»   » Watch: ‘సింగం 123’ ఫుల్ మూవీ

Watch: ‘సింగం 123’ ఫుల్ మూవీ

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సింగం 123'. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 5 ఈ చిత్నాన్ని థియేటర్లతో పాటు, కొంత మొత్తం చెల్లించి చూసే విధంగా ఆన్ లైన్‌లో కూడా విడుదల చేసారు. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని చోట్ల థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది.

సినిమా విడుదలై పట్టుమని 10 రోజులు అయిందో లేదో? ఓ వైపు థియేటర్లలో సినిమా ఉండగానే... ఈ చిత్రాన్ని యూట్యూబులో ఫ్రీగా విడుదల చేసారు మంచు విష్ణు. థియేటర్లలో విడుదలైన అతి తక్కువ కాలంలోనే యూట్యూబులో ఫ్రీగా అందుబాటులోకి వచ్చి తొలి సినిమా ఇదే కాబోలు. రేపటితో ఈ సినిమాను థియేటర్ల నుండి తీసేస్తున్నట్లు సమాచారం.


అందుకు మంచు విష్ణు ఈచిత్రాన్ని యూట్యూబ్ ద్వారా ఫ్రీగా విడుదల చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక మీరు థియేటర్లకు వెళ్లాల్సిన పని లేదు. ఇక్కడే, ఇప్పుడే మీరూ ఈ సినిమాపై ఓ లుక్కేయండి.


English summary
Singham123 Full Movie. While "Singham 123" is still playing at some theatres in Andhra Pradesh and Telangana, a daring Vishnu has released the flick on internet directly today.
Please Wait while comments are loading...