twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గమ్యం లేని కామిడీ ('నువ్వా.. నేనా' రివ్యూ)

    By Srikanya
    |

    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్: ఎస్.వి.కె.సినిమా
    చిత్రం: నువ్వా నేనా
    నటీనటులు: అల్లరి నరేష్, శర్వానంద్, శ్రియ, విమలా రామన్ తదితరులు
    కథ: సూర్య
    సంగీతం: బీమ్స్
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నారాయణ
    సమర్పణ: సి.హెచ్.ఎమ్.కొండయ్య
    నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్
    విడుదల తేదీ: 16 మార్చి 2012

    అల్లరి నరేష్, శర్వానంద్ కాంబినేషన్ లో గతంలో గమ్యం చిత్రం వచ్చి హిట్టైంది కదా. ఇప్పుడు అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ శ్రియ ని పెట్టి కామిడీ చేస్తే అదిరిపోతుంది కదా. అదీ బాలీవుడ్ లో హిట్టైన దీవానా మస్తానా ని ప్రీమేక్ చేస్తే...సేఫ్ కదా...ఇంతటి అద్బుతమైన ఆలోచన వచ్చినందకు మన భుజాలను మనమే తట్టుకోవాలనిపిస్తుంది కదా. సరిగ్గా అలాంటి ఓ ఫెంటాస్టిక్ ఆలోచనతోనే మొదలైన ఈ సినిమా ఒరిజనల్ లోని సీన్స్ లను అయితే ఎత్తగలిగింది కానీ అందులోని మ్యాజిక్ ని రిపీట్ చెయ్యలేకపోయింది. పెద్ద హీరోలు సైతం కామెడీలోకి దిగిపోయిన నేపధ్యంలో అల్లరి నరేష్ తన సినిమా కథలను మరింత జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

    చిల్లర దొంగ అవినాష్(అల్లరి నరేష్)ఓ పెద్ద దొంగతనం చేసి తింగరి పోలీసులకు మస్కా కొట్టి హైదరాబాద్ (ఇక్కడ దొంగలకు సేప్టీ ప్లేస్ అన్నట్లు)వచ్చేస్తాడు. సిటీలోకి అడుగు పెట్టగానే అక్కడ అతనికి యాజ్ యూజవల్ గా డా.నందిని(శ్రియ)కనిపిస్తుంది. కనిపించిందే తడువుగా ఆలస్యమెందుకున్నట్లు పాటేసుకుని అక్కడనుంచి ఆమె హాస్పటిల్ కి వెళ్లి మరీ లైన్ వేస్తూంటాడు. అతను అంత పట్టుదలగా తిరుగుతున్నా సైక్రాటిస్టు అయిన ఆమె మన హీరో ఎందుకు వచ్చాడా అన్నది పట్టించుకున్నట్లు కనపడదు. ఈలోగా ఆమె హాస్పటిల్ కి ఆనంద్(శర్వానంద్)అనే భయం ఫోబియో తో బాధపడే పేషెంట్ వస్తాడు. ఆమె ఇచ్చిన కౌగిలి ట్రీట్ మెంట్ తో అతను రోగం కుదిరి...కొత్త రోగం(ప్రేమ)మొదలవుతుంది. దాంతో ఆనందే...అవినాష్ ప్రేమకు అడ్డు వస్తాడు. ఇద్దరూ ఆమె కోసం కాట్ల కుక్కల్లా కొట్టుకుంటారు..చివరకు చంపుకునే స్ధితి దాకా వస్తారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి నందిని దక్కింది అనేది తెలియాలంటే సినిమా చివరదాకా చూడాల్సిందే.

    జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, ప్రభుదేవా,నమిత కాంబినేషన్ లో వచ్చిన ఒక రాధా ఇద్దరు కృష్ణులు తరహాలో జరిగే ఈ కథలో కధనమే ప్రధాన లోపమై సినిమాకు శాపంగా మారింది. ఒకే రకమైన సీన్స్ కంటిన్యూగా రిపీట్ అవుతూ సహనానికి పరీక్ష పెడుతూంటాయి. ఎంతసేపూ శ్రియ చుట్టూ హీరోలిద్దరూ తిరుగుతూ ఒకరికొకరు నువ్వా..నేనా అన్నట్లు పోటీ పడే వారినే చూపిస్తారు కానీ..అస్సలు ఆమె మనస్సులో ఏముందో చూపెట్టే ప్రయత్నం చేయరు. అలా కాకుండా ఆమె మనస్సులో అస్సలు ఎవరున్నారో చెప్తే...కథ మరో మలుపు తిరిగేది. ముఖ్యంగా ఇద్దరు హీరోల ప్రేమలో ఎవ్వరికీ సీరియస్ నెస్ కనపడకపోవటంతో అంత సీరియస్ గా ఇద్దరూ పోటీ పడటం మెప్పించదు.ి ఇక అల్లరి నరేష్ సీన్స్ అక్కడక్కడా తప్ప నవ్వించలేకపోయాయి. దాంతో అల్లరి నరేష్ నుంచి కామెడి ఎక్సపెక్ట్ చేసిన వారికి నిరాశే. ఇక శర్వానంద్ చేసేది సీరియస్ నటనో..కామెడీనో తెలియనంత కామీడీ తెరపైన జరుగతూంటుంది. అలాగే శ్రియ ..వయస్సు అయిపోయినట్లు కనపిస్తుంది. ఆమె కోసం ఇద్దరు యువకులు చంపుకునే స్ధితికి వెళ్లారంటే నమ్మబుద్ది కాదు.

    ఇక బ్రహ్మానందం చేసిన ఆకుదాదా పాత్ర ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసిందే కాబట్టి పొరపాటున కూడా నవ్వబుద్ది కాదు. బ్రహ్మానందాన్ని ప్రేమించే యువతిగా కోవై సరళ తన ట్రేడ్ మార్క్ నటనను ప్రదర్శిస్తుంది. అలీ నే ఉన్నంతలో తన సొంత డైలాగు మాడ్యులేషన్ తో నవ్విస్తాడు. మిగతా డిపార్టమెంట్ లలో డైలాగులు ఓకే అనిపిస్తాయి. కెమెరా చాలా చోట్ల ఇబ్బంది పెడుతుంది. ఎడిటింగ్ ఇంకా షార్ట్ గా చేస్తే బాగుండును (కథ బోరు కొట్టడం వల్ల కూడా కావచ్చు) అనిపిస్తుంది. ఇక నూతన దర్శకుడు నారాయణకి అస్సలు కామెడీ జనర్ మీద గ్రిప్ ఉన్నట్లు కనపడదు. సంగీతం విషయానకి వస్తే బయిట ఆడియో మంచి పేరు తెచ్చుకుంది. అయితే తెరపై విజువలైజేషన్ సరిగ్గా కుదరక సిగెరెట్ పాటల్లా తయరయ్యాయి. ఇక ఈ నిర్మాత గత చిత్రం సోలో తో పోలిస్తే నిర్మాణ విలువలు శూన్యం.

    ఏదైమైనా వేసవి కాలం ఎసిలో కూర్చోవచ్చు అని ఆశపడితే ఫర్వాలేదు కానీ అల్లరి నరేష్ ఉన్నాడుగా కామెడీ కి నవ్వుకోవచ్చు అని ఈ సినిమాకు ధైర్యం చేసి వెళితే మాత్రం నిరాశే.

    English summary
    Allari Naresh, Sharwanand and Shriya Starrer Nuvva Nena Movie released with divide talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X