twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మై వైఫ్ ఈజ్... ('జేమ్స్‌బాండ్‌' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

    గతంలో Married to the Mafia (2002) అనే కొరియా చిత్రం ప్రేరణతో ఇదే నిర్మాతలు రూపొందించిన 'అహనా పెళ్లంట‌' చిత్రం అల్లరి నరేష్ కు బాగానే వర్కవుట్ అయ్యింది. ఆ ప్రేరణతో కాబోలు మరోసారి... కొరియాలో సూపర్ హిట్ అయ్యి...వరస సీక్వెల్స్ వస్తున్న My Wife Is a Gangster (2001) చిత్రం ప్రేరణతో ఈ సారి 'జేమ్స్‌బాండ్‌' అంటూ దిగాడు. ఈ సారి కూడా కామెడీ ఫరవాలేదనిపించేలా ఉండి...వరస ఫ్లాఫుల్లో ఉన్న అల్లరి నరేష్ కెరీర్ కు కాస్త మాత్రమే ఊపిరి పోస్తుంది చిత్రం. ఈ చిత్రంతో పరిచయమైన దర్శకుడు...కేవలం కథ విషయంలో తప్ప... మేకర్ గా మంచి మార్కులే వేయించుకున్నాడు. తన పాత్ర పరిధి తక్కువైనా అల్లరి నరేష్ ఈ సినిమాని ఒప్పుకోవటం గొప్ప విషయమే. ముఖ్యంగా డైలాగులు బాగున్న ఈ చిత్రం రీసెంట్ గా వస్తున్న అల్లరి నరేష్ చిత్రాల కన్నా ఫరవాలేదనిపిస్తుంది. కథలో ప్రెడిక్టుబులిటీని తగ్గిస్తే ఇంకాస్త బాగుండేది అనిపిస్తుంది. ఈ కామెడీ సినిమాలో ఇంకాస్త కామెడీని నింపితే నిజంగానే కామెడీ సినిమా అనిపించేదనిపిస్తుంది.

    లేడీ డాన్ బుల్లెట్ (సాక్షీ చౌదరి) చిన్నప్పుడే విడిపోయిన తల్లిని కలుసుకుంటుంది. ఆ తర్వాత ఆ తల్లి కాన్సర్ తో భాధపడుతోందని తెలుసుకుంటుంది. డాక్టర్ సూచన మేరకు.. ఆమెను సంతోషంగా ఉంచితే త్వరగా రికవరీ అవుతుందనే విషయం తెలుసుకుంటుంది. ఆ క్రమంలో తల్లి కోరికలు తీర్చాలని నిర్ణయించుకుంటుంది. అంతేకాదు..తల్లి దగ్గర తన ఐడెంటిటీ దాచాలనుకునుకుంటుంది. ఇంతకీ ఆ తల్లి కోరిక ఏమిటీ అంటే...తన కూతురు వివాహం చూడటం. దాంతో బుల్లెట్ కు ఇష్టం లేకపోయినా తప్పని సరి పరిస్ధితుల్లో వరుడు వేట మొదలెడుతుంది.

    Allari Naresh's James Bond movie review

    మరో ప్రక్క నాని(అల్లరి నరేష్) సాప్ట్ గా ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీరు. ఓ సారి తన తల్లితో సంప్రదాయ బద్దగా తయారై గుళ్లోకి వచ్చిన బుల్లెట్ ని చూసి మనస్సుపారేసుకుంటాడు. ఆమె కోసం వెతుకుతూంటాడు. ఆ క్రమంలో ఆమెకూడా పెళ్లి కొడుకు కోసం వెతుకుతోందని ఓ మ్యారేజ్ బ్యూరో ఓనర్ (కృష్ణ భగవాన్) ద్వారా తెలుసుకుని ఓ అడుగు ముందుకేసి,ఆమెతో ఏడు అడుగులు నడుస్తాడు. ఆ తర్వాత కొంత కాలానికి అతనికి తను పెళ్లి చేసుకున్నది కత్తిలాంటి అమ్మాయిని కాదని కత్తిని అని తెలుసుకుంటాడు. అప్పుడేం అయ్యింది. తెలిసిన నాని ఏం చేసాడు. మరో ప్రక్క బుల్లెట్ ని చంపాలని తిరుగుతున్న ఆమె ప్రత్యర్ది (ఆశిష్ విద్యార్ధి) సంగతి ఏంటి...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    స్ట్రైయిట్ నేరేషన్ వచ్చిన ఈ చిత్రం మొదటే చెప్పుకున్నట్లు My Wife Is a Gangster (2001) ప్రేరణతో రూపొందినా ..స్క్రిప్టు మీద బాగానే కసరత్తు చేసారు. ముఖ్యంగా సబ్ ప్లాట్ లు బాగా వర్కవుట్ చేసారు. అల్లరి నరేష్ కంపెనీ బాస్ పాత్ర పోసాని ని క్రియేట్ చేసి కొంత ఫన్ ని, ఫ్యాక్షనిస్టుగా జయప్రకాష్ రెడ్డి పాత్రను, ఆయన కొడుకుగా రఘుబాబు పాత్రను క్రియేట్ చేసి కొంత ఫన్ ని క్రియేట్ చేసారు. అయితే జయప్రకాష్ ప్లాట్ కు ముగింపులేదు.

    Allari Naresh's James Bond movie review

    ఇదీ లోపం...

