twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జయసుధ కొడుకు ఎంట్రీ.... ‘బస్తీ’ (రివ్యూ...)

    By Bojja Kumar
    |

    Rating:
    1.5/5

    ప్రముఖ నటి జయసుధ తన వారసుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసారు. జయసుధ కొడుకు శ్రేయన్‌ కపూర్ నటిస్తున్న ‘బస్తీ' మూవీ నేడు గ్రాండ్ గా విడుదలైంది. వజ్మన్ ప్రొడక్షన్స్ బేనర్లో వాసు మంతెన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రేయాన్ సరసన ప్రగతి హీరోయిన్ గా నటించింది. ముఖకేష్ రిషి, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు పోషించారు. మరి జయసుధ తనయుడు ఎంట్రీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

    కథ విషయానికొస్తే...
    అమ్మిరాజు(ముఖేష్ రిషి), బిక్షపతి (కోట శ్రీనివాసరావు) మధ్య చాలా కాలంగా కుటుంబ గొడవలు, ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి. భిక్షపతి తనయుడు భవాని(అభిమన్యు సింగ్) అమ్మిరాజు మనిషి సిస్టర్‌ను చంపేస్తాడు. దీంతో అతడు బిక్షపతి కూతురు శ్రమంతి(ప్రగతి)ని కిడ్నాప్ చేస్తాడు. అదే సమయంలో అమ్మిరాజు బ్రదర్ విజయ్(శ్రేయాన్ కపూర్) విదేశాల నుండి ఇండియా వచ్చి ఫ్యామిలీకి సడెన్ సర్ ప్రైజ్ ఇస్తాడు. ఈ క్రమంలో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది.

    పెర్ఫార్మెన్స్...
    ‘బస్తీ' సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన శ్రేయాన్ కపూర్ లుక్స్ హీరో రేంజికి తగిన విధంగా లేవు. యాక్టింగ్ స్కిల్స్ కూడా అంతంత మాత్రమే. నటనలో మరింత పరిణితి చెందాల్సి ఉంది. ప్రగతి చౌరాసియా అందం పరంగా, లుక్స్ పరంగా ఓకే. ఆమె పాత్రకు పెర్ఫార్మెన్స్ పరంగా స్కోపు లేకుండా పోయింది. ఇతర ముఖ్య నటులైన కోట శ్రీనివాసరావు గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. తన సహజైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖేష్ రిషి, అభిమన్యు సింగ్ తమ తమ పాత్రల్లో పెర్పార్మెన్స్ అదరగొట్టారు.

