twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి మార్కు ఫ్యామిలీ డ్రామా (ఎర్ర బస్ రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.5/5

    హైదరాబాద్: దర్శక రత్న దాసరి నారాయణరావు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే 150 సినిమాలు తీసిన ఘనమైన చరిత్ర ఆయనది. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 151 సినిమా ‘ఎర్ర బస్'. దాసరి, మంచు విష్ణు, క్యాథరిన్ ప్రధాన పాత్ర ధారులుగా తెరకెక్కిన ఈచిత్రం తమిళంలో విజయం సాధించిన ‘మంజపై' సినిమాకి రీమేక్.

    తాతా మనవళ్ల అనుబంధం నేపథ్యంలో సాగిన ఈచిత్రంలో తాత పాత్ర దాసరి నారాయణరావు పోషించారు. ఆయన మనవడి పాత్రలో మంచు విష్ణు నటించారు. ఫ్యామిలీ అనుబంధాల నేపథ్యంలో సాగిన ఈ చిత్రం ఓలా ఉందనే దానిపై ఓ లుక్కేద్దాం రండి.

    కథలోకి వెళితే....
    రాజేష్(మంచు విష్ణు) హైదరబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తాత సత్యనారాయణరావు (దాసరి నారాయణరావు) వద్దే పెరుగుతాడు. తాతయ్య అంటే రాజేష్ కు చాలా ఇష్టం. అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలని కలలుకనే రాజేష్ తన శక్తి మేర ప్రయత్నించి ఆఫర్ దక్కించుకుంటాడు. అమెరికా వెళ్లే ముందు తాతయ్య కొంత కాలం తన వద్దే ఉంచుకుని సంతోషంగా ఉంచాలనుకుంటాడు. ఇందులో భాగంగా తాతను పట్నం తీసుకొస్తాడు. మరో వైపు డాక్టర రాజీ(కేథరిన్ థెరిస్సా)తో ప్రేమాయణం నడుపుతుంటాడు రాజేష్. తాతయ్య సిటీకి వచ్చిన తర్వాత రాజేష్ జీవితంలో అనుకోని సంఘటనలు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏమైంది అనేది తెరపై చూడాల్సిందే...

    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే..... దాసరి నటన సినిమాకు హైలెట్. ఒక రకంగా సినిమా మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. దాసరితో పోలిస్తే మంచు విష్ణు పెర్ఫార్మెన్స్ తేలిపోతుంది. విష్ణు పాత్ర పరంగా చూస్తే ఆయన పెర్ఫార్మెన్స్ మరీ గొప్పగా లేక పోయినా ఓకే అనే విధంగా ఉంది. ఇక కేథరిన్ తన పాత్ర పరిధి మేరకు పెర్ఫార్మెన్స్ పరంగా, అందం పరంగా ఆకట్టుకుంది. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలు ఏమీ లేవు. బ్రహ్మానందం లాంటి టాప్ కమెడియన్ ఉన్నా...ఆయన పాత్ర నవ్వించలేదు.

    టెక్నికల్

    టెక్నికల్

    టెక్నికల్ అంశాల విషయానికొస్తే...అంజి సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే సినిమాలో ప్రేక్షకులకు విసుగు తెప్పించే సీన్లను కత్తిరించడంలో, సినిమాను నిడివి పర్‌ఫెక్టుగా సర్దడంలో కోటగిరి మరింత మెరుగ్గా ఉంటే బాగుండేది అనిపించింది. చక్రి అందించిన సంగీతం ఫర్వాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

    ఇదీ సంగతి

    ఇదీ సంగతి

    దాసరి గొప్ప దర్శకుడే. అయితే ఆయన దర్శకత్వం వహించిన 151వ సినిమా ‘ఎర్ర బస్' మాత్రం ఇప్పటి జనరేషన్‌ను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేక పోయిందనేది వాస్తవం. తమిళంలో హిట్టయిన మంజూ‌పై సినిమాకు రీమేక్ అయినప్పటికీ, తెలుగుకు వచ్చే సరికి బాగా మార్పులు. సాగదీత మరీ ఎక్కువైంది. తమిళ వెర్షన్‌తో పోలిస్తే అరగంట నిడివిపి పెరిగింది.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    సినిమా ఫస్టాఫ్ విష్ణు, కేథరిన్ లవ్ ట్రాకుతో వేగంగా సాగింది. సెకండాఫ్‌లో సెంటిమెంటు సీన్లతో కంటతడి పెట్టించాడు. ఇంటర్వెల్ ఆసక్తికరంగా ఉంది. క్లైమాక్స్ కుటుంబ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ‘ఎర్ర బస్' చిత్రం దాసరి మార్కు ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు.

    English summary
    Erra Bus is the upcoming movie directed and produced by veteran actor Dasari Nasaraya Rao under the banner of Tharaka Prabhu Films. It is the remake of Tamil hit movie, Manjapai and it released today (November 14) . Manchu Vishnu, Dasari Narayan and Catherine Tresa are playing the lead roles in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X