twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌కళ్యాణ్ అంత ఎమోషనల్ అవటానికి కారణమేమిటి? ఎప్పుడూ లేనిది ఎందుకిలా???

    ఎప్పుడూ ఏ సినిమా ఫంక్షన్ లోనూ ఇలా మాట్లాడని పవన్ మొన్నటి కాటమరాయుడు ఈవెంట్లో మాత్రం తన శైలికి భిన్నం గా ప్రవర్తించాడు..అసలు ఎందుకిలా అంత ఎమోషనల్ అయ్యాడు..???

    |

    పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆత్మవిశాసం అన్నట్టు ఉంటారు పవన్ ఫ్యాన్స్. రాజకీయాల్లోకి రాకముందు కూడా పవన్ లో ఎక్కడా బేలతనం గానీ, సంజాయిషీ చెప్పుకుటున్నట్టుండే ఎమోషన్ గానీ చూడలేదు. పవన్ లో పీక్స్ లో కనిపించే ఎమోషన్ అంటే ఆవేశం, ఉద్వేగం తో ఊగిపోతూ దైరాన్ని పెంచేలా ఉండటమే. కానీ ఈసారి అలా లేదు. తన గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారు ఆ భావాన్ని తీసేయాలి అన్నట్టు కనిపించింది పవన్ వైఖరి. చిన్నప్పటి నుంచీ తను అనుభవించిన ప్రతీ దుఖాన్నీ ఈ ఈవెంట్లో అభిమానులతో పంచుకున్నాడు కాటమరాయుడు. అయితే అది ఖచ్చితంగా కుంగుబాటు లో ఉన్న ఫీలింగ్ మాత్రం కాదు... ఒక కొత్త నాయకత్వ లక్షణాల తో తయారవుతున్న లీడర్ అంతరంగ భాషణ లా ఉంది...

    వేదిక వద్దకు

    వేదిక వద్దకు

    వేదిక వద్దకు రాలేకపోయిన అభిమానులందరికీ క్షమాపణలు. మీ అందరి క్షేమం కోరి చిన్నస్థాయిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాను. ఇక్కడి రాలేక పోయిన మహిళలు, సోదరీమణులందరికీ మరోసారి క్షమాపణలు చెప్తున్నాను. ఏ పనైనా నిజాయితీతో పనిచేశాను.

    భవిష్యత్‌లో ఎలాంటి

    భవిష్యత్‌లో ఎలాంటి

    భవిష్యత్‌లో ఎలాంటి బాధ్యత అప్పగించినా నిబద్ధత, నిజాయితీతో వ్యవహరిస్తాను. ప్రజా సంక్షేమం కోసం అధికారం అంతిమ లక్ష్యం కాదు అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టగానే ఎమోషనల్ అయిపోయాడు పవన్. సుస్వాగతం సమయం లో తండ్రిపాత్ర చనిపోయినప్పటి సఘటననీ అప్పుడు తన లో జరిగిన మానసిక సంఘర్షణనీ చెప్పిన పవన్. అక్కడినుంచీ మరింత ఓపెన్ అయిపోయాడు.

    హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు

    హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు

    ఈ మధ్య హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని చోట్ల తన పర్సనల్ విషయాలని , ఎవరూ ఊహించహని తన ఎమోషనల్ పీక్స్ తనమీద చూపించిన ప్రభావాన్నీ చెప్పాడు పవన్. "ఏమీ సాధించలేకపోతున్నానే ఒత్తిడిలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించాను. కాస్త ఆలస్యమైతే ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఇంట్లో వాళ్లు నన్ను కాపాడారు. అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ మానసిక స్థైర్యాన్ని నింపారు. డిగ్రీలు చదివితేనే చదువు కాదు. నువ్వు చదివినా చదవకపోయినా మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం.

    ఇంట్లో వాళ్లు నన్ను కాపాడారు

    ఇంట్లో వాళ్లు నన్ను కాపాడారు

    ఇంట్లో వాళ్లు నన్ను కాపాడారు. అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ మానసిక స్థైర్యాన్ని నింపారు. డిగ్రీలు చదివితేనే చదువు కాదు. నువ్వు చదివినా చదవకపోయినా మేం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. జీవితంలో స్పష్టత ముఖ్యం. ముందు, నీకేం కావాలో నిర్ణయించుకో' అని సలహా ఇచ్చారని" చెప్పినప్పుడు పవన్ లో మరో చిన్నపిల్లాడి మనస్తత్వం కనిపించింది.

    ఇదంతా బాగానే ఉంది

    ఇదంతా బాగానే ఉంది

    ఇదంతా బాగానే ఉంది కానీ ఎప్పుడూ ఇలా తన స్వవిషయాలని చెప్పుకోని పవన్ ఇప్పుడు సడెంగా ఎందుకింత ఓపెనప్ అయ్యాడు? అన్న అనుమానమూ వచ్చింది. అయితే దాదాపుతన 20 నిమిషాల స్పీచ్ లో ఎక్కడా ఆ ఫీలింగ్ కనపడనివ్వలేదు. అసలు సినిమా ఫంక్షన్లలో ఇంత సేపు ఎప్పుడూ మాట్లాడలేదు కూడా, ఒక సినిమా ఈవెంట్లో ఇంత సేపు పవన్ ప్రసంగించింది. వజ్రోత్సవాల సమయం లో మోహన్ బాబుకు కౌంటర్ ఇవ్వటానికి, మళ్ళీ ఇదిగో ఇప్పుడే

