twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్వర్గంలో ఉన్నా,టీవీ లేదు, ఫోను లేదు అంటూ సూపర్ స్టార్ ఇలా...

    తాజాగా పిల్లోటాక్ లో అక్షయ్‌.. ఆయుర్వేద సూత్రాలు చెప్తూ ఓ వీడియో విడుదల చేసారు.

    By Srikanya
    |

    ముంబయి: బాలీవుడ్‌ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్‌ వరుస సినిమాలు, పబ్లిసిటీ క్యాంపైన్ లతో బిజీగా ఉన్నారు. అయితే ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా తన అభిమానులతో సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. తాజాగా అక్షయ్‌ తన ట్విటర్‌లో రాత్రి పడుకోబోయే ముందు ఓ పిల్లోటాక్‌ వీడియోను పోస్ట్‌ చేశారు.

    కొన్ని రోజుల క్రితం అక్షయ్‌ కేరళలోని ఓ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఆయుర్వేదాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ విషయాలను వివరించారు. ఈ వీడియోలో అక్షయ్‌ మన భారతీయ సంప్రదాయమైన ఆయుర్వేద వైద్యం గురించి వివరించే ప్రయత్నం చేసారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ విషయంలో అభిమానులు తన అడుగుజాడల్లో నడవాలని అక్షయ్‌ కోరుకుంటున్నారు.

    Watch: Akshay Kumar bats for ayurvedic tricks for well being

    కానీ ఇందుకోసం జిమ్‌కి వెళ్లమని ఆయన సలహా ఇవ్వడం లేదు. 25 ఏళ్లుగా ఆయన ఆయుర్వేదాన్ని నమ్ముతున్నారు. తన అభిమానులు కూడా అదే అనుసరించాలని అక్షయ్‌ కోరుకుంటున్నారు.

    ఈ వీడియోలో అక్షయ్ చెప్పిన మాటలు...

    '14 రోజుల పాటు కేరళలో ఉన్నాను. అక్కడ ఉన్నాక మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. కేరళ ఆశ్రమంలో ఉన్నంతకాలం స్వర్గంలో ఉన్నట్లే ఉంది. చిరు తిళ్లు లేవు, టీవీ లేదు, ఫోను లేదు, ఖరీదైన దుస్తులు వేసుకోలేదు. కేవలం పైజామా కుర్తా వేసుకున్నాను. సాదాసీదా ఆహారం మాత్రమే తీసుకున్నాను. మన భారతీయుల్లో చాలా మందికి తెలీని విషయమేంటంటే.. మన దేశానికి ఆయుర్వేదం అనేది దేవుడిచ్చిన వరం. కానీ దానికి మనం తక్కువ విలువ ఇస్తుంటాం.'

    'చాలా మంది ఆరోగ్యమైన జీవనశైలి కోసం ఆయుర్వేదాన్ని వదిలేసి ప్రొటీన్‌ షేక్‌లు, స్టెరాయిడ్‌ సూదులు, పార్లర్‌లో మసాజ్‌లకు వెళుతుంటారు. గమ్మత్తేంటంటే మనం ఏ విదేశీయుల జీవనశైలిని అనుసరిస్తుంటామో వాళ్లే మన భారతీయ ఆయుర్వేదానికి పెద్ద అభిమానులు. మనకున్న వనరుల విలువను ఎప్పుడు గుర్తిస్తామో నాకు తెలీడంలేదు. అలా అని ఆధునిక వైద్యాన్ని నేను తప్పుపట్టడంలేదు. దాని విలువ దానికుంది. కానీ మన సంప్రదాయ వైద్య చికిత్సలైన ఆయుర్వేద, యూనాని, యోగా, నేచురోపతిలాంటి వాటిని మనం ఎందుకు మరిచిపోతున్నాం.

    మన భారత ప్రభుత్వం ఆయుష్‌ పేరిట ఓ ఆయుర్వేద కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇతర చోట్ల వైద్యం చేయించుకుంటే ఎన్ని లాభాలుంటాయో మన ఆయుర్వేద ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా అన్నే లాభాలుంటాయని ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ మన దేశంలో ఎన్ని సౌకర్యాలు ఉన్నా విదేశాలపైనే ఎక్కువ మక్కువ చూపిస్తాం. ఇంకో విషయం.. నేను ఆయుర్వేదం గురించి ఇంత స్పీచ్‌ ఇస్తున్నానంటే నేనేదో ఆయుర్వేద బ్రాండ్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నానని మాత్రం అనుకోకండి.

    నేను నా శరీరానికి ప్రచారకర్తగా మాట్లాడుతున్నాను. మీరూ మీ దేహాలకు బ్రాండ్‌ అంబాసిడర్లు కావాలి. విదేశీ మందుల కన్నా మన భారతీయ వైద్యమే బెస్ట్‌ అని ప్రపంచానికి రుజువుచేద్దాం. ఆయుర్వేదాన్ని మీరు స్వీకరిస్తే ప్రతి ఉదయం మీరు చిరునవ్వుతో నిద్రలేస్తారు. అందుకు నేను గ్యారంటీ ఇస్తున్నాను' అంటూ మన భారతీయ విలువల గురించి నిద్రపోయే ముందు అభిమానులకు గుర్తుచేశారు అక్షయ్‌. అదండీ పిల్లో టాక్.

    English summary
    Akshay Kumar, who shared an over five-minute video on Wednesday night, spent 14 days in an ayurveda centre.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X