»   » వెంకటేష్ 'షాడో' లేటెస్ట్ ఇన్ఫో

వెంకటేష్ 'షాడో' లేటెస్ట్ ఇన్ఫో

Posted by:
Subscribe to Filmibeat Telugu
మెహర్ రమేష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. వెంకీ ఇందులో మాఫియా డాన్ గా కనిపించబోతున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తాప్సీ నటించనుంది. ఇటీవలే స్విట్జర్లాండ్‌లో వెంకటేష్‌, తాప్సీలపై రెండు పాటల్ని తెరకెక్కించారు. రాజు సుందరం నృత్యరీతులు సమకూర్చారు. త్వరలో రామోజీ ఫిల్మ్‌సిటీలో మరో గీతాన్ని చిత్రీకరిస్తారు. ఇందుకోసం అక్కడో భారీ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ...'యాక్షన్‌ అంశాలకు ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. వెంకటేష్‌ హావభావాలు, వేషధారణ కొత్తగా కనిపిస్తాయి''అన్నారు. ఈ చిత్రంలో వెంకటేష్‌ తన శైలి మార్చారు. గెడ్డం... కొత్త తరహా కేశాలంకరణతో కెమెరా ముందుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి క్రేజ్ వచ్చింది.

హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. శ్రీకాంత్ సరసన మధురిమ నటిస్తోంది. ఈ చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తుండగా, కోన వెంకట్ సంభాషణలు సమకూర్చుతున్నాడు. థమన్ సంగీతం అందించనున్నారు. మధురిమ, ఎమ్మెస్‌ నారాయణ, నాగబాబు, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మీనన్‌, ధర్మవరపు, ప్రభు తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్‌.

ఇక వెంకటేష్ అన్న కొడుకు రానాతో పరుచూరి ప్రసాద్ ఇప్పటికే నా ఇష్టం చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసారు. అది భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. వెంకటేష్ బాడీగార్డ్ చిత్రం యావరేజ్ గా ఆడిన నేపధ్యంలో ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్టు కొట్టాలని చేస్తున్నారు. అలాగే వెంకటేష్.. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చేస్తున్నారు. మహేష్,వెంకటేష్ ఆ చిత్రంలో అన్నదమ్ములుగా చేస్తున్నారు.

English summary
Venkatesh doing his next full-fledged movie under Meher Ramesh direction. This film is tentatively titled Shadow. Venky plays the role of a Don in it. Srikanth will play second fiddle to him. Tapsi is zeroed in as the female lead. Gopi Mohan and Kona Venkat provided script for this film. The story and dialogues are ready and the film will hit the sets shortly. Thaman is scoring music for it.
Please Wait while comments are loading...