Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విజయ్ పోలీసోడు సెన్సార్ పూర్తి. ఆడియో తేదీ ఖరార్
హైదరాబాద్: ఇళయతలపతి విజయ్ నటించిన "తెరి" చిత్రం తెలుగు లో "పోలీసోడు" అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమం విజయవంతం గా పూర్తి చేసుకుని, U సర్టిఫికేట్ ను దక్కించుకుంది.
ఈ చిత్రం ఆడియో ను 6వ తారీఖున భారీ ఎత్తున హైదరాబాద్ లో విడుదల చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రానికి జి . వి . ప్రకాష్ కుమార్ చక్కటి సంగీతాన్ని అందించారు అని ఆయన అన్నారు. 'రాజా రాణి' చిత్రం తో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వం లో ముస్తాబవుతోన్న ఈ చిత్రం పై భారీ ఆశలు ఉన్నాయి.
భారీ వ్యయం తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం కు ఏప్రిల్ లో భారీ రిలీజ్ ఉంటుంది.
విజయ్ , సమంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు
దర్శకత్వం - స్క్రీన్ప్లే - అట్లి .ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్ . ఎడిటర్ -అన్తోనీ రుబెన్ . సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్. ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ , సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు - రాజు , కలయిపులి ఎస్ థాను.