twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంపూ...చంపేసాడు! (హృదయ కాలేయం రివ్యూ)

    By Bojja Kumar
    |

    Rating:
    2.0/5
    హైదరాబాద్: ఒక్క సినిమా కూడా చేయలేదు, వారసత్వ మార్కు అసలే లేదు, పేరున్న డైరెక్టర్‌తో చేయడం లేదు, నిర్మాత కూడా ముక్కూ మొహం తెలియనివాడే. అయినా 'హృదయ కాలేయం' చిత్రం, ఆ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంపూర్ణేష్ బాబు బాగా పాపులయ్యాడు. ఇంటర్నెట్‌‌ను బాగా వాడుకుని ఓ రేంజిలో పాపులారిటీ సంపాదించారు. సినిమా విడుదల కాకముందే సంపూర్ణేష్ బాబు అంటే కామెడీ హీరో అనే పేరు తెచ్చుకున్నాడు. సంపూర్ణేష్ బాబు అంటే ఇతడే అని టక్కున గుర్తు పట్టే రేంజికి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

    నేను కత్తిపట్టి నరకడం మొదలు పెడితే ముక్కలేరడానికి ప్రొక్లైనర్ రావాలి, రక్తం పారడానికి డ్రైనేజులు తవ్వాలి. పులికి ఆకలేస్తే పులిహోర తింటుందా, ధైర్యానికి భయమేస్తే.. దిండుకింద నా ఫోటో పెట్టుకుని పడుకుంటుంది రా లాంటి డైలాగులతో ఈ చిత్రానికి ఇంత హైప్ తెచ్చిన ఘనత దర్శకుడు స్టీవెన్ శంకర్ దే. సీరియస్‌గా సాగే డైలాగులను కమెడీ పుట్టేలా చెప్పడం సంపూర్నేష్ బాబుకే చెల్లింది. ఇన్నాళ్లు ఇంటర్నెట్ యూట్యూబులో సంచలనం సృష్టించిన 'హృదయ కాలేయం' చిత్రం ఎట్టకేలకు ఈ రోజు విడదలైంది. మరి ఈ సినిమా సంగతులేమిటో రివ్యూల్లో చూద్దాం.

    స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన రివ్యూ విశేషాలు.....

    హృదయ కాలేయం స్టోరీ

    హృదయ కాలేయం స్టోరీ

    సంపూర్ణేష్ బాబు (సంపూర్ణేష్ బాబు) ఓ అనాధ. ఎలక్ట్రీషియన్ పని చేసే అతను ఏ టు జెడ్ అని ఒకసంస్థను స్థాపించి అందరికి సహాయపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో నీలవేణి (కావ్య కుమార్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. నీలుపై ప్రేమ పెంచుకుంటాడు. నీలుకు ఈ విషయం చెప్పగా అమె ఓ కండీషన్ పెడుతుంది. నాకు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే 100% మగాడు కావాలి, అలాంటి వాడినే పెళ్లాడుతానని చెప్పడంతో తనను తాను నిరూపించుకునే ప్రయత్నం మొదలు పెడతాడు.

    హృదయ కాలేజయం స్టోరీ

    హృదయ కాలేజయం స్టోరీ

    ఇందులో భాగంగా సంపూర్నేష్ బాబు ఎలాగయినా రూ. 500 లకే కంప్యూటర్ తయారు చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అలా "నీలు సంప్యుటర్" తయారు చేస్తాడు ఆ ఫార్ములా కోసం కొందు చేసిన దాడిలో నీలవేణి గాయపడుతుంది. నీలవేణి హృదయం చెడిపోయింది అని కృత్రిమ గుండె అమర్చాలని డాక్టర్స్ చెప్పగా ఖరీదయిన హృదయానికి బదులు తనే ఒక కృత్రిమ హృదయాన్ని తయారు చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో సంపూర్ణేష్ బాబు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? హృదయ కాలేయం అనే టైటిల్‌కి దర్శకుడు న్యాయం చేసాడా? అనేది తెరపై చూడాల్సిందే.

