twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సౌఖ్యం లేదు... ( 'లౌక్యం' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.0/5

    హిట్ కొట్టాలంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ లా మరి నడుస్తున్న కామెడీనే సౌఖ్యం అనేదాన్ని బాగా నమ్మినట్లున్నారు లౌక్యం టీమ్. అయితే ఎంత కామెడీలో అయినా కూసింత కథ, కాస్త కొత్త మలుపులు ఉండేలా దర్శక,రచయితలు లౌక్యం ప్రదర్శించి ఉంటే బాగుండేది. అయితే బ్రహ్మానందం ఉన్నాడు కదా ఆయన లాగేస్తాడులే... అని బ్రహ్మానందం మీదే భారం పెట్టి, ఆయన్ను అడ్డం పెట్టుకుని ఒడ్డెక్కాలనే ప్రయత్నం చేసారు. రవితేజను గుర్తు చేసేలా హీరో నటన, శ్రీను వైట్ల స్క్రీన్ ప్లేని దగ్గర పెట్టుకుని చేసినట్లున్న కథనం... ఈ సినిమా చూస్తుంటే గతంలో వచ్చిన ఐదారు సినిమాలు ఒకేసారి చూసిన ఫీల్ కలగచేసింది. అయితే గోపీంచంద్ తో సమానంగా బ్రహ్మానందం సీన్లు రాసుకుని కామెడీతో కథను కదం తొక్కించే ప్రయత్నం చేసారు. కానీ ప్రెడిక్టుబుల్ గా నడిచే కథనం, క్లైమాక్స్ అంత ఆసక్తిని కలిగించవు.

    వరంగల్ లో ఉండే వెంకీ అలియాస్ వెంకటేశ్వరులు(గోపిచంద్) లోకల్ గూండా బాబ్జీ(సంపత్) చెల్లెలుని తన స్నేహితుడు ప్రేమిస్తే కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేస్తాడు. దాంతో అచ్చ తెలుగు విలన్ లాంటి బాబ్జీ...వెంకీని వెతుకుతూంటే...తప్పించుకోవటానికి హైదరాబాద్ వస్తాడు. అక్కడ వెంకీ ఓ రోజు చంద్రకళ(రాకుల్ ప్రీతి సింగ్) తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ప్రేమలో పడిపోతాడు. పడిందే తడువుగా ఆమెను ఇంప్రెస్ చేయటానికి రకరకాల విన్యాసాలు చేసి మెప్పిస్తాడు....పనిలో పనిగా డ్యూయిట్స్ వేసుకుంటాడు. అయితే ఇక్కడో ట్విస్ట్ వెంకీ ని పూర్తిగా ఇరుకున పడేస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటీ అంటే చంద్రకళ మరెవరో కాదు... బాబ్జీ రెండో చెల్లెలు. అక్కడ నుంచి వెంకీ లవ్ స్టోరీ ఏ మలుపు తీసుకుంది...చివరకు ఏమైంది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    అల్లు అర్జున్ పరుగు చిత్రం ను గుర్తు చేసే ఈ చిత్రం ట్విస్ట్ కి కామెడీతో డీల్ చేయాలనే ఆలోచన బాగానే ఉన్నప్పుటికీ ట్విస్ట్ ఊహించగలిగేలా మారి ఇంటర్వెల్ బ్యాంగ్ ఎఫెక్టివ్ గా లేదు. అలాగే సెకండాఫ్ పరమ రొటీన్ గా ఉండటం జరిగింది. బ్రహ్మానందం పాత్ర సిప్పీగా నవ్వించినా...అదీ ఇంతకుముందు చూసిన సిట్యువేషన్స్ నుంచి రావటం జరిగింది. ఇక రచయితలు కొత్తగా ఫీలైంది...కేవలం ప్రతీసారి విలన్ ఇంట్లో హీరో వెళ్లటం జరుగుతోంది...ఈ సారి హీరో ఇంట్లో విలన్ రావటం పెట్టారు. అదొక్కడే మిగతా శ్రీను వైట్ల సినిమాలకు దీనికీ తేడా. అంతే.

    అప్పటికి రచయితలు కోన, గోపీ మోహన్ ఉన్నంతలో బాగానే నవ్వించారనే చెప్పాలి. అలాగే అంత రొటీన్ క్లైమాక్స్ లోనూ బాయిలింగ్ స్టార్ బబ్లూ అంటూ పృద్వీ చేసిన కామెడీ బాగా వర్కువుట్ అయ్యింది. థియోటర్ నుంచి బయిటకు వచ్చాక ఏం చూసాము అంటే చెప్పలేం కానీ.. ఉన్నంత సేపూ నవ్వుకున్నాం అని చెప్పగలుగుతారు.

