Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విశాల్-శృతి హాసన్ ‘పూజ’ రిలీజ్ డేట్...
హైదరాబాద్: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై హీరో విశాల్ నటిస్తూ నిర్మిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ ‘పూజ'. యాక్షన్ చిత్రాలు రూపొందించడంలో తనకంటూ ఓ స్పెషాలిటీని ఏర్పరుచుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. శృతి హాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 22న దీపావళి కానుకగా 500 థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా హీరో, నిర్మాత విశాల్ మాట్లాడుతూ...‘అక్టోబర్ 22న ‘పూజ' చిత్రాన్ని తెలుగులో 500 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. గతంలో వచ్చిన నా సినిమాల్లాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. దీపావళి పండగకు మీ ముందుకు వస్తున్న మా ‘పూజ' చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అన్నారు.
విశాల్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో సత్యరాజ్, రాధిక, అభినయ, జయప్రకాష్, మనోబాల తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: ప్రియన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, ఫైట్స్: కనల్ కణ్ణన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వడ్డి రామానుజం, నిర్మాత: విశాల్, కథ- స్క్రీన్ ప్లే-దర్శకత్వం: హరి.