» 

సినిమా టికెట్ల కోసం ..యువకుడి దారుణ హత్య

Posted by:

ముంబై: లాల్‌బాగ్‌ పరిసరాల్లో గల భారత్‌మాత థియేటర్‌ ఎదుట ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం 'బాలక్‌ - పాలక్‌' అనే మరాఠీ చిత్రానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేషస్పందన లభిస్తోంది. ఇందులో భాగంగానే మకర సంక్రాంతి సోమవారం సెలవు కావడంతో భారత్‌ మాతా థియేటర్‌కు జనం పెద్దఎత్తున తరలివచ్చారు.

ఇదే సమయంలో అజయ్‌ ఖామ్‌కర్‌ (19) అనే యువకుడు సినిమా టిక్కెట్‌ కోసం క్యూలో నిల్చొని ఉండగా అశోక్‌ చవాన్‌(55) అనే వ్యక్తితో వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైనచవాన్‌ పక్కనే కొబ్బరి బొండాలు విక్రయిస్తున్న వ్యక్తి వద్ద కత్తి లాక్కొని అజయ్‌ను పొడిచాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా వెంటనే సమీపంలోని కె.ఇ.ఎం. ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.

హత్య అనంతరం పారిపోతున్న నిందితుడు చవాన్‌ను అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచినట్లు బోయివాడ పోలీసుస్టేషన్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. మృతుడు అజయ్‌ ఖామ్‌కర్‌ వాయ్‌ తాలూకాలోని చాందక్‌ గ్రామానికి చెందినవాడు. ఫోర్ట్‌లోని ఐడీబీఐ బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు.

మరాఠిలో రూపొందిన 'బాలక్ పాలక్'చిత్రం అశ్లీల సాహిత్యం/వెబ్‌సైట్స్ వల్ల పెడత్రోవ పట్టే టీనేజ్ పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తోంది. 'బాలక్ పాలక్' (బిపి) (ఇంకో అర్థంలో బ్లూపిక్చర్) విడుదలైన వెంటనే మీడియా నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు పొందుతోంది. టీనేజ్ పిల్లల 'తప్పనిసరి కుతూహలాన్ని' తల్లిదండ్రులు సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏమవుతుందో చెప్పే ఈ సినిమాను పిల్లలకు దగ్గరుండి చూపించాలని రికమండేషన్స్ వస్తున్నాయి. రవి జాదవ్ దర్శకుడు. నటుడు రితేష్ దేశ్‌ముఖ్ నిర్మాతగా మారి సామాజిక బాధ్యతగా ఈ సినిమా తీశానంటున్నాడు.

Read more about: genelia, ritesh deshmukh, orange, mumbai, జెనీలియా, రితీష్ దేశముఖ్, ఆరెంజ్, ముంబై, మర్డర్
English summary
A fight over breaking a line to get movie tickets at Bharatmata theatre in Parel lead to the death of a 19-year-old yesterday afternoon. According to the police, Ajay Madhukar Khamkar (19), a resident of Hareshwar building, opposite N M Joshi police station, had gone to Bharatmata Cinema with his cousin Tushar Khamkar (23) to watch the 3 pm show of Marathi film Balak Palak.
Please Wait while comments are loading...