twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కారణాలివే: మురళీ మోహన్ లానే దెబ్బతిన్న శరత్ కుమార్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: గత కొన్ని నెలల క్రితం తెలుగు సినీ నటుల సంఘం ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (మా) ఎన్నికల సందర్భంగా చోటు చేసుకునప్న పరిణామాలు అందరికీ తెలిసిందే. అప్పటికే అధ్యక్షుడిగా ఉన్న మురళీ మోహన్ మరోసారి తన పంతం నెగ్గించుకోవడానికి అధ్యక్ష పదవికి జయసుధను నిలబెట్టి పరాభవం పాలయిన సంగతి తెలిసిందే.

    ఈ ఎన్నికల్లో మురళీ మోహన్ వర్గానికి పోటీగా రంగంలోకి దిగిన రాజేంద్ర ప్రసాద్ అండ్ టీం ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల సందర్భంగా రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ వర్గాల మధ్య హోరా హోరీగా మాటల యుద్దం జరిగింది. ఇటీవల జరిగిన తమిళ సినీ నటుల సమాక్య ‘నడిగర్ సంఘం' ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.

    గత కొన్నేళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్న శరత్ కుమార్.....మరోసారి అద్యక్ష పదవికి పోటీ చేసాడు. ఈ సారి శరత్ కుమార్ జట్టుకు పోటీగా నాజర్, విశాల్, కార్తీ తదితరులతో కూడిన జట్టు రంగంలోకి దిగింది. శరత్ కుమార్ జట్టును ఎన్నికల్లో మట్టికరిపించింది.

    Vishal's Pandavar Ani defeats Sarath Kumar's faction

    ఎన్నికల్లో గెలుపు కోసం విశాల్ 2 యేళ్ళ గ్రౌండ్ వర్క్ చేశారు. పెద్ద హీరోల తో పాటు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల మీద కాంన్సన్ ట్రేట్ చేశారు. వీరే పోలింగ్ బూతు ముందు లైన్లో నిలబడి ఓట్లేసేది అని గ్రహించాడు. సక్సెస్ అయ్యాడు. యూత్ ను నిర్లక్ష్యం చేయలేదు. వారి ఓట్లు కీలకం అని నమ్మాడు.

    శరత్ కుమార్, రాధిక ఇతనిది మన ప్రాంతం కాదు, తెలుగు వాడు అంటూ రెచ్చగొట్టినా ఎవ్వరూ డైవర్ట్ కాకుండా చూసుకున్నాడు. కమల్ హాసన్ మద్దతు కూడా కట్టగలిగాడు. పేద కళాకారులను ఆదుకోవడం లో శరత్ కుమార్ ఫెయిల్ అయ్యారని, బేస్ ఉన్న ఆరోపణ ను ప్రచార అస్త్రంగా వాడారు. ఎన్నికల ముందు ప్రత్యర్థి వర్గం కయ్యానికి వస్తే వెనకాడకుండా తాను కూడా కాలు దువ్వాడు. తెలివి, తెగువ రెండిటినీ ప్రదర్శించి గెలుపు సొంతం చేసుకున్నాడు.

    English summary
    Nasser, part of the 'Pandavar Ani' with Vishal, Karthi, Karunas and Ponvannan, has been elected Nadigar Sangam president, with 1344 votes. Sarath Kumar polled 1231 votes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X