twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంగోపాల్ వర్మకు కష్టకాలం? సర్కార్3 విడుదలవుతుందా!

    బాల్ థాకరే కథను పోలిన సర్కార్‌3 చిత్రంపై ఉద్దవ్ థాకరే, రాజ్ థాకరేలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది.

    By Rajababu
    |

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ బాహాటంగా చెప్పకపోయినా ఆయన తెరకెక్కిస్తున్న సర్కార్3 చిత్రం శివసేన అధినేత, దివంగత బాల్ థాకరే కథే అనేది స్పష్టమైన విషయం. సాధారణంగానే వివాదాస్పద చిత్రాలు శివసేన పార్టీ అనుమతి లేకుండా పరిశ్రమ గడప దాటి విడుదలయ్యే అవకాశాలు తక్కువే. బాల్ థాకరే కథను పోలిన సర్కార్‌3 చిత్రంపై ఉద్దవ్ థాకరే, రాజ్ థాకరేలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తున్నది. వారు ఇచ్చే నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) తోనే సర్కార్ వెండితెర మీద ఆడాల్సిందే.

     బయోపిక్‌లకు ఎన్వోసీ తేవాల్సిందే

    బయోపిక్‌లకు ఎన్వోసీ తేవాల్సిందే

    ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (సీబీఎఫ్సీ) చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ చెప్పిన ప్రకారం.. గోడమీద వ్యవహారంలా ఉండి సినిమాలు తీసేవారిని అనుమతించం, ముఖ్యంగా జీవిత నేపథ్యం ఉన్న చిత్రాలకు గానీ, ప్రముఖ జీవితాలకు సంబంధించిన కల్పిత కథలకు వారి కుటుంబ సభ్యుల ఎన్వోసి తప్పనిసరి అని వెల్లడించారు.

    వివాదాస్పదమైన రయీస్, రంగూన్

    వివాదాస్పదమైన రయీస్, రంగూన్

    ఇదే అంశంపై రయీస్, రంగూన్ చిత్రాలు వివాదాస్పదమయ్యాయి. రయీస్ చిత్రం గుజరాత్ మాఫియా డాన్ అబ్దుల్ లతీఫ్ కథ ఆధారంగా, రంగూన్ చిత్ర కథ ఫియర్‌లెస్ నాడియా ఆధారంగా తెరకెక్కినట్టు వార్తలు వచ్చాయి. వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఎన్వోసీని తప్పనిసరి చేసింది.

     ట్రైలర్లకు కూడా ఎన్వోసీ తప్పనిసరి

    ట్రైలర్లకు కూడా ఎన్వోసీ తప్పనిసరి

    గతంతో పోల్చితే చిత్రాల ప్రమోషన్ కేవలం థియేటర్లు, టెలివిజన్లకే పరిమితం కాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియానే సినిమాల ప్రమోషన్‌కు ప్రధానంగా మారింది. సోషల్ మీడియాలో విడుదలైన జాలీ ఎల్ఎల్బీ2 చిత్ర ట్రైలర్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ చిత్ర కథ కొందరి జీవితాలతో సంబంధం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సర్కార్ 3 ట్రైలర్‌కు కూడా ఎన్వోసీ కావాల్సిందే.

    సర్కార్ 3 చిత్రానికి ఇబ్బందులు తప్పవా?

    సర్కార్ 3 చిత్రానికి ఇబ్బందులు తప్పవా?

    ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సర్కార్3 చిత్రం బాల్ థాకరే జీవితానికి సంబంధముందా? ఒకవేళ ఉంటే థాకరే కుటుంబ సభ్యుల నుంచి ఎన్వోసీ తీసుకురావాల్సిందే అనే ప్రశ్నను నిహ్లానీ లేవనెత్తారు. ఒకవేళ ఈ చిత్ర కథతో బాల్ థాకరేకు సంబంధముంటే తప్పనిసరి ఎన్వోసీ తెవాల్సిందే. ఒకవేళ అదే నిజమైతే థాకరే కుటుంబ సభ్యులు ఎన్వోసీ ఇస్తారా? ఇవ్వకుంటే వర్మ పరిస్థితి ఏమిటీ? సర్కార్3 విడుదల అవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

    English summary
    Is Sarkaar 3 based on the life of Bal Thackeray? If it is, then please get an NOC from his family. Ram Gopal Varma, Sarkaar 3, NOC trailer will now release with a disclaimer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X