twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నష్టానికి సిద్దపడే రిలీజ్ చేస్తున్నా: నాగ చైతన్య

    By Srikanya
    |

    హైదరాబాద్ : మాకు నష్టం ఖచ్చితంగా ఉంటుంది. దానికి సిద్దపడే విడుదల చేస్తున్నాం. తుఫాన్ బీభత్సం వల్ల వారికి ఎదురైన నష్టంతో పోలిస్తే మన నష్టం ఏముంది చెప్పండి. చాలా బాధగా ఉంది. ఈ సినిమా విడుదలకు కావాల్సిన అన్ని పనులూ పూర్తైపోయాయి. అందుకే తప్పటం లేదు అంటూ వివరణ ఇచ్చారు నాగ చైతన్య. ఆయన తన తాజా చిత్రం ‘ఒక లైలా కోసం' కోసం అంటూ ప్రేక్షకుల ముందుకి ఈ శుక్రవారం రానున్నారు. తుఫాన్ తో ఉత్తరాంధ్ర ప్రాంతాలలో విడుదల ఉండదు కదా ..అది మీకు నష్టం కదా అనే ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు.

    నాగ చైతన్య మాట్లాడుతూ... హుద్‌హుద్‌ తుపాన్‌ వల్ల వైజాగ్‌ ప్రాంతమంతా అల్లకల్లోలం అయిపోయింది. టీవీలో అక్కడి పరిస్థితిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. అక్కడ పరిస్థితులు మెరుగవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఉత్తరాంధ్రలో మా సినిమా రిలీజ్‌కి ఎన్ని థియేటర్లు దొరికితే అన్నింటిలో రిలీజ్‌ చేస్తాం. అక్కడ పరిస్థితులు మెరుగుపడ్డాక ఓ రెండు మూడు వారాల తరువాత సినిమాను రీ-రిలీజ్‌ చేస్తాం. ‘కరెంట్‌ తీగ' వాయిదా పడడం వల్ల థియేటర్లు ఏమీ పెంచలేదు. ముందు ఎన్ని థియేటర్లు అనుకున్నామో అలాగే విడుదల చేస్తాం అన్నారు.

    'దడ', 'ఆటోనగర్‌ సూర్య' ఫెయిల్యూర్స్ తో తనకెలాంటి కథలు నప్పుతాయో చైతూకు బాగా అర్థమైంది. అందుకే ప్రేమకథలవైపు దృష్టిపెట్టారు. 'మనం'తో మరపురాని విజయం అందుకొన్న చైతన్య ఇప్పుడు వినోదాల ప్రేమకథతో అల్లరి చేయబోతున్నాడు. అదే 'ఒక లైలా కోసం'. ‘గుండెజారి గల్లంతయ్యిందే' ఫేం విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగ చైతన్య మీడియాతో మాట్లాడారు.

    నాగచైతన్య ఇంకేమన్నారు...ఆ విశేషాలు స్లైడ్ షోలో...

    'ఆటోనగర్‌ సూర్య' నేర్పిన పాఠాలేంటి?

    'ఆటోనగర్‌ సూర్య' నేర్పిన పాఠాలేంటి?

    ఆ సినిమా చాలా ఆలస్యంగా విడుదలైంది. నిజానికి సినిమా విడుదల అనేది నా చేతుల్లో లేని విషయం. నిర్మాతలు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమైంది. 'మనం', 'ఒకలైలా కోసం' నిర్మాణ పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకొన్నా. అదో కొత్త అనుభవం.

    రీ-షూట్‌ చేశాం

    రీ-షూట్‌ చేశాం

    సినిమా మొత్తం చూశాక నాన్నకి రెండు మూడు పాయింట్లు డిఫరెంట్‌గా అనిపించి చిన్న మార్పులు చేశారు. అందువల్ల మూడు రోజులు రీ-షూట్‌ చేశాం. ఇప్పుడు సినిమా అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. ‘గుండెజారి గల్లంతయ్యిందే సినిమా టీమ్‌ ఈ సినిమాకి పనిచేయడంతో విజయ్‌ చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యాడు.

