటన్స్' వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థతో సంయుక్తంగా ‘బాహుబలి' చిత్రాన్ని వీరు తమిళనాడులో విడుదల చేయనున్నారు. తెలుగులో యూవి క్రియేషన్స్ వారు ఇంతకు ముందు ప్రభాస్ హీరోగా ‘మిర్చి' చిత్రాన్ని తెరకెక్కించి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో స్టూడియో గ్రీన్ సంస్థకు మంచి నెట్వర్క్ ఉంది.

    ప్రభాస్ కెరీర్లో ఈ సినిమా ఓ గొప్ప మైలురాయిగా ఉంటుందని అంటున్నారు. మరో వైపు అనుష్క, రానా కూడా ఈ చిత్రంలో మెయిన్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం యావత్ తెగులు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.

    English summary
    Varma arrested in Baabubali leak case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X