       ప్రముఖ నటి జయసుధ తన వారసుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసారు. జయసుధ కొడుకు శ్రేయన్‌ కపూర్ నటిస్తున్న ‘బస్తీ' మూవీ నేడు గ్రాండ్ గా విడుదలైంది. వజ్మన్ ప్రొడక్షన్స్ బేనర్లో వాసు మంతెన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రేయాన్ సరసన ప్రగతి హీరోయిన్ గా నటించింది. ముఖకేష్ రిషి, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు పోషించారు. మరి జయసుధ తనయుడు ఎంట్రీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.  కథ విషయానికొస్తే... అమ్మిరాజు(ముఖేష్ రిషి), బిక్షపతి (కోట శ్రీనివాసరావు) మధ్య చాలా కాలంగా కుటుంబ గొడవలు, ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి. భిక్షపతి తనయుడు భవాని(అభిమన్యు సింగ్)  అమ్మిరాజు మనిషి సిస్టర్‌ను చంపేస్తాడు. దీంతో అతడు బిక్షపతి కూతురు శ్రమంతి(ప్రగతి)ని కిడ్నాప్ చేస్తాడు. అదే సమయంలో అమ్మిరాజు బ్రదర్ విజయ్(శ్రేయాన్ కపూర్) విదేశాల నుండి ఇండియా వచ్చి ఫ్యామిలీకి సడెన్ సర్ ప్రైజ్ ఇస్తాడు. ఈ క్రమంలో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది.  పెర్ఫార్మెన్స్... ‘బస్తీ’ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన శ్రేయాన్ కపూర్ లుక్స్ హీరో రేంజికి తగిన విధంగా లేవు. యాక్టింగ్ స్కిల్స్ కూడా అంతంత మాత్రమే. నటనలో మరింత పరిణితి చెందాల్సి ఉంది. ప్రగతి చౌరాసియా అందం పరంగా, లుక్స్ పరంగా ఓకే. ఆమె పాత్రకు పెర్ఫార్మెన్స్ పరంగా స్కోపు లేకుండా పోయింది. ఇతర ముఖ్య నటులైన కోట శ్రీనివాసరావు గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. తన సహజైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖేష్ రిషి, అభిమన్యు సింగ్ తమ తమ పాత్రల్లో  పెర్పార్మెన్స్ అదరగొట్టారు.  టెక్నికల్ అంశాల పరంగా చూస్తే... ఈచిత్రానికి ఇమ్మడి ప్రవీణ్ అందించిన సంగీతం బావుంది. సినిమా విడుదల ముందు నుండే ఈ పాటలకు మంచి రెస్పాన్స్ ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. గౌతం రాజు ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే బావుండనిపిస్తుంది. ప్రభాకర్ డైలాగులు ఫర్వాలేదు. వికే గుణశేఖక్ సినిమాటోగ్రపీ ఓకే..  దర్శకుడికి ఇదే తొలి సినిమా.  నిర్మాణ బాధ్యతలతో పాటు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని తన భుజాలపై వేసుకున్నాడు. తను అనుకున్న స్టోరీని పర్ ఫెక్టుగా తెరపై ప్రజంట్ చేయలేక పోయాడు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడంలో విఫలం అయ్యాడు. స్క్రీప్లే బాగోలేక పోవడం పెద్ద మైనస్.  ఓవరాల్ గా సినిమాలోని ప్లస్సు, మైనస్ పాయింట్ల గురించి చర్చిస్తే... సంగీతం, సినిమాటోగ్రఫీ బావున్నాయి. వీక్ స్టోరీ, పసలేని స్క్రీన్ ప్లే, సినిమా సాగదీసినట్లు ఉండటం పెద్ద మైనస్. డైరెక్షన్లో కూడా పరిణితి లేదు. శ్రేయాన్ కపూర్ రోల్ పవర్ ఫుల్ గా, రొమాంటిక్ ప్లాన్ చేసిన దర్శకుడు తెరపై సరిగా చూపించలేక పోయాడు. స్క్రిప్టు వర్కు మరింత పక్కాగా ఉండాల్సింది. ముఖేష్ రిషి, కోట, అభిమన్యు సింగ్ ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వాడుకోలేక పోయాడు. ఓవరాల్ గా ‘బస్తి’ సినిమా నిరాశ పరిచే విధంగా ఉందని చెప్పక తప్పదు.

    టెక్నికల్ అంశాల పరంగా చూస్తే...
    ఈచిత్రానికి ఇమ్మడి ప్రవీణ్ అందించిన సంగీతం బావుంది. సినిమా విడుదల ముందు నుండే ఈ పాటలకు మంచి రెస్పాన్స్ ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. గౌతం రాజు ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే బావుండనిపిస్తుంది. ప్రభాకర్ డైలాగులు ఫర్వాలేదు. వికే గుణశేఖక్ సినిమాటోగ్రపీ ఓకే..

    దర్శకుడికి ఇదే తొలి సినిమా. నిర్మాణ బాధ్యతలతో పాటు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని తన భుజాలపై వేసుకున్నాడు. తను అనుకున్న స్టోరీని పర్ ఫెక్టుగా తెరపై ప్రజంట్ చేయలేక పోయాడు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడంలో విఫలం అయ్యాడు. స్క్రీప్లే బాగోలేక పోవడం పెద్ద మైనస్.

    ఓవరాల్ గా సినిమాలోని ప్లస్సు, మైనస్ పాయింట్ల గురించి చర్చిస్తే... సంగీతం, సినిమాటోగ్రఫీ బావున్నాయి. వీక్ స్టోరీ, పసలేని స్క్రీన్ ప్లే, సినిమా సాగదీసినట్లు ఉండటం పెద్ద మైనస్. డైరెక్షన్లో కూడా పరిణితి లేదు. శ్రేయాన్ కపూర్ రోల్ పవర్ ఫుల్ గా, రొమాంటిక్ ప్లాన్ చేసిన దర్శకుడు తెరపై సరిగా చూపించలేక పోయాడు. స్క్రిప్టు వర్కు మరింత పక్కాగా ఉండాల్సింది. ముఖేష్ రిషి, కోట, అభిమన్యు సింగ్ ఉన్నప్పటికీ వారిని సరిగ్గా వాడుకోలేక పోయాడు. ఓవరాల్ గా ‘బస్తి' సినిమా నిరాశ పరిచే విధంగా ఉందని చెప్పక తప్పదు.

    English summary
    Jayasudha's son Shreayan Kapoor's debut film Basthi movie review and rating.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X