twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిట్ కు బహు దూర్ (బలాదూర్ రివ్యూ)

    By Staff
    |

    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్ :సురేష్ ప్రొడక్షన్స్
    తారాగణం:రవితేజ,అనూష్క,కృష్ణ,సునీల్,బ్రహ్మానందం,
    చంద్రమోహన్,పరుచూరి వెంకటేశ్వరరావు,రాజ రవీంద్ర,
    సమీర్,ప్రదీప్ రావత్ తదితరులు.
    సంగీతం: కె.ఎమ్. రాధా కృష్ణన్
    డైలాగ్స్ :లక్ష్మీ భూపాల్ ,జలదంకి సుధాకర్
    ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
    యాక్షన్: రామ్ లక్ష్మన్
    సినిమాటోగ్రఫి: బి.బాల మురగన్
    కథ-స్క్రీన్ ప్లే-దర్శకుడు: ఉదయ్ శంకర్
    నిర్మాత :డి.సురేష్ బాబు
    రిలీజ్ డేట్: 14ఆగస్టు 2008

    తన అనుకున్న వారు తనని అనుమానించి..దూరంచేసుకున్నా ఆ భాధని గుండెలోనే దిగమింగి వారి క్షేమం కోసం అన్ని కష్టాలు,నిష్టూరాలు భరిస్తూ నిరంతరం శ్రమించే హీరో పాత్రలు మనకు కొత్తేం కాదు. తెలుగు సినిమా పుట్టిన నాటినుండి ఈ తరహా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చిన చిత్రమే 'బలాదూర్'. దాదాపు ఈ సినిమాలో ఉన్న సన్నివేశాలు అన్నీ మనం గతంలో చూసినవే కావటం ఈ చిత్రం స్పెషాలిటీ. అయితేనేం రవితేజ తనకే సాధ్యమయ్యే మేనరిజమ్స్ ,విరుపులు తో ఈ సినిమాని లాక్కొచ్చాడు. నిర్మాతల మెయిన్ టార్గెట్ అయిన ఫ్యామిలీలు దీన్ని తెలిసిన సినిమాగా అనుకోకపోతే వర్కవుట్ అవుతుంది.

    బలాదూర్ గా తిరిగే ఓ కుర్రాడు కి అనుకోని స్ధితిలో భాద్యతలు మీద పడితే అతను వాటినెలా నెరవేర్చాడనే పాయింటుతో వచ్చిన ఈ సినిమాలో ఆ కుర్రాడు చంటి(రవితేజ). అతనికో పెదనాన్నరామకృష్ణ(కృష్ణ). ఆయనంటే పిచ్చి ప్రేమ గల చంటి ఆయన గురించే గొడవ పడి కుటుంబంనుండి దూరమవుతాడు. అంతేగాక కృష్ణ కొడుకులు(రాజా రవీంద్ర,సమీర్) ఇద్దరూ సన్నాసులు. మరో ప్రక్క చంటి...భానుమతి (అనూష్క)తో ప్రేమలో పడతాడు. ఇక అప్పటికే ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని పాత పగతో రగిలిపోతున్న విలన్ (ప్రదీప్ రావత్) ఇది అలసుగా తీసుకుని కొత్త కొత్త ప్లాన్స్ వేస్తూంటాడు. కుటుంబం నుంచి దూరమైన చంటి విలన్ నుండి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అనేదే మిగతా కథ.

    దాదాపు ఎనిమిదేళ్ళ క్రితం ఇదే బ్యానర్ లో 'కలిసుందాంరా' సినిమాతో తెలుగువారిని పలకరించిన తమిళ దర్శకుడు ఉదయ్ శంకర్ అందించిన సినిమా ఇది. అయితే అప్పటి తరహా ఫ్యామిలీ డ్రామానే ఈ సారి నమ్ముకున్నా గత సినిమాల్లో (లక్ష్మీ- పనికిరాని ఇద్దరు తమ్ముళు,విలన్ ట్రాక్ ,మనసంతా నువ్వే-హీరో వేరే వారితో తగువు పడుతూండటం చూసిన చెల్లి పెళ్ళి వారు సంభంధం కాన్సిల్ చేసుకుని వెళ్ళిపోవటం,గౌతమ్ ఎస్.ఎస్.సి లోని హీరో వదిన సమస్య తీర్చటం తదితర) వచ్చిన సన్నివేశాలే రిపీట్ కావటం మైనస్ గా మారింది.దాంతో అప్పటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా అన్నది భేతాళ ప్రశ్న.

    ఇక చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ కృష్ణ పూర్తి స్ధాయి పాత్రలో నటించటం ఆయన ఆనందపరిచే విషయమే. అయితే చిరవలో ఆయనకు ఫైట్ పెట్టడం కాస్త అతిగా అనిపిస్తుంది. సెంటిమెంటు యాక్షన్ సన్నివేశాలు అవసరమున్నా లేకపోయినా కూర్చటంతో రవితేజ సహజంగా చేసే అల్లరి కొంత మిస్సయిన ఫీలింగ్ వస్తుంది. ఇక అనూష్క అందాల ఆరబోతకే సరిపెట్టింది. డైలాగులు కొన్ని చోట్ల ద్వందార్ధాలుగా ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఎక్స్ క్లూజివ్ గా చేసిన చిత్రంలో అనవసరమేమో అనిపిస్తుంది. ఇక ప్లస్సులలో బ్రహ్మానందం,సునీల్ కామిడీ కనిపిస్తాయి. దెయ్యం ఎపిసోడ్ కొత్తగా ఉండి రిలీఫ్ నిచ్చింది. టెక్నికల్ గా ఈ సినిమా మంచి స్టాండర్డ్ నే ఫాలో అయింది.

    పాత కథకు పాత తరహా స్క్రీన్ ప్లే నే దర్శకుడు ఎన్నుకున్నాడు. దాంతో కథనం పెద్దగా ఆసక్తి రేపలేకపోయింది. నిజానికి ఇలాంటి పాయింటుతో గతంలో వచ్చిన పవన్ తమ్ముడు లో అయితే భాక్సింగ్ నేఫద్యం తీసుకుని కథకు నిండుతనం తీసుకొచ్చాడు.తన కుటుంబం తనని బేవార్స్ అని పట్టించుకోక వదిలేస్తే అనుకోని పరిస్ధితుల్లో అన్న టార్గెట్ ని తనదిగా చేసుకుని గెలిపొంది శభాష్ అనిపించుకుంటాడు.అలాంటి ఎలిమెంటు ఒకటి ఈ కథలో తీసుకుంటే కథ మరింత స్పీడుగా పరిగెత్తేది.అలాగే తండ్రి చనిపోయి భాధ్యతలు తనపై వేసుకునే సన్నివేశం వద్ద ఇంటర్ వెల్ వస్తే సమవిభజన జర్గి ఉండేది.

    యేదైమైనా కథ పై మరింత కసరత్తు చేసి ఇప్పటి యూత్ ని ప్రతిభింబించేలా కథ అల్లి ఉంటే మరికొంత మంది ఐడెండిటీ చేసుకుని చేసుకుని ఉండేవారు. అయినా ఈ సినిమా ఫ్యామిలీలు ,ముఖ్యంగా మహిళలకు నచ్చేలా సెంటిమెంటు సీన్లుతో వచ్చింది కాబట్టి వారు వస్తే నిలబడే అవకాశం ఉంటుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X