»   » హాలీవుడ్: దీపిక పదుకోన్ XXX వీడియో

హాలీవుడ్: దీపిక పదుకోన్ XXX వీడియో

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ ‘XXX-ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ ' అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టార్, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫేం విన్ డీసెల్ కు జోడీగా దీపిక నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన దీపిక ఫస్ట్ లుక్ విడుదల కాగా.... తాజాగా విన్ డీజెల్ దీపికతో కలిసి తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.

A video posted by Vin Diesel (@vindiesel) on

ఆ మూవీకి డీజే కరుసో దర్శకుడు. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో దీపికా సెరీనా అనే పాత్రలో, డీజిల్ జాండర్‌ అనే నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా సామ్యూల్ ఎల్ జాక్సన్, జెట్ లీ, టోనీ ఝా, కానోర్ మెక్ గ్రేగర్, రూబీ రోస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Vin Diesel-Deepika Padukone in the first promo of XXX

ఈ మూవీ కోసం దీపికా పదుకునే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. సినిమాలోని యాక్షన్‌సీన్స్‌లో విన్ డీజిల్ కు పోటీగా నటించేందుకు దీపికా శిక్షణలో చాలా చెమటోడ్చింది. XXX సిరీస్‌లో వస్తున్న రెండవ మూవీ. 2017లో విడుదల కానుంది.

షూటింగులో పాల్గొనడానికి ముందే దీపిక తన ట్విట్టర్ ద్వారా ఎగ్జైట్మెంటును బయట పెట్టింది. "హాలీవుడ్ ఎంట్రీపై నాకు ఎంతో ఉత్సాహంగానూ... టెన్షన్‌గానూ ఉంది. నా తొలి హాలీవుడ్ మూవీ షూటింగ్ కోసం వెళ్లబోతున్నా"అని దీపిక చెప్పిన సంగతి తెలిసిందే.

English summary
Ever since Deepika Padukone announced her Hollywood debut, we have been keeping a close watch on the actress to know every inside detail possible. The actress has been so lucky that, even after rejecting Fast And Furious 7th installment, she managed to bag the XXX: The Return Of Xander Cage with the very same star, Vin Diesel.
Please Wait while comments are loading...