twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్, పవర్‌కు సింబల్.. ఇక తేజ్ సూపర్‌స్టార్.. అనసూయ కమర్షియల్

    డాన్ శ్రీను, బలుపు తర్వాత తన కెరీర్‌లో ఐదో చిత్రంగా విన్నర్‌ను రూపొందించాడు దర్శకుడు మలినేని గోపిచంద్. ఫిబ్రవరి 24న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

    By Rajababu
    |

    యాక్షన్‌తోపాటు కామెడీని దట్టించి సినిమాలో తీయడంలో దర్శకుడు మలినేని గోపిచంద్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. డాన్ శ్రీను, బలుపు, పండుగ చేస్కో చిత్రాలు అందుకు రుజువుగా నిలిచాయి. ప్రేక్షకులను మెప్పించాయి. తన కెరీర్‌లో ఐదో చిత్రం విన్నర్‌తో ఫిబ్రవరి 24న మరోసారి సక్సెస్‌ను చేజిక్కించుకొనేందుకు మలినేని గోపిచంద్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూలో ముఖ్య అంశాలు మీకోసం..

    కొత్త బ్యాక్‌డ్రాప్‌తో విన్నర్

    కొత్త బ్యాక్‌డ్రాప్‌తో విన్నర్

    కొత్త బ్యాక్ డ్రాప్‌తో హార్స్ రేసింగ్ నేపథ్యంగా రూపొందించిన విన్నర్ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా మంచి కమర్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ.

    హార్ట్ టచింగ్‌గా జగపతిబాబు, తేజు సీన్లు

    హార్ట్ టచింగ్‌గా జగపతిబాబు, తేజు సీన్లు

    జగపతిబాబు, సాయి ధరమ్ తేజ్ మధ్య వచ్చే సీన్లు చాలా హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. జగపతిబాబుతో ఉండే సీన్లలో తేజు బాగా నటించాడు. మంచి యాక్షన్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఊహించనంతగా ఎమోషన్ ఉంటుంది.

    ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఉన్న హీరో తేజ్

    ఎనర్జీ, కామెడీ టైమింగ్ ఉన్న హీరో తేజ్

    మంచి ఎనర్జీ ఉన్న హీరో తేజు. కామెడీ టైమింగ్ బాగా ఉంటుంది. తేజు డ్యాన్స్‌లు బాగా చేస్తాడు. కాబట్టి మంచి మాస్ సాంగ్స్ ఉన్నాయి. పాటలతోపాటు తేజులో ఎమోషనల్ యాంగిల్ కూడా ఈ చిత్రంలో చూడవచ్చు. తేజు టోటల్ కొత్తగా కనిపిస్తాడు. లుక్స్, డైలాగ్ డెలివరీ బాగా ఉంటుంది.

    క్లైమాక్స్‌లో యాక్షన్ సీన్లు అదుర్స్

    క్లైమాక్స్‌లో యాక్షన్ సీన్లు అదుర్స్

    యాక్షన్ సీన్లు కథలో భాగంగా వస్తుంటాయి. క్లైమాక్స్‌లో చివరి పదిహేను, ఇరువై నిమిషాల్లో హార్స్ రేసింగ్ సీన్లను హాలీవుడ్ స్టంట్ మాస్టర్, బల్గేరియా యాక్షన్ మాస్టర్ డిజైన్ చేశాడు. క్లైమాక్స్ సీన్లు టర్కీలోని ఇస్తాంబుల్‌లో షూట్ చేశాం. ఈ సీన్లు తెరమీద ఎక్సార్డినరీగా ఉంటాయి. గుర్రాల చేజింగ్ బాగా వర్కవుట్ అయింది.

    విన్నర్ కోసం హాలీవుడ్ గుర్రాలు

    విన్నర్ కోసం హాలీవుడ్ గుర్రాలు

    ఫైట్ మాస్టర్ తేజుకు ఎక్కడ దెబ్బ తగలకుండా చాలా జాగ్రత్త తీసుకొన్నాడు. ఈ సినిమా కోసం ఉపయోగించిన గుర్రాలు హాలీవుడ్ చిత్రాలకు వాడుకొన్నారు. టర్కీ గుర్రాలంటే మంచి ఫేమస్. అలాంటి వాటిని వాడుకొని తెరమీద అవుట్ పుట్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. రిస్క్ తీసుకొన్నాం. ఇవన్నీ సినిమాకు హైలెట్.