    అందుకే నేనే ప్రమోట్ చేసుకుంటున్నా

    అందుకే నేనే ప్రమోట్ చేసుకుంటున్నా

    నా సినిమాను నేనే ప్రమోట్‌ చేసుకోబోతున్నాను. ఇంకెన్నాళ్ళు నీ సినిమాని నేను ప్రమోట్‌ చెయ్యను అని నాన్న అంటున్నారు. సో ప్రమోషన్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకోబోతున్నా. నీ కంటూ సొంత ఇమేజ్‌ను సృష్టించుకోవాలి. ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలి అని నాన్నగారు ఎప్పుడూ చెబుతుంటారు. అవసరమైతే సినిమా విడుదలకు ముందు ఒక్కసారి మీడియాముందుకొస్తానని చెప్పారాయన. నాన్న చెప్పినట్టుగానే సొంతంగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.

    డెషిషన్ నాదే..

    డెషిషన్ నాదే..

    నా కథల విషయంలో పూర్తి స్వేచ్చ నాదే. నాన్న కథలు వింటారు కానీ ఫైనల్‌ డెసిషన్‌ మాత్రం నాదే. కథలో ఏదైనా తేడా అనిపిస్తే సలహాలిస్తారు.

    సెంటిమెంట్ గా ఆ పేరు పెట్టారు

    సెంటిమెంట్ గా ఆ పేరు పెట్టారు

    ఈ సినిమాలో నా పేరు కార్తీక్‌. ‘ఏమాయ చేశావె' ‘తడాఖా' సినిమాల్లో కూడా నా పేరు కార్తీకే. సెంటిమెంట్‌గా దర్శకుడు ఆ పేరు పెట్టారు. నాకు అటువంటి సెంటిమెంట్‌లేమీ లేవు. ఇప్పటి వరకు కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో లవర్‌బాయ్‌గా కనిపించాను. ఈ సినిమా నా పాత్ర అలా ఉండదు. కొత్తగా ట్రై చేశాను. గత సినిమాలతో కంపేర్‌ చేసి చూస్తే 100 పర్శంట్ లవ్‌ సినిమాలో పాత్రలా ఇందులో నా పాత్ర ఉంటుంది.

    ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ ఇది.

    ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ ఇది.

    ఒక అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయి ఎంత వరకు వెళ్తాడు అనేది సింగిల్‌ లైన్లో ఈ సినిమా కథ. ఈ సినిమాలో పూజ కోసం చాలా చేశా. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ కుర్రాడు ఏమేం చేయగలడో, ఏం చేశాడో వినోదాత్మకంగా చూపించాం.

    తేడా అదే..

    తేడా అదే..

    ఇంతకు ముందు ప్రేమ కథలకు దీనికి చాలా తేడా ఉంది. ఇది పూర్తిగా పరిణితి చెందిన కుర్రాడి ప్రేమ కథ. గ్రాడ్యుయేషన్ పూర్తైన కుర్రాడిగా ఇందులో కనిపిస్తా. ఇంట్లో సంభందాలు చూస్తూంటారు. నాకేమో పెళ్లంటే ఆసక్తి ఉండదు. అలాంటి వాడు ప్రేమలో పడితే ఏమౌతుందనేది ఈ సినిమా.

    నష్టాలు కూడా అందరూ పంచుకోవాలి

    నష్టాలు కూడా అందరూ పంచుకోవాలి

    నేను ఏ సినిమా చేసినా ముందు బడ్జెట్ ఎంత అవుతుందో తెలుసుకుంటాను. అందుకు తగ్గట్టుగానే సినిమా తీయాలనుకుంటాను. ఒక సినిమా ఫెయిల్ అయితే నిర్మాతలే కాదు దాన్ని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ నష్టపోతారు. నా దృష్టిలో లాభాల్నే కాదు...నష్టాల్ని కూడా అందరూ పంచుకోవాలి. అప్పుడే పరిశ్రమ బాగుపడుతుంది.

    నేనైతే నష్టంలో భాగమవుతా

    నేనైతే నష్టంలో భాగమవుతా

    దర్శకులు, హీరోలే ఎక్కువ రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. సినిమా నష్టానికి వాళ్ళు కూడా హెల్ప్‌ చెయ్యాలి అంటే నేను సమాధానం చెప్పలేను. అదే నా సినిమా విషయంలో అంతా నా కంట్రోల్‌లో ఉంటే నేనైతే నష్టంలో భాగమవుతా.

