twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బయ్యర్లకు కాటమరాయుడు కష్టాలు.. కన్నీళ్లు.. నష్టం భారీగా.. లెక్క తేలేది మరో రెండు రోజుల్లో..

    జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం భారీ అంచనాలతో మార్చి 24న విడుదలైంది. తొలుత ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కానీ మూడో రోజుకల్లా ఆ టాక్ ప్రతికూలంగా మారడమే కాకుండా..

    By Rajababu
    |

    జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం భారీ అంచనాలతో మార్చి 24న విడుదలైంది. తొలుత ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కానీ మూడో రోజుకల్లా ఆ టాక్ ప్రతికూలంగా మారడమే కాకుండా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

    Katamarayudu

    ఈ చిత్రాన్ని భారీ రేటు (అనధికారికంగా రూ.85 కోట్లు) కు డిస్టిబ్యూటర్ల కు అమ్మినట్టు సమాచారం. అయితే పెట్టిన పెట్టుబడికి కనీసం బ్రేక్ ఈవెన్ స్థాయికి కూడా చేరుకోవడం కష్టంగా మారినట్టు సమాచారం.

    తొలి వారాంతంలో కలెక్షన్ల క్షీణత

    తొలి వారాంతంలో కలెక్షన్ల క్షీణత

    తొలి వారాంతం (శుక్రవారం నుంచి ఆదివారం) వరకు సుమారు రూ.54 కోట్లకు పైగా వచ్చినట్టు సమాచారం. ఆ తర్వాత కలెక్షన్లు భారీ క్షీణించడంతో డిస్టిబ్యూటర్లు ఆందోళన పడ్డారు. గతంలో విడుదలైన పవర్ స్టార్ చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్ కూడా ఇలాంటి చేదు అనుభవాన్ని రుచిచూపించిందనే జగమెరిగిన సత్యం.

    కాటమరాయుడు సాధించిన ప్రాంతాల వారీగా షేర్ వివరాలు

    కాటమరాయుడు సాధించిన ప్రాంతాల వారీగా షేర్ వివరాలు

    తొలి వారాంతంలో..

    నైజాం రూ. 12.5 కోట్లు
    సీడెడ్ రూ. 7.15 కోట్లు
    నెల్లూరు రూ.1.9 కోట్లు
    గుంటూరు రూ.4.5 కోట్లు
    కృష్ణా రూ. 3.3 కోట్లు
    పశ్చిమ గోదావరి రూ.3.9 కోట్లు
    తూర్పు గోదావరి రూ.4.9 కోట్లు
    ఉత్తరాంధ్ర రూ.4.9 కోట్లు

    రాష్ట్రాలు, ఓవర్సీస్ వారీగా..

    రాష్ట్రాలు, ఓవర్సీస్ వారీగా..

    ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం షేర్ రూ.43 కోట్లు

    కర్నాటక రూ.4.8 కోట్లు
    ఇతర రాష్ట్రాల్లో రూ.1.2 కోట్లు
    అమెరికా రూ.3.8 కోట్లు
    ఇతర దేశాల్లో రూ.1.2 కోట్లు

    ఫస్ట్ వీక్‌లో రూ.54 కోట్లు

    ఫస్ట్ వీక్‌లో రూ.54 కోట్లు

    తొలి వారాంతంలో ఈ సినిమా సాధించిన కలెక్షన్లు సుమారు రూ. 54.04 కోట్లు. ఈ పరిస్థితుల్లో పెట్టిన పూర్తి పెట్టుబడి పూర్తిగా తిరిగి రావాలంటే ఇంకా రూ.30 కోట్లు రావాల్సి ఉంటుందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాటమరాయుడు సినిమాతో బయ్యర్లకు ఏ మేరకు నష్టం వాటిల్లిందనే విషయం రెండో వారం పూర్తయితే కానీ లెక్క తేలదు.