    రకుల్‌తో పనిచేయడం చాలా సౌకర్యం

    రకుల్‌తో పనిచేయడం చాలా సౌకర్యం

    రకుల్‌తో పనిచేయడం ఇది రెండోసారి. పండుగ చేస్కో చిత్రంలో తొలిసారి ఆమెతో పనిచేశాను. రకుల్‌తో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. గతంలో నేను అనుష్కతో పనిచేశాను. ఆమె చూపే డెడికేషన్ రకుల్ కనిపించింది. తేజుతో రకుల్ నటించడం ఇది తొలిసారి. రకుల్‌తో ఎలాంటి కంప్లయింట్స్ ఉండవు. ఆమెతో పనిచేసినప్పుడల్లా ఎన్నిసార్లైనా పనిచేయవచ్చు అనిపిస్తుంటుంది.

    రకుల్ ప్రీత్ తెలుగులో డైలాగ్స్ రాసే..

    రకుల్ ప్రీత్ తెలుగులో డైలాగ్స్ రాసే..

    పండగు చేస్కో చేస్తున్నప్పుడు చూసిన రకుల్‌కు ఇప్పటి రకుల్‌కు చాలా తేడా ఉంది. తెలుగు బాగా నేర్చుకొన్నది. మనకంటే మంచిగా తెలుగు మాట్లాడుతుంది. మనం కూడా ఉపయోగించని తెలుగు పదాలను రకుల్ ఉపయోగించడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. కొన్ని రోజుల్లో రకుల్ మనకంటే తెలుగు బాగా మాట్లాడుతుంది. కొద్ది రోజుల్లో రకుల్ సినిమాకు మాటలు కూడా రాసేస్తుందా అనే అనుమానం వస్తుంది. డైలాగ్ చెప్పేటప్పుడు ఇక్కడ పాజ్ ఇవ్వాలా అని అడుగుతుంటుంది. అది కేవలం తెలుగు మీద గ్రిప్ ఉండే వాళ్లకే తెలుస్తుంటుంది. అలాంటి డెడికేషన్ ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

    విన్నర్‌లో అథ్లెట్‌గా రకుల్ ప్రీత్

    విన్నర్‌లో అథ్లెట్‌గా రకుల్ ప్రీత్

    విన్నర్‌లో చిత్రంలో రకుల్ అథ్లెట్ పాత్రను పోషించింది. ఈ చిత్రంలో ఆమెకు ఓ గోల్ ఉంటుంది. ఎప్పటికైనా మెడల్ సాధించాలనే లక్ష్యం ఉంటుంది. సాధారణంగా రకుల్‌కు ఫిటినెస్ బాగుంటుంది. ఆ ఫిటినెస్ పాత్రకు ఉపయోగపడింది.

    పోటాపోటీగా జగపతిబాబు, తేజు

    పోటాపోటీగా జగపతిబాబు, తేజు

    జగపతి బాబు హీరోకు తండ్రిగా నటించారు. ఈ చిత్రం తండ్రి, కొడుకుల మధ్య నడిచే సీన్లు బాగుంటాయి. అసలు ఈ సినిమాలో హీరోకు గుర్రాల రేసులంటే అసలే పడవు. అలాంటి వ్యక్తి హార్స్ రేసింగ్ ఎందుకు చేశాడు. తండ్రి కోసం చేశాడా? ప్రేమ కోసం చేశాడా అనేదే ఈ సినిమా.

    ప్రత్యేకంగా తేజు హార్స్ రైడింగ్

    ప్రత్యేకంగా తేజు హార్స్ రైడింగ్

    ఈ సినిమా కోసం తేజు హార్స్ రైడింగ్ నేర్చుకొన్నాడు. హీరో అవ్వడానికి ముందే హర్స్ రైడింగ్ నేర్చుకోవడం జరిగింది. ఈ సినిమాలో ఉపయోగించిన గుర్రానికి 20 ఏండ్ల నుంచి హాలీవుడ్ సినిమాల్లో నటించిన అనుభవం ఉంది. అది యాక్షన్ చెప్పగానే పరిగెత్తేది. కట్ చెప్పగానే గుర్రం ఆగిపోయేది. క్లైమాక్స్‌లో పది గుర్రాలు, పదిమంది జాకీలు ఉంటారు. జాకీల్లో హీరో తేజు ఒకరు. క్లైమాక్స్ సీన్ చాలా ఉత్కంఠగా ఉంటాయి.