    'ఒక లైలా కోసం' అనే టైటిల్‌ ఆలోచన ఎవరిది?

    'ఒక లైలా కోసం' అనే టైటిల్‌ ఆలోచన ఎవరిది?

    దర్శకుడిదే. కథకు అనుగుణమైన పేరు అదే. కథకు కూడా యాప్ట్‌ అయ్యింది. తాతగారు నటించిన ఈ పాట ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో.. సినిమా కూడా అంతే హిట్‌ అవుతుంది. విజయ్‌కుమార్‌ అద్భుతంగా తెరకెక్కించాడు.

    కామెడీ కూడా చెయ్యగలనని ప్రూవ్‌ చేసింది

    కామెడీ కూడా చెయ్యగలనని ప్రూవ్‌ చేసింది

    ‘మనం' వంటి సినిమాలో నటించడం నా అదృష్టం. ఆ సినిమాతో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అప్పటి వరకు లవర్‌బాయ్‌ ఇమేజ్‌, యాక్షన్‌ సినిమాలు చేసి కామెడీ చెయ్యగలనా అని చాలామంది అనుకున్నారు. నేను కామెడీ కూడా చెయ్యగలనని ప్రూవ్‌ చేసింది ‘మనం' సినిమా. నా కెరీర్‌కి మైల్‌స్టోన్‌గా నిలిచిన చిత్రమది.

    మళ్లీ యాక్షన్ చిత్రాలు చేస్తానేమో...

    మళ్లీ యాక్షన్ చిత్రాలు చేస్తానేమో...

    నటుడన్నాక అన్ని సినిమాలూ చేయాలి. నేనూ అదే ప్రయత్నంలో ఉన్నా. ప్రేక్షకులు మాత్రం నా నుంచి ప్రేమకథలే ఆశిస్తున్నారేమో అనిపిస్తోంది. ఐదారేళ్ల తరవాత ఇలాంటి కథలే చేస్తే ఎవరికీ నచ్చకపోవచ్చు. అప్పుడు నా నుంచి యాక్షన్‌ కథా చిత్రాలే ఎక్కువగా ఆశిస్తారేమో?

    ఎన్టీఆర్ తో చెయ్యటానికి సిద్దమే...

    ఎన్టీఆర్ తో చెయ్యటానికి సిద్దమే...

    ఎన్టీఆర్‌తో సినిమా చెయ్యాలని చాలాకాలంగా అనుకుంటున్నాం. కానీ సరైనా కథ కుదరలేదు. మల్టీస్టారర్‌ సినిమాలు చెయ్యడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాను.

    రెమ్యునేషన్ కూడా తగ్గించుకుంటా

    రెమ్యునేషన్ కూడా తగ్గించుకుంటా

    అలాంటప్పుడు నా పారితోషికం తగ్గించుకోవడానికి నేను సిద్ధం. ఇద్దరు హీరోలు కలసి చేశారంటే ఆ సినిమా క్రేజ్‌ మరోలా ఉంటుంది. తక్కువ కాల్షీట్లతో సినిమా పూర్తిచేయొచ్చు. తప్పకుండా మల్టీస్టారర్స్ చేస్తాను. ఆ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. బాలీవుడ్, హాలీవుడ్‌లో ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలే వస్తున్నాయి. మార్కెట్‌పరంగా కూడా ఆ చిత్రాలకు డిమాండ్ వుంది. మంచి కథ కుదిరితే భవిష్యత్తులో మల్టీస్టారర్ చిత్రాలు చేస్తాను.

    పెళ్లెప్పుడు?

    పెళ్లెప్పుడు?

    ఏమో మరి? ఇప్పుడే చెప్పలేను. ఇంట్లో వాళ్లు వెదుకుతున్నారు. మంచి అమ్మాయిని చూడండి.. నచ్చితే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఈలోగా నా ప్రయత్నాల్లో నేనున్నా.(నవ్వుతూ)

    English summary
    "Hudhud cyclone has deeply affected as the damage is intense. But we have announced this date already and promoted the 'Oka Laila Kosam' movie. For the same reason we are not postponing the movie's release. In whatever theatres available, movie will release", said Naga Chaitanya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X