»   » స్టైల్ తప్ప సత్తాలేదు(డేవిడ్ బిల్లా రివ్యూ)

స్టైల్ తప్ప సత్తాలేదు(డేవిడ్ బిల్లా రివ్యూ)

Posted by:
Subscribe to Filmibeat Telugu

సంస్థ: ఎస్.వి.ఆర్ మీడియా ప్రై.లి
నటీనటులు: అజిత్, పార్వతి ఓమనకుట్టన్, బ్రూనా అబ్దుల్లా, ప్రభు తదితరులు...
సంగీతం: యువన్ శంకర్ రాజా
నిర్మాత(తెలుగురైట్స్): శోభారాణి
దర్శకత్వం: చక్రి తోలేటి

గతంలో అజిత్ నటించిన 'బిల్లా' చిత్రం తమిళనాట భారీ విజయం సాధించింది. మాఫియా సామ్రాజ్యాధినేతగా బిల్లా క్యారెక్టర్ ను రూపొందించారు. తాజాగా 'డేవిడ్ బిల్లా' అనేది ఆచిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందించారు. ఈ చిత్రంలో హీరో డాన్ కాక ముందు ఏం చేసేవాడు? ఎక్కడి నుంచి వచ్చారు? అతను డాన్‌గా ఎలా ఎదిగాడు అనే విషయాలు చూపించారు. మరి సినిమా విశేషాలు ఏమిటో చూద్దాం.

శ్రీలంకలో జరుగుతున్న సివిల్ వార్ మూలంగా తన తల్లి దండ్రులను కోల్పోయిన డేవిడ్ బిల్లా(అజిత్) ఇండియాలోని రామేశ్వరం వచ్చి అక్కడి శరణార్థుల క్యాంపులో ఆశ్రయం పొందుతాడు. తన కాళ్ల మీదన తాను నిలబడతామనుకుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఓ పోలీసులను చంపేస్తాడు. అతని సిన్సియారిటీని, ధైర్యాన్ని చూసి సెల్వరాజ్ అతన్ని నేరాల వైపుగా నడిపిస్తాడు. మరో వైపు జాస్మిన్(పార్వతి ఓమన కుట్టన్)ను చూసి మనసు పారేసుకంటాడు డేవిడ్ బిల్లా.

డబ్బు సంపాదనే లక్ష్యంగా డేవిడ్ బిల్లా అబ్బాసి(సుదాషు పాండే)చెందిన డ్రగ్స్ మాఫియాతో చేతులు కలుపుతాడు. డేవిడ్ బిల్లా తెలివి తేటలు, భయంలేని తనం చూసి ఫిదా అయిపోయి అతనికి మంచి స్నేహితుడౌతాడు అబ్బాసి. అయితే డేవిడ్ బిల్లా ఎదుగుదల తనకు ఎప్పటికైనా ప్రమాదం అనే ఆలోచనతో అతని రెక్కలు కత్తిరించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలౌతుంది. అబ్బాసితో దూరంగా ఉంటూ సొంతంగా డీల్స్ మొదలు పెట్టిన డేవిడ్ బిల్లా యూరోపియన్ డీరల్ డిమిట్రితో చేతులు కలుపుతాడు. ఈక్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో బిల్లా అబ్బాసిని చంపేస్తాడు. ఇలా ఇంటర్నేషనల్ లెవల్‌కి ఎదిగిన బిల్లా తన శత్రువులను మట్టు పెడుతూ మాఫియా సామ్రాజ్యానికి కింగ్ ఎలా అయ్యాడు అనేది తర్వాతి కథ.

ఈ చిత్రాన్ని అజిత్ వన్ మ్యన్ షోగా చెప్పుకోవచ్చు. అతని స్టైలిష్ లుక్, ఎక్సలెంట్ డైలాగ్స్ బాగున్నాయి. గ్యాంగ్ స్టర్ రోల్‌లో జీవించాడు. హెలిక్యాప్టర్ స్టంట్స్‌లో అజిత్ పెర్ఫార్మెన్స్ సూపర్ అని చెప్పొచ్చు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం అయ్యారు.

సుదాషు పాండే లిమిటెడ్ రోలే అయినా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విద్యుత్ జామ్ వాలా, రెహమాన్, మనోజ్ కె. జయన్, కృష్ణ కుమార్, యోగ్ జాపీ, ఇలవరాసు తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు. మీనాక్షి దీక్షిత్, గాబ్రియేలా బెర్టాంటె స్పెషల్ సాంగులు ఇంప్రెసివ్ గా ఉన్నాయి.

సినిమా హైలెట్స్ విషయానికొస్తే...నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. అజిత్ పెర్పార్మెన్స్ పరంగా అదరగొట్టాడు. ఆర్ డి రాజశేఖర్ అందించిన సినిమాటో గ్రీఫీ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణ బాగుంది.మైనస్ పాయింట్ విషయానికొస్తే.... చక్రి తోలేటి డైరెక్షన్ పరంగా విఫలం అయ్యాడు. సీన్స్ లో డెప్త్ లేక పోవడం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. స్ర్కీన్ ప్లే కూడా ఆసక్తికరంగా లేదు.

మొత్తం మీద ఈచిత్రం స్టైలిస్‌గా రూపొందించారు కానీ సినిమాలో విషయం లేదు. అయితే అజిత్ అభిమానులకు మాత్రం ఫర్వాలేదు అనిపిస్తుంది. అజిత్ స్టైలిష్ లుక్స్, యాక్షన్స్ సీన్స్ వారిని అలరిస్తాయి. మామూలు ప్రేక్షకులు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. సాధారణంగా మాఫియా నేపథ్యం ఉన్న చిత్రాల్లో చెప్పుకోదగ్గ స్టోరీ ఏమీ ఉండదు. ఇందులో అంతే. ఎంటర్ టైన్మెంట్..ఫన్ ఆశించి సినిమాకు వెళితే నిరాశ తప్పదు.

English summary
David Billa is one of those movies which have a lot of style but absolutely no substance. Ajith’s fans will love his super cool looks and his fights. But for the common movie lover, the substandard characterization and poor screenplay act as major minus points. If you want to catch a very stylish Ajith and some superb visuals, you may try to sit through this flick this weekend. If entertainment and fun are on your agenda, stay away.
Please Wait while comments are loading...