    పవన్, పవర్‌కు సింబల్ ఆ టవల్

    పవన్, పవర్‌కు సింబల్ ఆ టవల్

    పవన్ కల్యాణ్ గబ్బర్‌సింగ్‌లో ఉపయోగించిన ఎర్ర టవల్‌ను ఉపయోగించడంపై మలినేని చెబుతూ.. అది పవర్‌కు సింబల్. హీరో పవర్‌ను చెప్పడం కోసమే ఉపయోగించాం. హీరో ఇంట్రడక్షన్ సీన్ కోసం ఎర్ర టవల్‌ను ఉపయోగించాం. చాలా ఇంపార్టెంట్ సీన్ అంది.

    విజయ్ మాల్యా ఫామ్‌లో షూటింగ్

    విజయ్ మాల్యా ఫామ్‌లో షూటింగ్

    కొన్ని సీన్లను బెంగళూరులో కూడా షూట్ చేశాం. బెంగళూరులో విజయ్ మాల్యాకు చెందిన 700 ఎకరాల్లో ఉన్న స్టడ్ ఫామ్‌లో యాక్షన్ సీన్లను షూట్ చేశాం. ఈ సినిమాకు చోటా కే నాయుడు చాలా హెల్ప్ అయ్యాడు. మంచి టెక్నిషియన్స్‌ పనిచేశారు.

    ఉక్రెయిన్‌లో షూట్ చేసిన తొలిచిత్రం విన్నర్

    ఉక్రెయిన్‌లో షూట్ చేసిన తొలిచిత్రం విన్నర్

    ఈ సినిమాలోని కొంత భాగం ఉక్రెయిన్‌లో షూట్ చేశాం. ఉక్రెయిన్‌లో షూట్ చేసిన తొలిచిత్రం విన్నర్. నిర్మాతలు టాగూర్ మధు, బుజ్జి ఖర్చుకు వెనుకాడకుండా చిత్రాన్ని తీశారు. వారు నాపై పెట్టిన నమ్మకం విన్నర్ సక్సెస్‌తో రుజువు అవుతుంది.

    అనసూయ కమర్షియల్ యాంగిల్

    అనసూయ కమర్షియల్ యాంగిల్

    అనసూయతో ఐటెం సాంగ్ ఈ చిత్రంలో కమర్షియల్ యాంగిల్ కోసం ఉపయోగించుకొన్నాం. హీరో ఇంట్రడక్షన్ సీన్ తర్వాత ఓ కమర్షియల్ పాట అవసరమైంది. దాంతో అనసూయను సంప్రదించాం. అనసూయకు ఒంగోలు ఆ ప్రాంతంలో చాలా మంది ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తొలుత ఆమె అంగీకరించలేదు. పాట ట్రాక్‌ను పంపిన తర్వాత ఆమె విని ఒకే చెప్పారు.

    సుమతో పాడించే ఐడియా తమన్‌దే

    సుమతో పాడించే ఐడియా తమన్‌దే

    ఇక మరో యాంకర్ సుమతో పాట పాడించడం సంగీత దర్శకుడు తమన్ ఐడియా. ఓ ఆడియో ఫంక్షన్‌లో సుమ పాడిన పాటను విన్న తమన్ ఆమెకు అవకాశమిచ్చారు. అనసూయ డ్యాన్స్‌కు సుమ పాట పాడటం మంచి హైప్ ఇచ్చింది. ఇద్దరు టాప్ యాంకర్లను అలా వినియోగించుకోవడం ఈ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత.

    సింగం సుజాతగా పృథ్వీ..

    సింగం సుజాతగా పృథ్వీ..

    హాస్య నటుడు పృథ్వి ఈ చిత్రంలో సింగం సుజాత రోల్ చేశాడు. చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. హీరోకు, పృథ్వీకి మధ్య సిన్లు చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. ఆలీ చిత్రంలో స్టంట్ మాస్టర్‌ రోల్ పోషించాడు. ఆ పాత్ర పేరు పీటర్ హెయిన్స్. గుర్రాల మీద మంచి కమాండ్ ఉన్న స్టంట్ మాస్టర్‌గా కనిపిస్తాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌ను వెన్నెల కిషోర్ చేశాడు.

