»   » జూ.ఎన్టీఆర్,రాజమౌళి గెస్ట్ లుగా..ఆడియో లాంచ్ (ఫొటోలు)

జూ.ఎన్టీఆర్,రాజమౌళి గెస్ట్ లుగా..ఆడియో లాంచ్ (ఫొటోలు)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాని హీరోగా శేఖర్ కమ్ముల శిష్యుడు నాగి దర్శకుడిగా పరిచయమవుతూ ‘ఎవడే సుబ్రహ్మణ్యం' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్‌పై నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంకదత్ నిర్మిస్తున్నారు. విలక్షణ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియోని నిన్న రాత్రి విడుదల చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
రథన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో కార్యక్రమంలో ఎన్టీఆర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, లక్ష్మీ మంచు, ఎస్.ఎస్ రాజమౌళి,మారుతి, క్రాంతి మాధవ్, హను రాఘవపూడి తదితరులు పాల్గొన్నారు.

స్లైడ్ షోలో ఆడియో విడుదల ఫొటోలు

ఆవిష్కరణ

ఆడియో సీడిలను యంయం కీరవాణి ఆవిష్కరించగా తొలి సీడిని రాజమౌళి అందుకున్నారు.

 

ఎన్టీఆర్ మాట్లాడుతూ...

నాని మంచి నటుడు. పిల్ల జమీందార్ చిత్రాన్ని చాలా సార్లు చూసాను. నా భార్యకు కూడా నచ్చిన సినిమా. స్వప్న సినిమాలో స్టూడెంట్ నెంబర్ వన్ చేసాం. ఎవడే సుబ్రమణ్యం ...స్టూడెంట్ నెంబర్ వన్ కంటే హిట్ కావాలి అన్నారు.

 

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ..

 

ఎంటైర్ టీమ్ కు ఆద్ ది బెస్ట్ అన్నారు.

 

కీరవాణి మాట్లాడుతూ...

ట్రైలర్ ఎక్సలెంట్ గా ఉంది. సినిమా కూడా డిఫరెంట్ గా ఉంటుందని నమ్ముతున్నాను. నానికి ఆల్ ది బెస్ట్. రధన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీమ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.

 

రాజమౌళి మాట్లాడుతూ...

 

నా మొదటి సినిమా స్వప్న సినిమా బ్యానర్ లోనే తెరకెక్కింది. అశ్వనీదత్ గారి కన్నా పెద్ద ప్రొడ్యూసర్ కావాలి. నేను నా వైఫ్ ట్రైలర్ చూసాం. సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నాం. రథన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

 

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...


ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. నాగ్ అశ్విన్ ..లీడర్ లో నా టీమ్ లో పనిచేసాడు. తను పనిచేసేటప్పుడే డైరక్టర్ అవుతాడనుకున్నాను. ఈ బ్యానర్ లో వచ్చిన బాణం సినిమాలా పెద్ద సక్సెస్ కావాలి . నాని నా ఫేవరెట్ యాక్టర్. తనకి ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్నారు.

విజయ్ మాట్లాడుతూ...

 

ఈ సినిమాలో నాకు అవకాసం రావటానికి కారణం నానియే. ఈ సినిమా నాలో కాన్ఫిడెంట్ ఇచ్చింది. ఈ అవకాసం ఇచ్చిన నిర్మాతలకు ధాంక్స్.

 

నాని మాట్లాడుతూ...

 

మా టీమ్ మెంబర్స్ మరిచిపోలేని సినిమా ఇది. ఆక్సిజన్ కూడా అందలేదు. సినిమాని పూర్తి చేయటానికి చాలా కష్టాలు పడ్డాం. అందరూ తప్పకుండా వెళ్లాల్సిన ప్లేస్ అది. సినిమాని అనుకున్న టైమ్ కు పూర్తి చేసాం. నిర్మాతల సహకారం మరువలేనిది. ధాంక్యూ.

 

క్రిష్ మాట్లాడుతూ...

 

మంచి ఫ్యాషన్ ఉన్న నిర్మాతలు, డైరక్టర్ చేసిన చిత్రం ఇది. సినిమా ఎప్పుడెప్పుడా అని రిలీజ్ కోసం చూస్తున్నాం అన్నారు.

