twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లేడీస్ టైలర్ లో ఆమెను తీసేసారా తప్పుకుందా..!? ఎవర్ని తీసుకున్నారో తెలుసా...!? ఇక అందాల ప్రదర్శనే

    కొన్ని కారణాల వలన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమాలో నుంచి ఈషా తప్పుకుందట. ఆమె స్థానంలో మనాలి రాథోడ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

    |

    సీనియర్ వంశీ సినిమాలు అనగానే సితార .. అన్వేషణ .. లేడీస్ టైలర్ వంటి విజయవంతమైన చిత్రాలు గుర్తుకువస్తాయి. ఈ సినిమాల్లో ఆయన లేడీస్ టైలర్ కి సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో వున్నాడు. వంశీ 'లేడీస్ టైలర్' మళ్లీ వస్తున్నాడు. అయితే ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్ టెక్నిక్స్ తో.. మగువల అందాలను మరింత పెంచే టైలర్ గా వస్తున్నాడు. సన్నాఫ్ లేడీస్ టైలర్ గా.. ఫ్యాషన్ డిజైనర్ గా అలరించనున్నాడు. వంశీ లేడీస్ టైలర్ విడుదలై 30 ఏళ్లవుతోంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' తెరకెక్కించనున్నారు. డైరెక్టర్ వంశీని మరోమెట్టుకు తీసుకెళ్లిన చిత్రం లేడీస్ టైలర్. రాజేంద్రప్రసాద్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలచిన ఈ మూవీ.. ఆ ఏడాది హిట్ సినిమాల్లో ఒకటిగా నిలచింది. రాజేంద్రుడికి కామెడీ హీరోగా స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టింది. ఇక ఈ సినిమా అంతా మచ్చ ఉన్న అమ్మాయి కోసం వెతికే టైలర్ గా రాజేంద్రప్రసాద్ చేసిన చిలిపి చేష్టలు ఇప్పటికీ గిలిగింతలు పెట్టిస్తాయి. 1985లో సందడి చేసిన ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ వంశీ.

    Why this hottie isha out of Ladies Tailor

    సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. అయితే తండ్రి మచ్చకోసం వెతికినట్లు.. కొడుకు దేనికోసం వెతక బోతున్నాడన్నదే ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్.... మచ్చ కనుక్కునే ప్రయత్నంలో అమ్మాయిలకు స్పెషల్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు లేడీస్ టైలర్. ఇప్పటి కాలంలో అది వర్కౌట్ కాదు... ఎందుకంటే ఇప్పుడున్న హీరోయిన్లతో పాటు జనాలు కూడా మినీ స్కర్ట్ లు, స్లీవ్ లెస్ లు వేసుకుంటారు... సో ఈ లేటెస్ట్ మూవీలో ఫ్యాషన్ డిజైనర్ ప్యాషన్ ఏమై ఉంటుందనే టాపిక్ ఇప్పుడు సినీజనాల మధ్య చర్చ... మచ్చ పేరు చెప్పి నలుగురితో కొంటె వేషాలు వేశాడు లేడీస్ టైలర్... ఇప్పుడు సీక్వెల్ లో ముగ్గురు ముద్దుగుమ్మలు ఉంటారట... కథాపరంగా ఈ సినిమాలో అనీషా అంబ్రోస్ .. మానస .. ఈషా అనే ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమాలో నుంచి ఈషా తప్పుకుందట. ఆమె స్థానంలో మనాలి రాథోడ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగును పూర్తిచేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఆలోచనలో వంశీ వున్నాడు. ఈ సీక్వెల్ ద్వారా ఆయన ఆశించిన ఫలితం దక్కుతుందేమో చూడాలి.

    ఈమధ్యనే ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు గడిచిన సందర్భంగా పాత సినిమాలో హీరోగా చేసిన నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వూలో మాట్లాడారు. "ఈ మూవీ విడుదలై 30 సంవత్సరాలు అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. దర్శకుడు వంశీకి, నాకు ఈ సినిమా 'డూ ఆర్ డై' గా మారింది. ఈ చిత్రం సక్సెస్ అయితేనే మేము ఉంటాము.. లేక పోతే మా పరిస్థితి అంతే. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఎంతో అలరించి, నవ్వులు పూయించి, కన్నీళ్లు తెప్పించి పంపిన అద్భుతమైన సినిమా ఇది. అయితే ఒక సినిమాను అవుట్ డోర్ లో చిత్రీకరించడమంటే ఎంత సరదాగా ఉంటుదనే విషయం ఈ సినిమా ద్వారా తెలిసింద"ని రాజేంద్రప్రసాద్ చెప్పారు.

    English summary
    From couple of days, discussions are being heard about heroine Esha's exit from the movie "Fashion Designer S/o Ladies Tailor". It's heard that Esha chose to quit the film as she didn't felt comfortable with director Vamsi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X