    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్

    పెర్ఫార్మెన్స్ పరంగా సంపూర్ణేష్ బాబు ఒకే. ఆ పాత్ర ఎలా చేస్తే బాగుంటుందో అలానే చేసాడు. అయితే హీరోయిన్లు కావ్య కుమార్, ఇషికా సింగ్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయలేదనే చెప్పాలి.

    కాన్సెప్టు

    కాన్సెప్టు

    సినిమా మొత్తం సీరియస్‍‌గా సాగుతుంది. కానీ సంపూర్ణేష్ బాబు నటన, సన్నివేశాలు నవ్వు తెప్సిస్తాయి. వాస్తవానికి సినిమా కాన్సెప్టు కూడా అదే. అయితే అందరికీ ఇలాంటి కామెడీ నచ్చుతుందని కచ్చితంగా చెప్పలేం. మొత్తానికి మనం ఇన్నాళ్లు చూసిన స్టార్ హీరోల డైలాగులు, సన్నివేశాలు......ఒక కామెడీ హీరో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ చిత్రం.

    ఎంటర్టెన్మెంట్

    ఎంటర్టెన్మెంట్

    యూట్యూబులో ఏ ఐదు నిమిషాలో పదినిమిషాలో చూస్తే నవ్వుస్తొంది. కానీ సినిమా మొత్తం 2 గంటల పాటు ఇదే తీరున సాగితే విసుగొస్తుంది. అయితే ఫస్టఫ్‌లో మాత్రం దర్శకుడు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడంలో సఫలం అయ్యాడని చెప్పొచ్చు. అయితే సెకండాఫ్ వచ్చే సరికి సాగదీత ఎక్కువైంది. సినిమాకు ప్రధాన బలమైన కథలో పస లేదు. అదే విధంగా లాజిక్ లేని సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి. టెక్నకల్ అంశాల విషయానికొస్తే సినిమా సన్నివేశాలకు తగిన విధంగా బ్యాగ్రౌండ్ స్కోరు బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా ఫర్వా లేదు. అయితే ఎడిటింగ్ పై ఇంకా శ్రద్ధ పెడితే బాగుండేది. ఇతర విభాగాలు ఫర్వాలేదనే విధంగా పనితీరు కనబర్చాయి.

    ఫైనల్‌గా చెప్పేదేమంటే...

    ఫైనల్‌గా చెప్పేదేమంటే...

    మొత్తానికి ఈచిత్రం యూట్యూబులో కామెడీ సీన్లు, డైలాగులు చూడటం అలవాటు పడిన యువ ప్రేక్షకులకు సినిమా నచ్చే అవకాశం ఉంది. అయితే ఇతర వర్గాల ప్రేక్షకులకు సంపూ పెర్ఫార్మెన్స్, హృదయ కాలేయం కాన్సెప్టు ఏ మేరకు ఎక్కుతుంది? అనేదానిపై ఈ చిత్ర విజయం ఆధార పడి ఉంటుంది.

    ఇతర వివరాలు

    ఇతర వివరాలు

    దర్శకత్వం : స్టీవెన్ శంకర్
    నిర్మాత : సాయి రాజేష్ నీలం
    సంగీతం : ఆర్.కె
    నటీనటులు : సంపూర్నేష్ బాబు, కావ్య కుమార్, ఇషిక సింగ్
    విడుదల తేదీ : 4 ఏప్రిల్ 2014

    English summary
    Director Steven Shankar's latest directorial venture Hrudaya Kaleyam is a comedy action entertainer movie, which has hit the marquee today (April 4). Burning Star Sampoornesh Babu and Ishika Singh have played the lead roles in the film, which has been produced by Sai Rajesh Neelam under the banner of Amrutha Productions. RK has scored music for the songs, while Srikanth Pendyala has composed the background score.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X