twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిజినెస్ కోసం.. బోల్డ్ గా రెచ్చిపోయింది.. (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : సాధారణంగా తమ సినిమా ఏ జానర్ కి సంభందించిందో, ఎలా ఉండబోతోందో రుచి చూపిస్తూంటారు టీజర్ల ద్వారా. ఓ రకంగా ఇది చిత్రం ప్రమోషన్ కు ఊతం ఇచ్చి బిజినెస్ జరిగేలా చూస్తుందనటంలో ఆశ్చర్యం లేదు. అందుకే దర్శక నిర్మాతలు ఫస్ట్ లుక్, టీజర్ల మీదే దృష్టి పెడుతున్నారు. ఇదిగో మీరు ఇప్పుడు చూడబోతున్న బాలీవుడ్ చిత్రం టీజర్ ...ముంబై సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏముందయ్యా అందులో అంత స్పెషాలిటీ అంటే హాట్ గా హీరోయిన్ రెచ్చిపోవటమే అంటున్నారు. దాంతో అందరి దృష్టీ,ముఖ్యంగా ట్రేడ్ వర్గాల దృష్టీ ఈ చిత్రంపై పడింది. మీరూ ఓ లుక్కేయండి...

    ఇక ఈ చిత్రం ద్వారా బార్బీ హోండా పరిచయం అవుతోంది. ఆమె మరెవరో కాదు..తెలుగులో ప్రేమా గీమా జాన్తా నై అనే చిత్రంతో లాంచింగ్ కి సిద్దమవుతున్న భామ. ఇక ఈమె తన పేరుని రీసెంట్ గా మనారా గా మార్చుకుంది. అంతేకాదు ఆమెకో కేరాఫ్ ఎడ్రస్ కూడా ఉంది. ఆమె ప్రియాంకచోప్రాకు మొదటి కజిన్.

    ఈ చిత్రం ద్వారా తాను ఎటువంటి అందాల ప్రదర్శనకు అయినా సిద్దమేనని ఇండస్ట్రీకి చెప్తోందన్నమాట. తన అక్క ప్రియాంక చోప్రా కూడా తప్పేమి లేదని అండగా నిలవటంతో ఇదిగా ఇలా నగ్నంగా రెచ్చిపోయిందిట.

    Watch Zid Trailer: Bold Avatar Of Mannara

    ప్రేమా గీమా జానతా నయ్ చిత్రం విషయానికి వస్తే..

    ప్రేమ అంటే పాము అని భయపడే తత్వం ఆ కుర్రాడిది. జీవితంలో సాధించాల్సిన విషయాల్ని పెద్ద జాబితాగా రాసి పెట్టుకున్నాడు. అలా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఓ అమ్మాయి అతడి జీవితంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెరపై చూడాల్సిందే అంటున్నారు శ్రీరామ్‌చంద్ర. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'ప్రేమ గీమ జాన్‌తా నయ్‌'. బార్బీ హీరోయిన్. సుబ్బు ఆర్వీ దర్శకుడు.

    English summary
    Trailer of Zid starring Barbie Handa, Karanveer Sharma and Shraddha Das is out. Priyanka Chopra's first cousin Barbie Handa who was rechristened as Mannara has gone very bold for this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X