twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ వెళ్ళాడు సరే... మరి జూనియర్??? కనీస ప్రకటన కూడా లేదు...ఎందుకు???

    |

    అభిమానం తెరమీదినుంచి పాత్ర మీదకీ... ఆ హీరో పాత్ర మీదనుంచి ఆ పాత్రని పోషించిన నటుడి మీదకీ మళ్ళి... ఆ నటున్ని తనకంటే ఎక్కువగా ప్రేమించే స్థాయికి అభిమానం పెంచుకున్నాౠ. తమ అభిమాన హీరో మీద ఒక్క మాట పడ్డా తట్టుకోలేక గొడవలు పడ్డారు. "అభిమానులకి ఎమోషన్సే ఉంటాయ్..!" అంటూ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది... ఔను అదే ఎమోషన్ తో కొట్టుకున్నారు వాళ్ళు ఎమోషన్ గా మారిన అభిమానం. ఒక అభిమాని ప్రాణం తీసింది.... ఇంకో అభిమానిని నేరస్తున్ని చేసి రేపో మాపో జైలికి పంపనుంది....

    గొడవ పడ్డ ఇద్దరిలో చనిపోయింది పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి తన వంతు భాద్యతగా పవన్ అక్కడికి వెళ్ళాడు. వాళ్ళని పరామర్షించాడు. కానీ ఇప్పటి వరకూ ఎన్టీఆర్ మాత్రం ఒక్క ప్రకటన చేయకపోవటం... ఆయన అభిమానులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒక అభిమాని అంతటి నేరానికి ఒడిగట్టినప్పుడు..అదీ తనమీద అభిమానం తో అలా చేసినప్పుడు. కనీసం ఇది సరైన పద్దతి కాదూ అని చెప్పాల్సిన భాహ్యత ఎంతైనా ఉంది..... మరి ఈ విషయం లో ఏం అయ్యిందీ ఇప్పటి వరకూ ఎన్టీఆర్ ఎందుకని అలా సైలెంట్ గానే ఉండిపోయారు అన్న ప్రశ్నలు ఆయన అభిమానులనే తొలుస్తున్నాయి....

    అభిమానుల గొడవ

    అభిమానుల గొడవ

    ఈ నెల 21న కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో వినోద్ రాయల్ కత్తిపోట్లకు గురై చనిపోయాడు

    హంతకులు దొరికారు

    హంతకులు దొరికారు

    వినోద్ రాయల్ హత్యకు గురైన కేసులో ప్రధాన నిందితుడు అక్షయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని నందిని దాబా వద్ద అతన్ని పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు.

    హత్యలో ఏడుగురు

    హత్యలో ఏడుగురు

    అక్షయ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పవన్ అభిమాని హత్య కేసులో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

    పవన్ స్పందన

    పవన్ స్పందన

    ఈ నేపథ్యంలో పవన్ ఈ రోజు వినోద్ తల్లిదండ్రులను పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఇంటికి రాగానే వినోద్ తల్లి అతని పైన పడి కన్నీరుమున్నీరు అయ్యారు. పవన్.. ఏం జరిగిందో తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పింది సావదానంగా విన్నారు

    అభిమానులనుద్దేషించి

    అభిమానులనుద్దేషించి

    వినోద్ హత్య విషయం లో దోషులని శిక్షించాల్సిందే అంటూనే... అభిమనుల మధ్య ఇటువంటి గొడవలు ఉండకూడదనీ.., తన ఫ్యాన్స్ ఎవరూ ఇలా చేయవద్దనీ చెప్పాడు.

    అప్పుడు కూదా

    అప్పుడు కూదా

    గతం లో భీమవరం లో ప్రభాస్ అభిమానులకూ పవన్ ఫ్యాన్స్ కూ మధ్య జరిగిన వార్ నేపథ్యం లోనూ "తన అభిమానులే అయితే గొడవలు పడనే కూడదంటూ గట్టిగానే చెప్పాడు.

    జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంకా సైలెంట్గానే

    జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంకా సైలెంట్గానే

    అయితే జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఈ ఘటనపై స్పందించాల్సి వుంది. 'అభిమానులూ మా కోసం చచ్చిపోవద్దు.. చంపుకోవద్దు..' అన్న సందేశం జూనియర్‌ ఎన్టీఆర్‌తోపాటు ప్రతి ఒక్క స్టార్‌ హీరో ఇచ్చి తీరాల్సిన సందర్భమిది.

    ఇప్పటికి కూడా

    ఇప్పటికి కూడా

    కనీసం తన అభిమానులకైనా "ఇలా చేయవద్దు అనో... ఆ ఘటన మీద తన స్పందన ఏమితనేది అయినా తెలియజేసి ఉండాల్సింది. కానీ సంఘటన జరిగి మూడురోజులౌతున్నా...

    తెలిసినా మౌనమే

    తెలిసినా మౌనమే

    నిన్నటినుంచీ రెండు రాష్ట్రాలలోనూ మీడియాలో వస్తూనే ఉంది... అయినా ఇప్పటిదాకా యంగ్ టైగర్ ఈ విషయం మీద తన స్పందన ఏమిటో తెలియ జేయనే లేదు....

    నిలదీయరు కానీ

    నిలదీయరు కానీ

    ఎంత బిజీ గా ఉన్నా... అతనెవరో చేసిన పనితో నాకేం సంభందం అనుకున్నా... పరవాలేదు ఎవరూ ఏం నిలదీయరు కానీ...

    స్పనదన తెలియ జేయతం అవసరం

    స్పనదన తెలియ జేయతం అవసరం

    అభిమాని అనే వాడికి కనీస కనువిప్పుకోసమైనా.., పిచ్చి అభిమానం పెంచుకొని ఇలాంటి తలవంపులు తేవద్దని చెప్పేందుకైనా జూనియర్ ఇప్పుడు ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది.

    English summary
    Junior NTR silence on fans war issue.... his fan murders another hero Pawan kalyan's fan in Tirupati
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X