    ఇక సినిమాలో పడీ పడి నవ్వుకునే సిట్యువేషన్స్ లేకపోవటమే ఈ సినిమాలో ఉన్న లోపమని చెప్పాలి. చూస్తున్నంతసేపు బాగానే ఉన్నట్లు అనిపించినా బయిటకు వచ్చాక ఆ ఫన్ ఏమీ గుర్తు ఉండదు. అదీ ఈ సినిమా కు వచ్చిన ఇబ్బంది. అదే శ్రీను వైట్ల చిత్రాలలో ఒక చోట కథను ఆపి కాస్సేపు ఫుల్ గా నవ్వించేస్తాడు. దాంతో సినిమా రిలీజయ్యాక అదే గుర్తుండి రిపీట్ ఆడియన్స్ కు కారణమవుతోంది. శ్రీను వైట్ల శిష్యుడైన ఈ దర్శకుడు అలాంటి కామెడీనీ సినిమాలో బురఖాలతో సృష్టిద్దామని ప్రయత్నించాడు కానీ అనుకున్నంతగా పగలబడి నవ్వేలా క్రియేట్ కాలేదు.

    అలాగే అల్లరి నరేష్ ఈ సినిమాలో కొత్తగా చేసిందేమీ కనిపించదు. కాకపోతే ఒకటే రిలీఫ్ ...అది ప్యారెడీలు లేవు. సప్తగిరి వంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్టుకు సరపడ పాత్రను ఇవ్వలేదు. డైలాగులు మాత్రం సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. సినిమాలో బాగా నవ్వించే ఎపిసోడ్స్ ఓ రెండైనా సెకండాఫ్ లో పెట్టుకుంటే బాగుండేది అనిపించింది. అలా కాకపోవటంతో కొన్ని చోట్ల సీన్స్ రిపీట్ అవుతున్నట్లు, ప్రీ క్లైమాక్స్ లో ఓవర్ సెంటిమెంట్ అయిన ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ని మరింత ఫన్ తో నింపి ఉంటే బాగుండేది.

    అలాగే ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ ఫృధ్వీ నుంచి మరింత ఎక్సపెక్ట్ చేస్తే తర్వాత మెల్లిగా ఆ క్యారెక్టర్ డల్ అయ్యిపోయింది. లెజండ్, సింహా స్ఫూఫ్ లు మాత్రం బాగున్నాయి. పాటల్లో... రీమిక్స్ సాంగ్ మాత్రం చాలా బాగుంది. దానికే రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఇంటర్వెల్ కు ముందు వచ్చే కిషోర్ దాస్ ఎపిసోడ్ ఫన్ బాగా పండించింది. అలాగే డైలాగులు ప్రతీసారి పంచ్ లైన్స్ కోసం ప్రాస ని ఎక్కువగా వాడురు..కొన్ని చోట్ల అనవసరం అనిపిస్తాయి..స్పష్టంగా అది గమనించుకోవాల్సింది.

    Allari Naresh's James Bond movie review

    టెక్నికల్ గా ...ఎడిటర్ చేత మరింత షార్ప్ గా ట్రిమ్ చేయిస్తే బాగుండేది. కెమెరా వర్క్ సినిమాకు గ్రాండ్ లుక్ తీసుకువచ్చింది. మిగతా డిపార్టమెంట్ లు సైతం బాగానే కష్టపడ్డాయి. నిర్మాతలు సైతం అల్లరి నరేష్ సినిమాకు బాగా ఖర్చు పెట్టారు. హీరోయిన్ సాక్షి చౌదరి..సింగిల్ ఎక్సప్రెషన్ తో సినిమా మొత్తం లాక్కొచ్చేయటం ఆమె ఘనత. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాని లైట్ తీసుకున్నట్లున్నాడు..పెద్దగా ఎక్కువ కష్టపడకుండా సింపుల్ గా లాగించేసాడు.

    బ్యానర్ :ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.
    నటీనటులు: అల్లరి నరేష్, సాక్షి చౌదరి, ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణభగవాన్, పోసాని తదితరులు ఇతర తారాగణం.
    మాటలు: శ్రీధర్ సీపాన,
    పాటలు: రామజోగయ్య శాస్త్రి, విశ్వ, భువనచంద్ర,
    ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ మాయ,
    డ్యాన్స్: రాజసుందరం, గాయత్రి రఘురాం, ప్రసన్న,
    ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ,
    కెమెరా: దాము నర్రావు,
    సంగీతం: సాయి కార్తీక్,
    కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర,
    ఎగ్జిక్యూయూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి,
    ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర,
    సమర్పణ: ఎ టీవీ
    స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికోశోర్ మచ్చ.
    విడుదల తేదీ: జూలై 24,2015.

    ఫైనల్ గా... అల్లరి నరేష్ సినిమాలుకు వచ్చేవారు పూర్తి స్ధాయి కామెడీని ఆశిస్తారు. అంతేకాని మిగతా హీరోల చిత్రాల లోగా ..అప్పుడప్పుడూ కామెడీ సీన్స్ వస్తే ఇష్టపడరనే విషయం ఇప్పటికైనా గుర్తించుకోవాలి. ఓపినింగ్స్ సరిగ్గా తెచ్చుకోలేని ఈ చిత్రం అల్లరి నరేష్ గత సూపర్ హిట్ చిత్రాల స్టాండర్డ్ లో లేకుండా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఫర్వాలేదనిపించే నవ్వులతో సా......గి పోతుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Allari Naresh' latest movie “James Bond” released today with postitve talk. Sakshi Chaudhary plays Naresh’s love interest in the film. The movie is written and directed by Sai Kishore Macha and produced by Anil Sunkara under the banner A.K.Entertainments.It features Allari Naresh in the lead role and Sakshi Chaudhary as the female lead while Ashish Vidyarthi, Raghu Babu, and Krishna Bhagavan appear in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X