    పవన్ దృష్టంతా

    పవన్ దృష్టంతా

    పవన్ దృష్టంతా తనమీద ఉండే అభిప్రాయాన్ని పూర్తిగా చెప్పేయాలనే తపన కనిపించింది. రేపు ఒక నాయకుడి గా నిలబడబోయేముందు అటు అభిమానులకూ, ఇటు ఓటర్లకూ తానేమిటో, తనలో ఉండే సంఘర్షన ఏ స్తాయిలో ఉందో చెప్పాలనుకున్నాడా అనిపించేలా చెప్పాడు పవన్,

    ఇదివరకెన్నడూ తన సినిమా

    ఇదివరకెన్నడూ తన సినిమా

    ఇదివరకెన్నడూ తన సినిమా కి సంబందించిన ఈవెంట్లలో కూడా ఎక్కువ సేపు మాట్లాడలేదు. అన్నయ్య తో ఉండే తన అనుభందం గురించి కూడా రెండంటే రెండే మాటల్లో చెప్పేసేవాడు. కానీ ఈ సారి మాత్రం పవన్ పూర్తి స్థాయిలో తన చుట్టూ ఉండే ఎమోషన్స్ నీ, తనకుటుంబం తనకు ఇచ్చిన మానసిక స్థైర్యాన్నీ గుర్తు చేసుకుంటూనే...

    ఇకముందు తాను ఎలా ఉండబోతున్నాడో

    ఇకముందు తాను ఎలా ఉండబోతున్నాడో

    ఇకముందు తాను ఎలా ఉండబోతున్నాడో.. అసలు తాను నటననుంచి రాజకీయాలవైపు ఎందుకు టర్న్ తీసుకున్నాడో అన్న విషయాలమీద పూర్తి స్పష్టతనిచ్చాడు. మొత్తం ప్రసంగం లో ఎక్కడా నాటకీయత గానీ, లేదంటే మరేదో హైప్ క్రియేట్ చేయటానికి చెప్పే పంచ్ డైలాగ్ లలాంటి వాక్యాలు గానీ లేవు.

    ఉన్నదంతా ఒక తపన.

    ఉన్నదంతా ఒక తపన.

    ఉన్నదంతా ఒక తపన.., ఒక మార్పుకు ముందు తానేమిటో విశ్లేషించుకున్నట్టు గా తన లోలోపలి సంఘర్షనని చెప్పేసాడా అన్నట్టు కనిపించింది. అంటే ఇక ముందు తాను రాజకీయాల్లో అనుసరించబోయే పద్దతి ఎలా ఉండబోతోందీ దానికి ముందు ఇన్ని సంవత్సరాలుగా తనని ప్రోత్సహించిన సంగతులేమిటీ, తానింత ఎమోషనల్ గానూ, స్ట్రిక్ట్ గానూ ఉండిపోవటానికి తన జీవితం లో ఎదుర్కొన్న సంఘటనలెలాంటివీ తనకు తానే చెప్పుకుంటున్నట్టే అందరికీ చెప్పేసాడు పవన్.

    అదే సమయం

    అదే సమయం

    అదే సమయం లో ఈపటి వరకూ నేను అందరికీ తమ్మున్నే ఈ సారి మాత్రం అన్నగా మారాను అన్నప్పుడు అభిమానులు మేమూ తమ్ముళ్ళమే అన్నప్పుడు అరిచినప్పుడు కూడా పవన్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి... ఇప్పటి వరకూ మీరు అనుకుంటున్న పవన్ వేరూ నేను వేరూ సినిమా హీరోగా కాదు మీతో నడిచే మనిషిగానే చూడంది అన్న భావన వచ్చేలా మాట్లాడాడు

    మీరు తమ్ముళ్ళు కాదు నా ప్రాణం

    మీరు తమ్ముళ్ళు కాదు నా ప్రాణం

    మీరు తమ్ముళ్ళు కాదు నా ప్రాణం.... అని చెప్పి తనకు అభిమానులు అంటే అనుచరులు కాదు మీరూ నేను సమానం మీతో కలిసి నడిచే వాన్ని నేను అని నిజాయితీగా చెప్పటం తో పవన్ వారిలో ఒక భాద్యతాయుతమైన నాయకుడి ముద్రని బలంగా వేయగలిగాడన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

    అయితే ఆ మాట కూడా వ్యూహం లో

    అయితే ఆ మాట కూడా వ్యూహం లో

    అయితే ఆ మాట కూడా వ్యూహం లో భాగం కాదు పవన్ మనస్తత్వమే అంత... ఎప్పుదూ తనని తాను "సుపీరియర్" అనుకోకుండా అందరి తోనే తాను అనే భావన పవన్ కళ్యాణ్ లో ఎప్పటినుంచో ఉంది. ఆభావనే మొన్నటి స్పీచ్ లో కనిపించింది. ఏదేమైనా కాటమరాయుడు ఈవెంట్‌లో కొత్త పవన్‌ కళ్యాణ్‌ని అభిమానుల ముందు ఆవిష్కరించాడు.

    English summary
    Pawan Kalyan, who used to be very reticent during filmy events, surprised everyone by speaking close to half an hour during the pre release event of his upcoming film Katamarayudu, Pawan recollected some of the emotional and noteworthy scenes in his movies and stated how they had an strong influence on his real life so far...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X