twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్యకే కాదు...ఇంకో స్టార్ హీరోకు టైటిల్ తలనొప్పి

    By Srikanya
    |

    చెన్నై: ఒక టైటిల్ అనుకుని అది రిజస్టర్ చేసేలోగా లీక్ అయ్యి మీడియాలో వచ్చేయటం..దాంతో ఎవరో ఒకరు దాన్ని రిజిస్టర్ చేయటం...అసలు దాన్ని అనుకున్న సంస్ధ వాళ్లు తలపట్టుకోవటం రెగ్యలుర్ సినీ పరిశ్రమలో అతి సామాన్యం అయ్యిపోయింది. తెలుగులో ఇలాంటి సమస్యలు చూస్తూనే ఉన్నాం.. రీసెంట్ గా తెలుగులో బాలకృష్ణ సినిమాకు ఈ సమస్య ఏర్పడింది. ఇప్పుడు తమిళంలోనూ స్టార్ హీరో విజయ్ కు ఈ సమస్య ఏర్పడింది.

    వివరాల్లోకి వెళితే...విజయ్ హీరోగా ఓ భారీ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాటి అందాల తార శ్రీదేవి కీలకపాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇప్పుడు టైటిల్ సమస్య ఏర్పడింది. ఇప్పటికే మారిషన్, గరుడ వంటి టైటిల్స్ వంటి పేర్లు వినిపించాయి. గరుడ టైటిల్‌ను పెట్టినట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే, ఈ చిత్రానికి గరుడ టైటిల్‌పై వివాదం నెలకొందని సమాచారం. దాంతో, ఈ టైటిల్‌ని కాదని మరుధీరన్ అనే టైటిల్‌ను పెట్టేందుకు యూనిట్ వర్గాలు ఆలోచిస్తున్నాయి.

    Vijay 58 is not 'Garuda', says Director

    బాలయ్య టైటిల్ విషయానికి వస్తే...

    బాలకృష్ణ 98వ చిత్రం టైటిల్‌ విషయం వివాదంలో పడింది. సత్యదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘ లయన్‌ ' అనే పేరును ఏపీ ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు. అయితే ఈ టైటిల్‌తో తెలంగాణ ఫిలిం ఛాంబర్‌లో ఎప్పుడో రిజిస్టర్ చేయించాను అంటూ ఓ నిర్మాత వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ టైటిల్‌ వివాదం ఫిలింనగర్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. వీలైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుని డిసెంబర్‌ 31న టీజర్‌ విడుదల చేయాలని దర్శకుడు సత్యదేవ్‌ భావిస్తున్నట్లు సమాచారం.

    అయితే..ముందుగా ‘లయన్' అనే టైటిల్‌ను అనుకున్నప్పటికీ, ఆ టైటిల్‌పై వివాదం ఏర్పడడంతో చివరిగా సినిమాకు ‘వారియర్' అనే టైటిల్‌ను పెట్టే అవకాశమున్నట్టు యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే బాలకృష్ణ ఫస్ట్‌లుక్ మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను యూనిట్ వర్గాలు ప్రకటించనున్నాయి.

    చిత్రం విషయాలకి వస్తే..

    ధర్మం ఎప్పుడూ ఒంటరికాదు. దానిని కాపాడ్డానికి ఎవరో ఒకరు శ్రమిస్తూనే ఉంటారు. ధర్మాన్ని నిలబెట్టి, న్యాయాన్ని రక్షించి, అవినీతిపై యుద్ధం చేసిన పౌరుడి కథే మా సినిమా అంటున్నారు సత్యదేవా. ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. త్రిష, రాధికా ఆప్టే కథానాయికలు. రుద్రపాటి రమణారావు నిర్మాత.

    నిర్మాత మాట్లాడుతూ... ''లెజెండ్‌'తో బాలకృష్ణ ఇమేజ్‌ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఆయన పాత్ర అందుకు ఏమాత్రం తగ్గదు. మణిశర్మ స్వరపరిచిన గీతాలు అందరినీ అలరిస్తాయ''న్నారు.

    English summary
    For the past few days, three names have been going rounds online as the official title for Vijay 58. Maareesan was the earlier rumored title and now ‘Garuda’ and ‘Porvaal‘ are the other names that are going viral as the film’s title.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X