twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫన్ వీడియో: ‘బాహుబలి’ రూ. 2,500 లలో తీస్తే...

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాహుబలి భారీ బడ్జెట్ మూవీ అన్న విషయం తెలిసిందే. హాలీవుడ్ స్థాయిలో తీస్తున్న సినిమా అని ప్రచారం జరుగుతున్న ఈ చిత్రం పై ప్యారెడీలు ఇప్పటికీ ప్రారంభమైపోయాయి. సోషల్ మీడియా లో ఈ చిత్రంపై జోకులు బాగానే పేలుస్తున్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ముఖ్యంగా క్రియేటివ్, టాలెంటెడ్ పీపుల్ ...సరదాగా.. ట్రెండింగ్ అంశాలను సృజాత్మకంగా టచ్ చేస్తూ.. హాస్యాన్ని జోడిస్తూ ఫన్ చేస్తున్నారు. వీటిని అందరూ లైట్ గా తీసుకుంటూ నవ్వుకుంటున్నారు. అంతెందుకు వీటిలో కొన్నిటినీ మొన్న బాహుబలి ఆడియో పంక్షన్ లో సైతం ప్రదర్శించారు. వాటిల్లో ఒకటి మీరు ఇక్కడ చూడబోతున్నారు.

    బాహుబలి చిత్రం బడ్జెట్ పై సెటైర్ పేలుస్తూ...ఓ వీడియోని రిలీజ్ చేసారు. రెండు వందల కోట్ల రూపాయలతో కాదు.. రెండు వేల రూపాయలతో బాహుబలి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? చక్కటి హాస్యం అండర్ కరెంట్‌గా నింపి ఒక వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు రోడ్ ప్యాక్టరీ వారు. What if Baahubali was made in low budget - అంటూ సాగే ఈ వీడియో ఇప్పుడు ఫేస్ బుక్ లో బాగా పాపులర్ అయ్యింది. మీరు కూడా దీన్ని చూడాలనుకుంటే ఈ క్రింద చూడవచ్చు. మీరూ చూసి నవ్వుకోవచ్చు.

    'బాహుబలి' ఆడియో వేడుక నిన్న తిరుపతిలో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. అదే స్పీడులో తమ సినిమాపై జోకులేసుకొంది 'బాహుబలి' టీమ్‌. ఆ జోక్స్ ని అందరూ ఎంజాయ్ చేసారు. తెగ నవ్వుకున్నారు. ఇలా ఆడియో ఫంక్షన్ లో జోక్స్ వేయటం గొప్ప విషయమే.

    'బొమ్మరిల్లు'లో'అంతా మీరే చేశారు నాన్నా..' సీన్‌నీ స్ఫూఫ్‌గా మార్చుకొన్నారు. ఈ సన్నివేశంలో ప్రకాష్‌రాజ్‌ రాజమౌళి అన్నమాట. సిద్ధార్థ్‌.. ప్రభాస్‌కి అభిమాని. 'ఇప్పటికీ మీరు 'బాహుబలి' రిలీజ్‌ డేట్‌ చెప్పలేదు సార్‌...' అంటూ రాజమౌళిని ప్రభాస్‌ ఫ్యాన్‌ నిలదీయడంతో.. రాజమౌళితో సహా.. అక్కడున్నవాళ్లంతా హాయిగా నవ్వేశారు.

    'కిక్‌' సినిమాలో ఓ సన్నివేశాన్ని 'బాహుబలి' టీమ్‌ సరదాగా వాడుకొంటూ నవ్వులు పూయించింది. రాజమౌళి ఫొటో చూసిస్తూ 'ఐ యామ్‌ లి.. రాజమౌళి. బాహుబలిని ఎప్పుడు రిలీజ్‌ చేస్తానో నాకే తెలీదు..' అంటూ నవ్వించారు. అలాగే... 'అవతార్‌'లోని సన్నివేశాలకు 'బాహుబలి' ప్రచార చిత్రంలోని సంభాషణలను జతచేసి చూపించిన ట్రైలర్‌ ఆకట్టుకొంది.

    దీనితో పాటు..

    video: What if Baahubali was made in low budget

    'బాహుబలి' మొదలయ్యాక మూడు ఐపీఎల్‌లు జరిగాయి, ఓ వరల్డ్‌కప్‌ సిరీస్‌ పూర్తయ్యింది, 'బాహుబలి'తో పాటు మొదలైన హైదరాబాద్‌లోని మెట్రో ప్రాజెక్టు కూడా పూర్తికావొచ్చింది కానీ 'బాహుబలి' పూర్తికాలేదంటూ.. సెటైర్లు వేసుకొన్నారు.

    ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

    ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.

    భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

    English summary
    What if Bahubali was made in low budget . What if one of the epic movies in Indian Film Industry "Bahubali" was made in low budget. Here are a bunch of idiots who plan to remake "Bahubali" in a budget of 25000/-
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X