twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెన్నైలోని శోభన్ బాబు విగ్రహం కూల్చుతామన్న టీఎంపీ సంస్ధ, పోలీసు భద్రత

    By Nageswara Rao
    |

    చెన్నైలో ఆంధ్రుల అందగాడు శోభన్ బాబు విగ్రహన్ని కూల్చేస్తామన్న తమిళ మున్నేట్ర పడై సంస్ధ ప్రకటనతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే శోభన్ బాబు విగ్రహం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.

    తమిళనాడులోని నాగపట్నంలో ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఇటీవల తమిళ గ్రూపులు ప్రయత్నం చేశాయి. భారతదేశంలో నిషేధిత తీవ్రవాద సంస్ధ ఆయిన ఎల్టీటీఈ చీఫ్ విగ్రహం ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతించలేదు.

    Veteran actor Shoban Babu statue vandalised in Chennai

    అంతేకాదు ఏర్పాటు చేయాలనుకున్న ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకర్ విగ్రహన్ని కూడా తీసేయించారు. ఈ చర్యను ఆగ్రహించిన తమిళ వేర్పాటువాద గ్రూపులు తమిళ ఉద్యమ నేత విగ్రహం ఏర్పాటును ప్రభుత్వం సంకుచిత ధోరణితో అడ్డుకుంటుందని ఆరోపించాయి.

    మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తుల విగ్రహలు రాజధానిలో ఉండటం ఎంత వరకు సమంజసం? అంటూ ప్రశ్నించాయి. శోభన్ బాబు విగ్రహం వద్ద నిరసన చేయాలని వచ్చిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    English summary
    Activists of Tamila Munnetra Padai (TMP), threatened to remove the statue of well-known actor Shoban Babu, at his residence in Chennai. This was in retaliation to the removal of the statue of LTTE chief, Prabhakaran, in Nagapatnam, by the Tamil Nadu government.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X