    కథ, హీరోపై నమ్మకంతోనే భారీ బడ్జెట్

    కథ, హీరోపై నమ్మకంతోనే భారీ బడ్జెట్

    కథపై ఉన్న నమ్మకం, హీరోపై ఉన్న భరోసాతోనే భారీగా ఖర్చు చేశాం. సినిమాకు ముందే అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాను. ఓ ఆడియెన్‌గా నేను సంతృప్తి చెంది.. మినిమమ్ గ్యారంటీ అని అనుకున్న తర్వాతనే షూటింగ్ ప్రారంభించాం. ఈ కథను హీరో, నిర్మాతలు, అందరూ నమ్మారు. ఆ నమ్మకంతోనే ఈ చిత్రం తెరపైకి వెళ్లింది.

    వెలిగొండ చెప్పిన లైన్..

    వెలిగొండ చెప్పిన లైన్..

    సాయి ధరమ్ తేజ్‌‌తో సినిమా చేయాలనుకుంటున్న సమయంలో రచయిత వెలిగొండ శ్రీనివాస్ లైన్ చెప్పాడు. ఆ లైన్ టాగూర్ మధు, తేజు, చోటాకు బాగా నచ్చింది. బ్యాక్ డ్రాప్ బాగుండటంతో ముందుకెళ్లాం.

    రీమేక్ చాలా రిస్క్.. స్ట్రెయిట్..

    రీమేక్ చాలా రిస్క్.. స్ట్రెయిట్..

    ఓ సినిమాను రీమేక్ చేయడం చాలా రిస్క్. నా అనుభవం ప్రకారం రీమేక్ చేస్తే పరిమితికి లోబడి సినిమా చేయాల్సి ఉంటుంది. అదే స్ట్రయిట్ సినిమా చేస్తే మనకు సంపూర్ణంగా స్వేచ్ఛగా ఉంటుంది. డాన్ శ్రీను, బలుపు, విన్నర్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. బాడీగార్డ్ చేసినప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. ఆ కథ లవ్‌స్టోరీ కావడం వల్ల దానిని మెరుగుపరిచే అవకాశం దక్కలేదు. లిమిట్స్‌లోనే పనిచేయాల్సి వచ్చింది.

    రాంగోపాల్ వర్మ, శివ వల్లనే ఇండస్ట్రీకి

    రాంగోపాల్ వర్మ, శివ వల్లనే ఇండస్ట్రీకి

    ఇవివి సత్యనారాయణ, జంధ్యాల సినిమాలంటే చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో వారి సినిమాలు బాగా చూశాను. రాంగోపాల్ వర్మ అంటే కూడా ఇష్టం. శివ తర్వాత ఇండస్ట్రీకి రావాలని డిసైడ్ అయ్యాను. కమర్షియల్‌గా రాఘవేంద్రరావు గారు బాగా ఇష్టం. ఇప్పుడున్న డైరెక్టర్లలో వినాయక్, రాజమౌళి అంటే కూడా ఇష్టం.

    ఈ సినిమా తర్వాత నేను కూడా విన్నర్‌నే

    ఈ సినిమా తర్వాత నేను కూడా విన్నర్‌నే

    ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమా చేయడం నా పద్ధతి కాదు. ఒక సినిమా పూర్తయిన తర్వాతనే మరోదానిపై దృష్టిపెడుతాను. సినిమాకు సినిమాకు మధ్య గ్యాప్ అవ్వడం ఏమీ మిస్ కావడం లేదు. విన్నర్ సినిమా తర్వాత పెద్ద డైరెక్టర్‌ను కావడం తథ్యం. ఈ సినిమాతో విన్నర్‌గా మారుతాను.

    English summary
    Tollywood Director Malineni Gopichand latest Movie is Winner. Mega Hero Sai Dharam Tej, Rakul Preet Singh, Jagapati Babu played lead roles. This movie ready to release on Mahashiva Ratri (February 24). In this Occassion he speaks to us specially..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X