twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ తేజ 'ముకుంద' ఫస్ట్ లుక్ టీజర్(వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ముకుంద'. పూజాహెగ్డే హీరోయిన్. పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా 'ముకుంద' చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ వీడియో చూసిన వారంతా ఓ రేంజిలో హీరో పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరూ వీడియోపై ఓ లుక్కేయండి...

    ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం దసరాకి విడుదల చేయాలని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరో ప్రక్కన చేసేస్తున్నారు. అయితే రామ్ చరణ్ తాజా చిత్రం గోవిందుడు అందరి వాడేలా చిత్రం ని దసరాకు టార్గెట్ చేయటంతో ... నాగబాబు కొడుకు సినిమాని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ నెలఖరుకు చిత్రం టాకీ పార్ట్ పూర్తవుతుందని సమాచారం.


    సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ‘‘ఇటీవల గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో 35రోజులు భారీ షెడ్యూల్‌ చేశాం. ప్రస్తుతం అమలాపురంలో షూటింగ్‌ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే చిత్రీకరణతో మూడు పాటలు మినహా మొత్తం పూర్తవుతుంది. '' అని అన్నారు.
     Varun teja's Mukunda First look teaser

    లియో ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. మిక్కీ.జె.మేయర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, నాజర్‌ ఇందులో కీలక పాత్రధారులు.

    English summary
    Varun Tej's debut film Mukunda movie Firstlook teaser released on the eve of Pawan Kalyan's Birthday on Sep 2nd. Varun Tej himself posted the picture on his microblogging site. Touted to be contemporary film centered around the dreams and aspirations of the present generation, the film is being directed by Srikanth Addala.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X