»   » జగన్ గురించి వివి వినాయక్ అలా అంటారని ఎవరూ ఊహించరు!

జగన్ గురించి వివి వినాయక్ అలా అంటారని ఎవరూ ఊహించరు!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లయి పూరి జగన్, రాజమౌళితో తనకు ఉన్న అనుబంధాన్ని వివి వినాయక్ గుర్తు చేసుకున్నారు. మేమేం ముగ్గురం చాలా బాగుంటాం అంటూ వారితో ఉన్న రిలేషన్ గుర్తు చేసుకున్నారు.

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు వివి వినాయక్ తన కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం చిరంజీవి హీరోగా 'ఖైదీ నెం 150'. సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతున్న నేపత్యంలో ఆయన ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు.

అప్పులు, పర్శనల్ లైఫ్, చిరు 150, అఖిల్ ప్లాప్ గురించి.... ఓపెన్‌గా చెప్పిన వివినాయక్!

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వినాయక్ తన పర్శనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లయి పూరి జగన్, రాజమౌళితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మేమేం ముగ్గురం చాలా బాగుంటాం అంటూ వారితో ఉన్న రిలేషన్ గుర్తు చేసుకున్నారు.

VV Vinayak about Puri Jagannadh and SS Rajamouli

రాజమౌళి గురించి మాట్లాడుతూ... రాజమౌళి గారితో నేను కలవడం ఫ్యామిలీ గ్యాదెరింగ్‌లా ఉంటుంది. సరదాగా ఉంటాం. రాజమౌళి గారికి కానీ, కీరవాణి గారికి కాని నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా నేను వాళ్లింటికి వెళ్తే.. 'హే వినయ్ గారు వచ్చారు' అని చాలా ఆనందంగా ఫీలవుతారు. నాకది చాలా ఇష్టం' అని వినాయక్ తెలిపారు.

పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ.....'రాజమౌళిగారు కొంచెం కూల్. కానీ జగన్ అలా కాదు. నాకు నచ్చేది ఏంటంటే.. లోలో ఉన్నప్పుడు జగన్‌ను తలచుకోవాలనిపిస్తుంది. అసలు భయం కానీ, కేర్ కానీ ఏమీ ఉండదు. ఎప్పుడూ బిందాస్‌గా ఉంటాడు. మళ్లీ జన్మంటూ ఉంటే జగన్‌లా పుట్టాలి' అంటూ తన మనసులోని మాట బయట పెట్టారు.

English summary
Tollywood Top director VV Vinayak about Puri Jagannadh and SS Rajamouli. Check out details.
Please Wait while comments are loading...