    నైజాం బయర్లకు చుక్కలు

    నైజాం బయర్లకు చుక్కలు

    కాగా, కాటమరాయుడు చిత్రం నైజాంలో పంపిణి చేసిన డిస్టిబ్యూటర్‌కు భారీ నష్టాలను మిగిల్చినట్టు తెలుస్తున్నది. అలాగే మిగితా ప్రాంతాల్లో కూడా పంపిణీదారులకు ఇదే పరిస్థితి ఉన్నట్టు సమాచారం. అయితే ఈ సారైన కాటమరాయుడు చిత్ర డిస్టిబ్యూటర్లకు పవన్ అండగా నిలుస్తాడా అనే విషయంపై చర్చ జరుగుతున్నది.

    మానవత్వానికి పవన్ నిలువెత్తు..

    మానవత్వానికి పవన్ నిలువెత్తు..

    పవన్ కళ్యాణ్ మానవత్వానికి నిలివెత్తు ప్రతిరూపం అంటూ కాటమరాయుడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవర్ స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. తన ఎదుట ఎవరైనా కష్ట పడుతుంటే చూడలేరని, అందినంత సాయం చేస్తూ ఎంతో ఉదారతను ప్రదర్శిస్తుంటారని పేర్కొన్నారు.

    సర్దార్ గబ్బర్ సింగ్ బయ్యర్ నిరాహార దీక్ష

    సర్దార్ గబ్బర్ సింగ్ బయ్యర్ నిరాహార దీక్ష

    అయితే ఇందుకు విరుద్దంగా కాటమరాయుడు చిత్రం రిలీజ్ సందర్భంగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో రెండు కోట్ల వరకు నష్టపోయానని డిస్టిబ్యూటర్ నిరాహార దీక్షకు కూర్చోవడం చర్చనీయాంశమైంది.
    ఆయన ‘సర్దార్' నిర్మాత మీద, పవన్ మేనేజర్ మీద ఆరోపణలు గుప్పించడం వివాదాస్పదమైంది.

    గళం విప్పనున్న బయ్యర్లు.

    గళం విప్పనున్న బయ్యర్లు.

    తనకు అన్యాయం జరిగిందని తనను పవన్ కల్యాణ్ ఆదుకోవాలని వేడుకొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈయనకు తోడుగా మరికొంత మంది ‘సర్దార్' బాధితులు కూడా గళం విప్పడానికి సిద్దమవుతున్నట్టు సమాచారం. తన సినిమాలు ఫ్లాప్ అయినప్పడు సూపర్ స్టార్ రజనీకాంత్ డిస్టిబ్యూటర్లను ఆదుకొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గానీ, ఆ నిర్మాత గానీ నోరు విప్పక పోవడం ఆశ్చర్యం కలిగించే అంశం.

    కలిసికట్టుగా బయ్యర్లు

    కలిసికట్టుగా బయ్యర్లు

    ప్రస్తుతం కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ డిస్టిబ్యూటర్లు కలిసి ఈ విషయంపై చర్చించేందుకు సిద్ధమవుతున్నారట. అయితే డిస్టిబ్యూటర్ల వ్యవహారంపై సినీ పరిశ్రమకు చెందిన కొందరు మరో విధంగా స్పందిస్తున్నారు.

    లాభాల్లో వాటా ఇస్తారా

    లాభాల్లో వాటా ఇస్తారా

    ఒకవేళ ఊహించని లాభాలు వస్తే పవన్ కల్యాణ్‌కు లాభాల్లో వాటా ఇస్తారా. వ్యాపారం అన్నప్పుడు లాభనష్టాలు ఉంటాయి. నష్టం వస్తే మీద పడితే సరికాదు అని పవన్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే డిస్టిబ్యూటర్ల వివాదం మాత్రం పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారే అవకాశం ఉంటుందంటున్నారు.

    English summary
    Pawan Kalyan's Latest movie Katamarayudu has posted All Time 5th highest 1st week share. But it will not be enough to save this sinking ship of Katamarayudu. Because of the High prices the rights were sold for this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X