twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎటిఎం వర్కింగ్ మూవీ రివ్యూ

    నోట్ల రద్దు అనంతరం నెలకొన్న పరిస్థితులను కథగా మలుచుకొని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఎక్కుపెట్టిన తాజా అస్త్రం ఏటీఎం వర్కింగ్.

    By Rajababu
    |

    Rating:
    2.0/5

    సమకాలీన సమస్యలను అస్త్రంగా చేసుకొని సినిమాలు రూపొందించే దర్శకుడిగా పి సునీల్ కుమార్ రెడ్డి మంచి పేరు ఉంది. హుదూద్ నేపథ్యంగా మిస్ లీలావతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కథగా గంగపుత్రులు, యువకుల్లో పెరుగుతున్న విపరీత ధోరణుల ఆధారంగా చేసుకొని రొమాంటిక్ క్రైమ్ కథ తదితర చిత్రాలను ఆయన నిర్మించారు. తాజాగా సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన ఎటిఎం మార్చి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    నోట్ల రద్దు తర్వాత

    నోట్ల రద్దు తర్వాత

    నోట్ల రద్దు అనంతరం నెలకొన్న పరిస్థితులను కథగా మలుచుకొని సునీల్ కుమార్ రెడ్డి ఎక్కుపెట్టిన తాజా అస్త్రం ఏటీఎం వర్కింగ్. ఈ చిత్రంలో డిమానిటైజేషన్ తర్వాత నోటు, ఏటీఎం కష్టాలు, ప్రజల ఇబ్బందులను ప్రస్తావించారు. సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకొనే అంశాలు ఏమున్నాయో తెలుసుకోవాలంటే ఈ చిత్రం కథ, కథనం గురించి తెలుసుకోవాల్సిందే.

    సులభంగా డబ్బు సంపాదించడమే..

    సులభంగా డబ్బు సంపాదించడమే..

    ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని సులభంగా డబ్బు సంపాదించే లక్ష్యంతో బతుకుతుంటారు అనంత్ (ఎ), త్రినాథ్ (టీ), మహేశ్ (ఎమ్) (ఎటిఎం). ఉన్నట్టుండి కోటీశ్వరులమైపోవాలనే దురాశతో మూడు లక్షలు అప్పుచేసి దొంగనోట్ల వ్యాపారానికి పూనుకొంటారు. దొంగనోట్లు ప్రింట్ అయి మార్కెట్ తరలించే నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకొంటారు.

     ముగ్గురు యువకుల కథ..

    ముగ్గురు యువకుల కథ..

    ప్రధాని నోట్ల రద్దు తర్వాత అనంత్, త్రినాథ్, మహేశ్‌ జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటీ? తెచ్చిన అప్పును ఎలా తీర్చారు? నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారు? అనే ప్రశ్నలకు తెరమీద దొరికే సమాధానాలే ఎటిఎం వర్కింగ్ చిత్రం.

     అభిరుచి..  శైలి

    అభిరుచి.. శైలి

    టాలీవుడ్‌లో చక్కటి అభిరుచి, సామాజిక బాధ్యత ఉన్న దర్శకుల్లో సునీల్ కుమార్ రెడ్డి ప్రత్యేకమైన స్థానం. రొటీన్ చిత్రాలకు భిన్నంగా సినిమాలను నిర్మించడంలో ఆయన శైలి విభిన్నమైనది. దేశ స్వాతంత్రం తర్వాత దేశ ప్రజలందరిపై ఎక్కువ ప్రభావం చూపిన అంశం పెద్ద నోట్ల రద్దు. ఈ అంశంపై వెంటనే స్పందించి సినిమాను రూపొందించడం అభినందనీయం. ఏటీఎం కష్టాలను, ఆ తర్వాత సమాజంలోని వివిధ వర్గాలపై పడిన ప్రభావాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు.

