» 

మంచు విష్ణు 'సర్వ కళా వల్లవన్' రిలీజ్ ఈ నెల్లోనే

Posted by:
 

హైదరాబాద్ :తాజాగా మంచు విష్ణు నటించిన దూసుకెళ్తా చిత్రం 'సర్వ కళా వల్లవన్' పేరుతో మలయాళంలోకి అనువదించి శుక్రవారం కేరళ రాష్ట్రంలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఇక్కడ ఓకే టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ ఈ చిత్రం ఓకే అనిపించుకుంది. తన చిత్రం మళయాళంలో రిలీజ్ అవుతున్నందుకు మంచు విష్ణు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. నవంబర్ 8న ఈ చిత్రం విడుదల అవుతోంది.

మలయాళ ప్రేక్షకులకు మరోసారి దగ్గరైనందుకు చాలా సంతోషంగా ఉంది అని మంచు విష్ణు అన్నారు. గత సంవత్సరం విడుదలైన 'ఎదునమ్ రెఢి' చిత్రాన్ని కేరళ సినీ ప్రేక్షకుల చక్కగా ఆదరించారని ఆయన అన్నారు. 'దూసుకెళ్తా' చిత్రం అక్టోబర్ 17వ తేదిన విడుదలై తొలివారంలోనే 14.83 కోట్లు వసూలు చేసిందని తెలియచేసారు. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

సినిమా తొలి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా వినోదాత్మకంగా ఉందని, విష్ణు పెర్ఫార్మెన్స్ బాగుందని, బ్రహ్మానందంతో కలిసి కామెడీ ఇరగదీసాడని అంటున్నారు. అదే విధంగా డైలాగులు, స్ర్కీన్ ప్లే సినిమాకు మరింత ప్లస్సయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే సినిమాకు హీరోయిన్ మైనస్ అయిందని అంటున్నారు.

మొత్తానికి...సినిమా హిట్ టాక్ రావడంతో మంచు విష్ణు, ఆయన ఫ్యామిలీ, అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. బిందాస్, రగడ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న వీరు పోట్ల......'దూసుకెళ్తా' సినిమా హిట్‌తో మరో మెట్టు పైకెక్కాడు. ఓ వైపు కూతురు పుట్టిన ఆనందంలో ఉన్న ఆనందంలో ఉన్న ఆయనకు 'దూసుకెళ్తా' హిట్టయిందనే వార్త మరింత బూస్ట్ ఇచ్చినట్లయింది.

24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈచిత్రంలో మంచు విష్ణు వర్ధన్, లావణ్య త్రిపాఠి, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి, పోసాని, రఘుబాబు, భరత్, అన్నపూర్ణమ్మ, రజిత, సురేఖావాణి, హేమ తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సమర్పణ: ఆరియానా, వివియానా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.విజయకుమార్, నిర్మాత : మంచు మోహన్‌బాబు, కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వీరూ పోట్ల.

Read more about: doosukeltha, lavanya tripathi, manchu vishnu, veeru potla, mohan babu, మంచు విష్ణు, దూసుకెళ్తా, వీరూ పోట్ల, లావణ్య త్రిపాఠి
English summary
The dubbed Malayalam version of Vishnu Manchu's Telugu film "Doosukeltha", which opened last week in Andhra Pradesh, will release in Kerala Friday as "Sarva Kala Vallavan".
Please Wait while comments are loading...
Your Fashion Voice

Telugu Photos

Go to : More Photos