twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: ఇంజనీరింగ్ పేపర్లో బాహుబలి ప్రశ్నలు

    By Surya
    |

    చెన్నై: డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి సృష్టించిన వండర్ బాహుబలి 100 రోజులకు దగ్గర అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఓ సంఘటన అందరినీ మరోసారి ఈ సనిమా గురించి గుర్తు చేసేలా చేసింది. రీసెంట్ గా ...తమిళనాడు వెల్లూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజిలో విద్యార్దులకు బాహుబలి ప్రశ్నలు ఇచ్చారు. వాళ్ళ ప్రస్నాపత్రాన్ని చూసి షాక్ అయ్యారు. బాహుబలి 2 కు చెందిన వార్ సీక్వెన్స్ కు చెందిన ఇంజనీరింగ్ సెట్స్ డిజైన్ చేయమని ఆ పేపరులో ఉంది. వాళ్లు డౌట్ తో తమ ప్రొఫిసర్ ని ఈ విషయమై ప్రశ్నించారు. ఆయన మీరు చూసింది కరక్టే అని ఖరారు చేసి చెప్పారు. రెండు ప్రశ్నలు..తలో పది మార్కులతో ఈ విషయమై ఉన్నాయి.

    bhahubali

    భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది 'బాహుబలి'. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. మన దేశంలో అత్యధిక స్థూల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.

    చైనాలో 'బాహుబలి'

    ఇప్పుడు ఇతర దేశాల్లోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. చైనాలో 'బాహుబలి'ని 5000 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు చిత్రాన్ని ఎడిట్‌ చేశారు. పలు చలన చిత్రోత్సవాలకీ పంపుతున్నారు. చైనాలో ఈ చిత్రం నవంబరు నుంచి సందడి చేయబోతోంది. అక్కడ 'పీకే' చిత్రాన్ని విడుదల చేసిన ఈ స్టార్స్‌ ఫిలిమ్స్‌ సంస్థనే 'బాహుబలి'ని విడుదల చేస్తుండడం విశేషం.

    'పీకే'కి చైనాలో మంచి ఆదరణ లభించింది. అదే తరహాలో 'బాహుబలి' కూడా చైనా ప్రేక్షకుల్ని అలరిస్తుందని సినీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించారు.

    English summary
    One of the assistant professors at a popular engineering college has stunned his students by including few questions regarding Baahubali in an exam paper.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X