twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బంది'పోటు' (రివ్యూ )

    By Srikanya
    |

    Rating:
    1.0/5

    ----సూర్య ప్రకాష్ జోశ్యుల

    ఏం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటివాళ్లే రివేంజ్ కథలు చేయాలా...వాళ్లు నా తరహా కామెడీ చిత్రాలు చేస్తున్నప్పుడు నేను వాళ్లు చేసిన చిత్రాలు చేసి హిట్ కొడితే తప్పేంటి అనుకున్నట్లున్నాడు అల్లరి నరేష్. తన కెరీర్ లో కళాఖండంగా మిగిలిన ఫిటింగ్ మాస్టర్ లాంటి మరో చిత్రరాజాన్ని దింపాడు...అదీ సొంతబ్యానర్ పై. దర్శకుడు సైతం అల్లరి నరేష్ తో కామెడీ సినిమా చేస్తే ఏం ప్రత్యేకత ఉంటుదనుకున్నాడో ఏమో...ఇదిగో ఇలాంటి బందిపోటుని దింపి మన సమయాన్ని, సొమ్ముని దొంగలించే ప్రయత్నం చేసాడు. సంపూర్ణేష్ బాబు, సప్తగిరి,అవసరాల శ్రీనివాస్ వంటి కమిడయన్స్ ఉన్నా ఫలితం లేకుండా పోయింది. అల్లరి నరేష్ సైతం తన రెగ్యులర్ మ్యానరిజంలు, ప్యారెడీలు వదిలి కొత్తగా ప్రయత్నం చేసాడు కానీ కథ,కథనం సహకరించలేదు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అవినీతి పరుల్ని మోసాలు చేస్తూ బ్రతికే విశ్వ(అల్లరి నరేష్) ని జాహ్నవి(ఈష) కలుస్తుంది. విశ్వతో ఓ డీల్ కుదుర్చుకుంటుంది. అందులో భాగంగా... అర్దికంగానూ, సామాజికంగానూ ఉన్నత స్ధితిలో ఉన్న మకరందం(తణికెళ్ల భరణి), శేషగిరి రావు(రావు రమేష్), భలే బాబు(పోసాని) ని పూర్తి స్ధాయిలో రోడ్డుపైకి లాగాలి. ఆమె అలా ఎందుకు అడిగింది. ఆ డీల్ ని విశ్వ ఒప్పుకోవటానికి కారణం ఏమిటి...ఆ తర్వాత అతను ఆ ముగ్గురుని ఎలా డీల్ చేసాడు..ఆ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏమిటనేది మిగతా కథ.

    Allari Naresh's Bandipotu review

    సాధారణంగా హీరో ద్వారా హీరోయిన్ పగ తీర్చుకునే ఇలాంటి అతడే ఆమె సైన్యం తరహా కథలు మనకు కొత్తేమి కాదు. అయితే ఇంత ప్యాసివ్ గా కథనం నడుపుతారని ఎవరూ ఊహించరు. విలన్స్ ని చిత్తు చేయటానికి హీరో వేసే ఎత్తులకు ఎక్కడా ఎదురేలేకుండా కథనం వండారు. దాంతో ఎక్కడా ట్విస్ట్ లు, టర్న్ లు కథ తీసుకోరు. ఎక్కడా హీరో ఇరుకున పడటమూ జరగదు. ఈ విధంగా జరగటం తో బోర్ వచ్చేసింది. ఫస్టాఫ్ ఓకే...సెకండాఫ్ లో అయినా కథ మలుపు తిరుగుతుందేమో అనుకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు మొదటి రీల్ లో సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తూంటుంది. దాంతో అల్లరి నరేష్ కొత్తగా చేద్దామనుకున్నా ఏమీ చేయక మిగలే పాత్ర అయ్యిపోయింది. దానికి తోడు సెకండాఫ్ మొత్తం ఎలక్షన్స్ హంగామా తో నడిపారు. పోసాని ఉండే ఆ సీన్స్ మరీ విసుగ్గా ఉన్నాయి.

    ఇక సంపూర్ణేష్ బాబు విషయానికి వస్తే..అతని ఇంట్రడక్షన్ సీన్ తప్ప మరేదీ రాసుకోలేదనిపిస్తుంది. అతన్ని చూడగానే నవ్విన వారు తర్వాత నవ్వుదామనుకున్నా ఆ సిట్యువేషన్ కనపడదు. అలాగే...సప్తగిరి సైతం రొటీన్ ...టీవీ రిపోర్టర్ పాత్రలో అరిగిపోయిన టేప్ రికార్డు క్యాసెట్టులాగ చెప్పిందే చెప్తూ విసుగు కలిగిస్తాడు. అవసరసాల శ్రీనివాస్ వంటి ట్యాలెంటెడ్ ఆర్టిస్టు సైతం అతనికి తగ్గ పాత్ర పడకపోవటంతో డల్ అయ్యిపోయాడు.

    సంగీతం విషయానికి వస్తే కళ్యాణ్ కోడూరి ఇచ్చిన పాటలు డీసెంట్ గా పెద్ద హీరోలకు ఇచ్చినట్లు ఇచ్చారు. రీరికార్డింగ్ సైతం బాగుంది. కెమెరా వర్క్ కూడా కనులకు ఇంపుగా సాగింది. దర్శకుడుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ మేకింగ్ స్టైల్ కూడా అల్లరి నరేష్ ని కొత్తగ ప్రెజెంట్ చేసేలా చేసింది. ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత షార్ట్ గా ఉండేలా దర్సకుడు జాగ్రత్త తీసుకుంటే బాగుండేది.

    ఫైనల్ గా కామెడీ లేని అల్లరి నరేష్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాకు మించిన ఆప్షన్ మరొకటు దొరకదు. కాబట్టి త్వరపడండి.

    చిత్రం: ‘బందిపోటు'
    బ్యానర్ : ఇవివి సినిమా
    నటీనటులు: అల్లరి నరేష్‌, ఈష, తనికెళ్ల భరణి, రావు రమేష్‌, చంద్రమోహన్‌, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్‌, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, అవసరాల శ్రీనివాస్‌, సాయాజీ షిండే తదితరులు ఇతర పాత్రధారులు.
    పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్‌, రాంబాబు గోసాల, కెమెరా: పి.జి.విందా,
    సంగీతం: కల్యాణి కోడూరి.
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
    నిర్మాత: రాజేష్‌ ఈదర
    విడుదల తేదీ: 20, పిభ్రవరి 2015.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Allari Naresh's latest film “Bandipotu” released today with devide talk. Eesha played the female lead role in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X