 

లక్ష్మీ మంచు మాట్లాడుతూ...

 

స్వప్న నా హీరో. చాలా హార్డ్ వర్కర్. ఒక అమ్మాయి సినిమా తీయటం ఎంత కష్టమో నాకు తెలుసు. నాని వంటి హీరో ఉంటే నిర్మాతకు కష్టాలు ఉండవు. చాలా యంగ్ టీమ్ ఈ సినిమాకు పనిచేసింది. ఆల్ ది బెస్ట్ అన్నారు.

 

శర్వానంద్ మాట్లాడుతూ...

 

టీజర్ చూడగానే సినిమా చూడాలనిపించిన చిత్రం ఇది. నాని ..సుబ్రమణ్యంగా రాక్ చేస్తున్నారు. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.

 

డైరక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ...

 

మొదటి బేబి పుట్టిన ఫీలింగ్ కలుగుతోంది. స్వప్న, ప్రియాంకలు నా స్క్రిప్టుని నమ్మి సినిమా చేయటానికి ఒప్పుకున్నందుకు ధాంక్స్ అన్నారు.

 

హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ...

సినిమా బాగా వచ్చింది. డైరక్టర్ చాలా కష్టపడి చక్కగా తీసాడు. అందరికీ ధాంక్స్ అన్నారు.

 

స్వప్న మాట్లాడుతూ...

ఈ జర్నిని మర్చిపోలేం. మంచి స్క్రిప్టు కారణంగనే ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్నాను. నాని సహ నటీనటులు, టెక్నీషియన్స్ సహా ప్రతి ఒక్కరూ బాగ సపోప్ట్ చేశారు. అందరూ సపోర్ట్ చేసారు అన్నారు.

 

మారుతి మాట్లాడుతూ...

 

చిత్రం పెద్ద హిట్ కావాలని ఆకాక్షించారు.

 

ఈ కార్యక్రమంలో ...

 

కార్యక్రమంలో ఎన్టీఆర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, లక్ష్మీ మంచు, ఎస్.ఎస్ రాజమౌళి,మారుతి, క్రాంతి మాధవ్, హను రాఘవపూడి తదితరులు పాల్గొన్నారు.

 

అవసరం

 

చిత్రం హిట్ ఖచ్చితంగా నానికి అవసరం...వరస ఫ్లాపులతో ఉండటంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తిగా చూస్తున్నాడు.

 

అందరూ


అశ్వనీదత్ పిలవటంతో ఇండస్ట్రీలోని పెద్దలంతా తరలి వచ్చారు.

ఎమోషనల్ జర్నీ

 

ఈ చిత్రం కథ ఓ ఎమోషనల్ జర్ని అని చెప్తున్నారు.

 

హీరోయిన్ రితి వర్మ మాట్లాడుతూ....

 

నా ఫేవరెట్ హీరోలలో నాని ఒకరు. ఆయన సినిమాలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ సమయంలో నాని హెల్ప్ చేస్తున్నారు.

 

డబ్బున్న అమ్మాయిగా..

 

ఈ సినిమాలో నేను బాగా డబ్బులున్న అమ్మాయిగా నటిస్తున్నాను. తండ్రి అంటే చాలా ఇష్టం. అల్ట్రా మోడరన్ గర్ల్ గా కనిపిస్తాను. అని రితు వర్మ చెప్పింది.

 

ఇదే కథాంశం

 

తన జీవితం గురించి తెలుసుకోవడానికి ఓ కుర్రాడు మొదలు పెట్టె జర్నీలో తనకు ఎదురైన అనుభవాలు సమాహారమే కథాంశం.

 

ఇద్దరూ...

 

రితు వర్మ, మలయాళ భామ మాళవిక నాయర్ నాని సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

వీరిద్దరూ..

ఈ సినిమాకు రాకేశ్,.నవీన్ సినిమాటోగ్రాఫర్స్ గా పని చేస్తున్నారు.

 

English summary
The audio release of ‘Yevade Subramanyam’ starring Nani and Malavika Nair was launched yesterday in Hyderabad. Directors S.S Rajamouli , K.Raghavendra rao and Young tiger NTR were the chief guests present at the audio . M.M Keeravani launched the music album and handed the first copy to S.S Rajamouli .
Please Wait while comments are loading...