Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గుర్రంపై నుండి పడిపోయిన కత్రినా కైఫ్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రస్తుతం ‘ఫితూర్' సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ చిత్రం ద్వారా తొలిసారిగా కత్రినా-ఆదిత్య రాయ్ కపూర్ కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నారు.
ఈ చిత్రం సరికొత్త సబ్జెక్టుతో తెరకెక్కుతోంది. ఇందులో ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు భిన్నంగా చూపించబోతున్నారు. అంతే కాకుండా ఇందులో కత్రినా కైఫ్ గుర్రం స్వారీ చేస్తూ కనిపించబోతోంది. గుర్రం స్వారీ చేయడం ఆమెకు చాలా కష్టం అవుతోందని యూనిట్ సభ్యులు అంటున్నారు.
షూటింగులో భాగంగా కత్రినా కైఫ్ గుర్రం స్వారీ చేస్తుండగా ఓ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె క్రింద పడిపోయినట్లు తెలుస్తోంది. రైడింగ్ చేస్తుండగా ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది. దాదాపుగా కింద పడిపోయింది. వెంటనే యూనిట్ సభ్యులు స్పందించడంతో గాయాలు కాకుండా తప్పించుకుందని ఓ ఆంగ్లపత్రిక కథనం.
అయితే ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా కత్రినా మళ్లీ గుర్రం ఎక్కి షూటింగ్ పూర్తి చేసింది. సినిమాలో కత్రినా కైఫ్ గుర్రం స్వారీ చేసే సన్నివేశాలు భిన్నంగా ఉండబోతున్నాయని అంటున్నారు. ‘ఫితూర్' చిత్రానికి అభిషేక్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నటి రేఖ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.