    మిగతా రివ్యూ స్లైడ్ షోలో..

    ఓకే కానీ..

    ఓకే కానీ..

    గోపీచంద్ ..దాదాపు రణం చిత్రం తర్వాత అలాంటి జోష్ పాత్రలో కనిపించాడు. చిత్రం అంతా సరదాగా నవ్వించాలని పిక్సై చేసాడు. అప్పటికీ ఫైట్స్ అవీ ఇందులో తగ్గించుకున్నాడు. తనను తాను మార్చుకుని ట్రెండ్ లోకి రావాలనుకోవటం మంచిదే కానీ ...రొటీన్ ట్రాక్ రావాలనుకోవటం కొంచెం కష్టమనిపిస్తుంది.

     స్క్రిప్టే మైనస్

    స్క్రిప్టే మైనస్

    హీరోలు తెలుగులో వస్తున్న సినిమాలు చూడరా అనే డౌట్ ఈ చిత్రం చూస్తుంటే వస్తుంది. ఎందుకంటే చాలా కథలు కలిపి చేసినట్లున్న ఈ కథను ఎందుకింత ఖర్చుపెట్టి చేసారా అని ఆశ్చర్యం వేస్తుంది. కథే, అందులో ట్విస్ట్ లు రొటీన్ వే అనుకుంటే...దానికి తగ్గట్లు అల్లుకున్న కథనం సైతం బాగా పాతగా ఉంది. ఇక కథా రచయితే అందించిన డైలాగులు కొన్ని బాగానే పేలాయి కానీ ..మరీ ప్రాసతో రాస్తే డైలాగు అన్నట్లుగా ఉండి కొన్ని చోట్ల విసిగించాయి.

    పాటలు

    పాటలు

    అనూప్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే సోసాగ ఉంది. అయితే చిత్రంలో రెండు పాటలు ఓకే అనిపిస్తాయి. మరీ సిగరెట్ పాటల్లా లేకుండా దర్శకుడు కొంతలో కొంత జాగ్రత్తలు తీసుకున్నాడు.

     లవ్ ట్రాక్ ..

    లవ్ ట్రాక్ ..

    ఫస్టాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా కృత్రిమంగా...ఉంది. సినిమాకి పెద్దగా హెల్ప్ కాలేదు. దాంతో ఫస్టాఫ్ కొంత బోర్ గా, బ్రహ్మానందం ఉన్నప్పుడు ఎంటర్టైనింగ్ గా నడుస్తుంది.

    బ్రహ్మానందం

    బ్రహ్మానందం

    బ్రహ్మానందం హీరోగా సక్సెస్ కాలేదు కానీ సెకండ్ హీరో గా సక్సెస్ అవుతున్నాడనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య వచ్చే చాలా సినిమాలో సగభాగం సీన్స్ బ్రహ్మానందం తోనే ఉంటున్నాయి. ఈ సినిమాదీ అదే పరిస్ధితి.

    హైలెట్స్

    హైలెట్స్

    ఈ చిత్రం హైలెట్స్ లో ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ పృధ్వీ నటన అని చెప్పాలి. క్లైమాక్స్ అతని హంగామా లేకపోతే సినిమా చూడలేకపోదుము. అయితే అది వేరే సినిమాలో ట్రాక్ ని గుర్తుకు తెస్తూంటుంది.

    టెక్నికల్ గా..

    టెక్నికల్ గా..

    ఎడిటర్ చేత మరింత షార్ట్ గా సీన్స్ కట్ చేయించి, ట్రిమ్ చేయించి లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది. అలాగే ఫైట్ మాస్టర్ సైతం సోసో గా చేసారు. కెమెరా వర్క్ బాగుంది.

    ఎవరెవరు

    ఎవరెవరు

    నటీనటులు: గోపీచంద్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ , సంపత్, హంసా నందిని, బ్రహ్మానందం, పృద్వీ తదితరులు.
    ఛాయాగ్రహణం: వెట్రి,
    ఎడిటింగ్ : శేఖర్‌,
    సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
    కథ, మాటలు: శ్రీధర్ సీపాన
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీవాస్
    నిర్మాత వి ఆనంద ప్రసాద్
    విడుదల తేది 26, సెప్టెంబర్ 2014.

    ఫైనల్ గా తెలుగు సినిమాలు అప్పుడప్పుడూ మాత్రమే చూసేవారికి ఇది బాగుంటుంది. ప్రేక్షకులు మతిమరుపు ఏ స్ధాయిలో ఉందనేదే దానిపై ఈ చిత్రం విజయం రేంజి ఆధారపడి ఉంటుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Gopichand, Rakul Preet starrer Loukyam released today (September 26) with average talk. Directed by Sriwass, the film produced by V Anand Prasad under Bhavya Creations banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X