»   » మూడు గంటలకు పైగా : పవన్‌ , రామ్ చరణ్ కలిసి... (ఫొటోలు)

మూడు గంటలకు పైగా : పవన్‌ , రామ్ చరణ్ కలిసి... (ఫొటోలు)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌ సెట్లో హీరో పవన్‌ కల్యాణ్‌ను రామ్‌చరణ్‌ కలిశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవల విడుదలైన 'బ్రూస్‌లీ' సినిమా విజయవంతమవడంపై రామ్‌చరణ్‌కు పవన్‌ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌కు పవన్‌ బొకే ఇచ్చి ప్రశంసించారు. దాదాపు మూడు గంటలు పైగా ఈ సెట్లో రామ్ చరణ్ గడిపాడని సమాచారం.

'బ్రూస్‌లీ'గా థియేటర్లలో సందడి చేస్తున్నాడు రామ్‌చరణ్‌. ఇప్పుడు బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ని కలుసుకొని ఆయన ఆశీస్సులు అందుకొన్నాడు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన 'బ్రూస్‌లీ' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సెట్లో అడుగుపెట్టాడు.



అక్కడ బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ను కలుసుకొని సరదాగా ముచ్చటించుకొన్నారు. 'బ్రూస్‌లీ' విశేషాల్ని చరణ్‌ని అడిగి తెలుసుకొన్నారు పవన్‌. 'సుప్రీమ్‌'గా సందడి చేయనున్న సాయిధరమ్‌ తేజ్‌ 'సర్దార్‌..' సెట్లో కాసేపు సరదాగా గడిపారు. 'పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌' పతాకంపై చరణ్‌తో ఓ సినిమా చేస్తానని పవన్‌ ఇదివరకు ప్రకటించారు. ఆ సినిమా ఎప్పుడన్నది పవన్‌ కల్యాణే చెప్పాలి.


స్లైడ్ షోలో.... ఆ ఫొటోలు చూడండి...


పవన్-చరణ్

బ్రూస్ లీ చిత్రం విజయవంతమైనందుకు రామ్ చరణ్ ని అభినందించారు


 


ఇద్దరూ

సెట్స్ పై ఓ కొడక్ మూవ్ మెంట్ ఇదిగో ఫ్యాన్స్ కోసం


 


మెగా హీరోలు

మెగా హీరోలు తో పాటు నిర్మాత శరద్ మరార్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ నర్రా, అలీ


 


అనీల్ రావిపూడి

సాయి ధరమ్ తేజ, అనీల్ రావి పూడి కలిసి బ్రూస్ లీ సెట్స్ పై...


 


ఫైట్ మాస్టర్ తో

ఫైట్ మాస్టర్స్ రామ్ -లక్ష్మణ్ తో కలిసి మెగా హీరోలిద్దరూ


 


Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos