twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోమ్‌ పురస్కారంకు ఎంపికైంది...హీరో ఫుల్ హ్యాపీ

    By Srikanya
    |

    ముంబై: విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కి విజయం సాధించిన బాలీవుడ్‌ చిత్రం 'హైదర్‌'. ఇటీవల జరిగిన రోమ్‌ చిత్రోత్సవాల్లో 'పీపుల్స్‌ ఛాయిస్‌' పురస్కారం అందుకుందీ చిత్రం. కాశ్మీర్‌ నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా నటించారు.

    ఈ చిత్రోత్సవాలకు విశాల్‌ భరద్వాజ్‌తో కలసి హాజరైన షాహిద్‌ స్పందిస్తూ ''చిత్రోత్సవాల్లో పురస్కారం అందుకొన్న నా తొలిచిత్రమిది. రోమ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రధాన విభాగంలో పురస్కారం గెలుచుకున్న తొలి భారతీయ చిత్రమిది. ఎంతో ఆనందంగానూ గొప్పగానూ ఉంది''అని ట్వీట్‌ చేశాడు.

    షాహిద్ కపూర్ నటించిన 'హైదర్' సినిమాపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. ఇదో ప్రత్యేకమైన సినిమా అని కితాబిచ్చారు. షేక్‌స్పియర్ విషాదాంత నాటకం 'హామ్లెట్' ఆధారంగా విశాల్ భరద్వాజ్ 'హైదర్' చిత్రాన్ని తెరకెక్కించారు. 'హైదర్... స్పెషల్ సినిమా... ఇందులో నటులు అసామాన్య నటన ప్రదర్శించారు. నవలను సినిమాకు అనుగుణంగా చాలాబాగా రూపాంతరీకరించారు' అని అమితాబ్ ట్వీట్ చేశారు. 'హైదర్' లో షాహిద్ కపూర్ కు జోడీగా శ్రద్ధా కపూర్ నటించింది. టబు, ఇర్ఫాన్ ఖాన్, కేకే మీనన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

    Vishal Bharadwaja's Haider got Rome award

    'హైదర్‌' సినిమా ని షేక్‌స్పియర్‌ 'హామ్లెట్‌' ను కాశ్మీర్‌కి అన్వయించి ఈ సినిమా తీశారు. ఈ సినిమాకి దక్కాల్సిన ప్రశంసలు పక్కన పెడితే, జాతీయవాద వ్యతిరేక సినిమాగా విమర్శలపాలయింది. 'హైదర్‌'లో అనేక సన్నివేశాలు, మనల్ని ప్రస్తుత కాశ్మీర్‌ పరిస్థితుల గురించి ఆలోచించేలా చేస్తాయి. కాశ్మీర్‌ అనగానే కొండలు, లోయలతో సందర్శకులకు అందమైన అనుభూతులను కలిగించే ప్రదేశంగానే చూస్తాం. కానీ అక్కడ ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు, పడేపాట్లు ఎలా ఉంటాయో భిన్నమైన కోణంలో మన కళ్ళకు కట్టినట్లు చూపించింది 'హైదర్‌'.

    కథ గా చెప్పాలంటే... చిత్రంలో హైదర్ (షాహిద్ కపూర్) శాంతికాముకుడు. కవి. తండ్రి డాక్టర్ హిలాల్ మీర్ (నరేంద్ర ఝాష) అంటే ప్రాణం. ఆయన్ని ఇండియన్ ఆర్మీ అరెస్ట్ చేసిందన్న వార్త తెలిసి అలీఘర్ నుంచీ తిరిగి వచ్చేస్తాడు హైదర్. తన తండ్రి అదృశ్యం వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ మిస్టరీలో తల్లి.. మామల ప్రమేయం ఉందా? ఆయన్ని ఎక్కడ ఉంచారు? ఆయన బతికే ఉన్నాడా? చంపేశారా? ఇదీ హైదర్ కథ.

    కాశ్మీరీ అందాలను ఒకవైపు.. రక్తసిక్త వాతావరణాన్ని మరోవైపు కలిపి అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. పంకజ్‌కపూర్ ఫొటోగ్రఫీ ‘హైదర్'కి ప్రాణం పోసింది. మిగతా శాఖలన్నీ కథని డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేయటంలో తోడ్పడ్డాయనే చెప్పాలి.

    English summary
    Shahid Kapoor, Shradda Kapoor's ‘Haider’ directed by Vishal Bharadwaj won bagged its first international award when it was screened at Rome International Film festival. Shahid and Shradda expressed their happiness on ‘Haider’ winning People’s Choice Award at 9th Rome Film Festival.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X