twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాగుడుకు బానిసైంది నిజమే: మహానటి సావిత్రి సీక్రెట్స్ వెల్లడించిన కూతురు!

    సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి ప్రముఖ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని పలు విషయాలు చెప్పుకొచ్చారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు తెరపై, ముఖ్యంగా దక్షిణాది సినీ రంగంలో చెరగని ముద్రవేసిన హీరోయిన్ మహా నటి సావిత్రి. నటన పరంగా సావిత్రి ఎన్ని ఉన్నత శిఖరాలు అధిగమించిందో... వ్యక్తిగత జీవితంలో అన్ని కష్టాలు అనుభవించింది అని చెబుతుంటారు.

    సావిత్ర జీవితంలో ప్రేక్షకులకు తెలియని ఎన్నో కోణాలు త్వరలో ఆమె బయోపిక్ ద్వారా బయటకు రాబోతున్నాయి. తాజాగా సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి ప్రముఖ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని పలు విషయాలు చెప్పుకొచ్చారు.

    అమ్మ(సావిత్రి) జీవితంపై సినిమా తీస్తామని దర్శక నిర్మాతలు తనను సంప్రదించగానే షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.

    అమ్మ, నాన్న మధ్య గొడవలు

    అమ్మ, నాన్న మధ్య గొడవలు

    తనకు 16 ఏళ్ల వయసులో వివాహం చేశారని, తన వివాహానికి రెండేళ్ల ముందు నుండే అమ్మ సావిత్రి, నాన్న జెమిని గణేషన్ మధ్య విభేదాలు, గొడవలు మొదలయ్యాయని విజయచాముండేశ్వరి చెప్పుకొచ్చారు.

    ఆ వయసులో అర్థం కాలేదు

    ఆ వయసులో అర్థం కాలేదు

    ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయో ఆ వయసులో తనకు అర్థం కాలేదని, వారు గొడవపడ్డప్పటికీ తనతో ప్రేమగా ఉండేవారని విజయచాముండేశ్వరి చెప్పుకొచ్చారు.

    తమ్ముడు ఎక్కువ ఇబ్బంది పడ్డాడు

    తమ్ముడు ఎక్కువ ఇబ్బంది పడ్డాడు

    అమ్మా నాన్నల మధ్య గొడవల ప్రభావం నాపై పడలేదు. కానీ తమ్ముడపై ఆ ప్రభావం బాగా పడిందని విజయచాముండేశ్వరి చెప్పుకొచ్చారు.

    అమ్మ అమాయకురాలు

    అమ్మ అమాయకురాలు

    తన తల్లి చాలా అమాయకురాలని, ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలో కూడా ఆమెకు తెలిసేది కాదు. అపుడు ఆమెకు సరైన సలహాలు ఇచ్చే వారు కూడా ఎవరూ ఉండేవారు కాదు. ఆ అమాయకత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా నష్టపోయింది, కొన్ని సార్లు చెడు జరిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

    అందుకే మద్యానికి బానిసయ్యారు

    అందుకే మద్యానికి బానిసయ్యారు

    సమస్యలు చుట్టుముట్టడంతో ఒత్తిడితో ఆమె మద్యానికి బానిసయ్యారు. ఆ ఒత్తిడితోనే 19 నెలలు కోమాలోకి వెళ్లిపోయారు. అమ్మను అలా చూడటం నరకంలా అనిపించింది. అమ్మ మళ్లీ మామూలు మనిషి అవుతుందనుకున్నాం. కానీ మా ఆశలపై నీళ్లు చల్లుతూ ఆమ్మ వెళ్లిపోయారు అని విజయచాముండేశ్వరి ఆవేదన వ్యక్తం చేసారు.

    నాన్న బాధ పడ్డారు

    నాన్న బాధ పడ్డారు

    అమ్మతో విబేధాలు ఉన్నప్పటికీ అమ్మను బెడ్ మీద చూసి నాన్న చలించిపోయారు, ఆయన ఎంతో మనోవేదన అనుభవించారు అని విజయ చాముండేశ్వరి అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

    ఆస్తులు పోయి పేదరికం అనేది అవాస్తవం

    ఆస్తులు పోయి పేదరికం అనేది అవాస్తవం

    అమ్మ ఆస్తులు పొగొట్టుకున్నారని, చివరి రోజుల్లో పేదరికం అనుభవించారని ఉన్న కథనాల్లో నిజం లేదని చాముండేశ్వరి తెలిపారు. అమ్మ చనిపోయాక కూడా తాము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదని, అమ్మ ఎంత పోగొట్టుకున్నా, అంతకంటే ఎక్కువే సంపాదించారని తెలిపారు.

    బయోపిక్ తీస్తానంటే షరతులతో ఒప్పుకున్నాను

    బయోపిక్ తీస్తానంటే షరతులతో ఒప్పుకున్నాను

    తల్లి జీవితంపై బయోపిక్ తీస్తామని నా దగ్గరకు వచ్చిన దర్శక నిర్మాతలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చాను. మొత్తం స్క్రిప్టు చదవాలనేది నా మొదటి షరతు, తెరపై పాజిటివ్ విషయాలను మాత్రమే చూపించాలి అనేది మరో షరతు, తన తల్లి నటిగా ఎదిగిన విధానం భావి తరాలకు తెలియానే ఉద్దేశ్యంతోనే ఒప్పుకున్నట్లు తెలిపారు చాముండేశ్వరి.

    నటిని ఎప్పుడూ కావాలనుకోలేదు

    నటిని ఎప్పుడూ కావాలనుకోలేదు

    నేను నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు, అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎప్పుడూ హౌస్ వైఫ్ గానే ఉండాలనుకున్నాను. మా రెండో అబ్బాయి అభినయ్ సినిమా రంగంపై ఆసక్తి చూపుతున్నారు. తమిళ చిత్రం రామానుజన్ లో కీలకమైన పాత్ర చేసాడు. మా పెద్దబ్బాయి అర్జున్ డాగ్ బ్రీడింగ్, థియేటర్ వర్క్స్ బిజినెస్ లో ఉన్నారని విజయచాముండేశ్వరి తెలిపారు.

    English summary
    "I felt very nice when they initially approached me for amma’s biopic. I was pleased to see Gen Next reminiscing amma (Savithri) and exploring more about her." Mahanati Savitri daughter Vijaya Chamundeswari said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X