    నోట్ల కష్టాలు తెరపైన

    నోట్ల కష్టాలు తెరపైన

    పాకిస్థాన్ టెర్రరిజం నుంచి కుహనా రాజకీయల వరకు, సంపన్నుల నుంచి సామాన్య ప్రజల వరకు పడిన కష్టాలను గంటన్నర నిడివి ఉన్న చిత్రంలో ప్రభావవంతంగా చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే కథలో ఇంటెన్సిటీని చెప్పడంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం సినిమా రసవత్తరంగా సాగలేకపోయింది. పాత్రధారుల ఎంపిక ప్రధాన లోపం. అందుకు కారణం బడ్జెట్ పరిమితులు కావొచ్చు. కాకపోవచ్చు. కానీ కథలో ఉండే తీవ్రతను ప్రభావవంతంగా చెప్పడానికి నటీనటుల ఎంపిక, సాంకేతిక అంశాలు అవరోధంగా మారాయి.

    నటీనటుల ఎంపికలో..

    నటీనటుల ఎంపికలో..

    ఇక సినిమా మొత్తంలో కష్టపడి గుర్తుపడితే మహా అంటే కిశోర్‌దాస్ గుర్తుపట్టొచ్చు. ఎంచుకొన్న కథకు చక్కటి స్క్రీన్‌ప్లే రాసుకోకపోవడం, సన్నివేశాలకు తగినట్టు డైలాగ్స్ లేకపోవడం నిరాశపరిచే అంశం. ఏది ఏమైనా తన అభిరుచి మేరకు సమాజానికి చెప్పాలనుకొన్న కథను తన శైలిలో చెప్పే ప్రయత్నం చేసి తన బాధ్యతను గుర్తు చేశారు.

     ఒకే అనిపించారు..

    ఒకే అనిపించారు..

    పాత్రల పరిధి మేరకు ముగ్గురు యువకులు, వారిలో ఇద్దరికి ప్రియులుగా నటించిన హీరోయిన్లు పర్వాలేదనిపించారు. రాజకీయ నాయకుడిగా కనిపించిన టీవీ యాకంర్ కిషోర్ దాస్ కొన్ని సన్నివేశాల్లో మంచి వేరియేషన్స్ చూపించారు.

     సాంకేతిక నిపుణులు

    సాంకేతిక నిపుణులు

    ఏటీఎం వర్కింగ్ చిత్రానికి ప్రవీణ్ ఇమ్మడి సంగీతాన్ని అందించగా, శివరామ్ సినిమాటోగ్రఫీ, శామ్యూల్ కల్యాణ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు.

    చివరిగా..

    చివరిగా..

    సామాజిక బాధ్యత సినిమాగా రూపొందిన ఏటీఎం చిత్రాన్ని సగటు ప్రేక్షకుడి వద్దకు తీసుకుపోయే అంశాలు చాలా తక్కువే. కొంతమొత్తంలో ఓ సెగ్మెంట్‌కు చేరువ అయితే అందుకు ప్రధాన కారణం దర్శకుడు పీ సునీల్ కుమార్ రెడ్డి అవుతారు. తాము అనుభవించిన నోట్ల కష్టాలను తెరమీద చూసుకొని ప్రేక్షకుడు సంతృప్తి చెందడంపైనే చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.

    నటీనటులు
    బ్యానర్ డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్‌, శ్రావ్య ఫిలిమ్స్
    ప‌వ‌న్‌, కారుణ్య‌, రాకేష్‌, మ‌హేంద్ర‌, నారాయ‌ణ‌, ఆషా, మ‌హేశ్‌, అంబ‌టి శీను, కిశోర్ దాస్, తిరుప‌తి దొరై, వీర‌బాబు, చిల్ల‌ర రాంబాబు, ఆంజ‌నేయులు
    దర్శకత్వం: పీ సునీల్ కుమార్‌రెడ్డి
    నిర్మాతలు: కిశోరి బ‌సిరెడ్డి, య‌క్క‌లి ర‌వీంద్ర బాబు
    సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
    సినిమాటోగ్రఫీ: శివరామ్
    ఎడిటింగ్: శామ్యూల్ కల్యాణ్

    ప్లస్ పాయింట్స్
    కథ
    డైరెక్షన్

    మైనస్ పాయింట్స్
    కథనం
    పాత్రధారుల ఎంపిక
    ఇతర సాంకేతిక అంశాలు..

    Read more about: శ్రావ్య ఫి
    English summary
    The movie is first feature film on Demonetisation which taken Indian prime minister Narendra Modi. This movie is directed by Sunil Kumar Reddy, who made 'Romantic Crime Katha' movie earlier.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X